పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : శివుండు బ్రహ్మమొదలగువారి ననుగ్రహించుట.

4-202-సీ.
పావక జిహ్వలు బాహుఖండంబులు
లనొప్పఁ బిలిపించి హ్నికిచ్చె
పూషు దంతంబులు పూషున కిప్పించె
ర్గుని నయనంబు ర్గు కిచ్చె
భారతి ముక్కును భారతి కిప్పించి
ముక్కున కొక మంచి ముత్తె మిచ్చె
గ్నిదేవుని యాలి ల్లన రప్పించి
నుముక్కులును ముక్కు తికి నిచ్చె

4-202.2-తే.
మఱియు భద్రుండు దెచ్చిన సురల యంగ
కంబులెల్లను మరలంగఁ రుణ నిచ్చెఁ
దెగినవారల జీవుల మగుడ నిచ్చి
భయమిచ్చి సంభావించె భవుఁ డపుడు.

టీక :-
పావకుడు = అగ్ని; జిహ్వ = నాలుక; పూషుడు = సూర్యుడు; మగుడ = తిరిగి; సంభావించు = ఆదరించు.
భావము :-
అగ్నిని పిలిపించి అతని నాలుకలూ, చేతులూ అతనికిప్పించివేసెను. సూర్యుని దంతములు సూర్యునకు ఇచ్చివేసెను. భర్గుడి కళ్ళను తిరిగి ఇప్పించివేసెను. సరస్వతి ముక్కును సరస్వతికిప్పించి ముక్కుకు ఒక మంచి ముత్యాన్ని కూడా ఇచ్చెను. అగ్ని దేవుని భార్య స్వాహాదేవిని రప్పించి చనుమొనలు, ముక్కును ఆమెకు ఇప్పించెను. ఇంకనూ వీరభద్రుడు తెచ్చిన దేవతల అవయవములు అన్నీ ఎవరివి వారికి దయతో ఇచ్చేవేసెను. చనిపోయినవారిని తిరిగి బ్రతికించి భవుడు అభయమిచ్చి వారిని అందరినీ ఆదరించెను.

4-203-క.
రికి సురపతికిఁ గరుణను
రుసన్ బిలిపించి చక్ర జ్రాయుధముల్
రిచర్మధరుం డిచ్చెను
భసమున సురలు బ్రహ్మ సంస్తుతిసేయన్.

టీక :-
సురపతి = దేవేంద్రుడు; సరభసము = వేగము.
భావము :-
గజచర్మధారి పరమశివుడు విష్ణువుని పిలిపించి చక్రాయుధమును, ఇంద్రుడిని పిలిపించి వారి వజ్రాయుధమును ఇచ్చెను. బ్రహ్మదేవుడు, దేవతలు సంతోషించి కీర్తించారు.

4-204-క.
శంర దేవుని పంపున
పంజభవుఁ డొక్క తగరుడియున్ననిరా
టంముగ దానిశిరమును
లంకించెను దక్షుతనువు క్షణ మొదవన్.

టీక :-
పంపున = పంపగా; పంకజభవుడు = బ్రహ్మ; తగరు = పొట్టేలు; లంకించు = అంటించు; లక్షణము = గుర్తు; ఒదవు = కలుగు.
భావము :-
శివుడు ఆనతీయ బ్రహ్మ ఒక పొట్టేలు పడియుంటే దాని తలను తెచ్చి దక్షని శరీరానికి అతికించెను. దానితో దక్షుడు పురరుజ్జీవుడు అయ్యెను.

4-205-వ.
ఇవ్విధంబున.

4-206-క.
క్షునితల యంటించిన
క్షుఁడు నలుదెసలు చూచినచిత్తములో
క్షీణభక్తి వెలయఁగ
క్షారికి మ్రొక్కె సిగ్గునరఁగఁ బ్రీతిన్.

టీక :-
అక్షీణ = శాశ్వతమైన; తనరు = అతిశయించు.
భావము :-
అలా పొట్టేలు తల  యతికించగా పునరుజ్జీవితుడైన దక్షుడు నలువైపులా చూసాడు. తన మనసులో శాశ్వతమైన భక్తి కలిగింది. అంత దక్షుడు శివునకు అధికమైన సిగ్గుతో ప్రీతితో నమస్కరించెను.

4-207-క.
"నినుఁదెలియక మతిమాలితి
నినుఁదెలియక ఖలుఁడ నైతి నీలగ్రీవా!
నినుఁదెలియక గతిఁ దప్పితి
నినుఁదెలియక మరులుకొంటి నిరుపమమూర్తీ!

టీక :-
ఖలుడు = మూర్ఖుడు; మరులుకొను = మోహించు.
భావము :-
"నీలకంఠా! మతిలేక నిన్ను తెలుసుకోలేకపోయాను. నిన్ను తెలుసుకోలేక మూర్ఖుడనయ్యాను. నిన్నెరుగక దారి తప్పాను. సాటిలేనివాడా! నిన్ను తెలుసుకోక ఇతరములపై మోహాన్ని పొందాను.

4-208-క.
నీవేల నాకు నొందెడు
నీవు దురత్ములను నెల్ల నేరవు బ్రోవన్
నీవిధముఁ దెలియ వశమే
నీవెఱవుఁ దలంపఁ దరమె నిర్మలకీర్తీ!

టీక :-
ఒందు = చేరు; వెఱవు = మార్గము.
భావము :-
నువ్వెలా నాకు లభిస్తావు? నీవు దుష్టులను అందరినీ రక్షించవు. నీ పద్ధతి తెలుసుకోగలమా? నిర్మల కీర్తీ! నీ మార్గము ఊహించగలమా?

4-209-క.
బంరనానాకల్మష
బంధంబులు చుట్టముట్టి భావములోనన్
బంధించి బలిసి యున్నవి
బంధంబులఁ బాపి కరుణఁ బాటింపు శివా!

టీక :-
బంధము = కట్టు.
భావము :-
శివా! మనస్సులో అనేక కల్మష బంధములు చుట్టుముట్టి యున్నాయి. ఈ బంధాలనుండి విముక్తిని కలిగించి దయచూడు.

4-210-క.
నినునే విధమునఁ గొలుతును
నినునే విధమునఁ దలంతు నిను నెబ్భంగిన్
వినుతింతు నానతీవే
నుపమగుణహార! త్రిజగభినవరూపా!

టీక :-
భంగి = విధము; వినుతి = పొగడ్త.
భావము :-
సాటిలేని గుణములు కలవాడా! ముల్లోకాలకూ కొత్తరూపమైనవాడా! నిన్ను ఎలా సేవించను? ఎలా స్మరించను? ఎలా కీర్తించను? చెప్పవయ్యా!

4-211-క.
గంగారమణిమనోహర!
గంగారంగత్తరంగ లిత శిరోజా!
గంగాసలిల వినోదన!
గంగాతటినీ సమీప మనవిహారా!

టీక :-
కలిత = పొందిన; తటి = తీరము; గమనము = ప్రయాణము.
భావము :-
గంగాదేవీ మనోహరా! గంగా తరంగాలకు రంగస్థలమైన జడలు కలవాడా! గంగా జలాలలో వినోదించేవాడా! గంగ ఒడ్డున విహరించేవాడా!

4-212-క.
గౌరీకుచపరిరంభణ!
గౌరీముఖచంద్ర బింబ గంధ సరోజా!
గౌరీమానసరంజన!
గౌరీనయనారవింద మలాధిపతీ!

టీక :-
పరిరంభణ = ఆలింగనము.
భావము :-
గౌరీదేవి కుచాలింగనము చేసేవాడా! గౌరీదేవి ముఖమనే చంద్రబింబానికి సువాసనలు వెదజల్లే కలువపూవు వంటివాడా! గౌరిదేవి మనస్సును రంజింపచేసేవాడా! గౌరీదేవి నేత్రాలనే పద్మాలకు సూర్యుని వంటివాడా!"

4-213-వ.
అని మఱియు శరణంబు వేఁడిన దక్షునిం గనుంగొని రజతగిరి మందిరుం డిట్లనియె.
భావము :-
అని ఇంకనూ శరణము వేడిన దక్షుని చూసి పరమేశ్వరుడు ఇలా అన్నాడు.

4-214-ఆ.
"మ్ము మఱవఁ దగునె హనీయ మగు బుద్ధి
లిగినడువు మెల్ల కార్యములను
నీకు నివ్విధంబు నీనేరమునఁ గాని
త్కృతంబుగాదు మాను దక్ష!

టీక :-
మత్ = నాయొక్క; కృతము = చేయబడినది.
భావము :-
"మమ్మల్ని మరచిపోవచ్చునా! అన్ని పనులయందు మంచి బుద్ధి కలిగి నడుచుకో. దక్షా! నీకు ఈవిధముగా జరగడానికికారణం నీ తప్పులే కానీ నేను చేసినది కాదు."

4-215-క.
ని పరమేశుఁడు ప్రియమునఁ
గణనాయకులలోన క్షుని నునిచెన్
నుఁడు దయాళుఁడు శంభుఁడు
జాక్షప్రముఖ సురలు వారక పొగడన్.

టీక :-
వారక = ఎడతెగక, విడివక.
భావము :-
అని పరమేశ్వరుడు ప్రేమతో దక్షుని తన గణనాయకులలో ఒకడిగా నియమించెను. శంభుడు గొప్పవాడు, దయగలవాడు అంటూ విష్ణువు మొదలైన వారు దేవతలు ఎడతెగకుండా పొగిడారు.

4-216-వ.
మఱియు తదీయావసరంబున నారాయణ బ్రహ్మేంద్రాదిదేవ గణంబులు దండప్రణామంబు లాచరించి కరకమలంబులు ఫాలంబునఁ జేర్చి యిట్లని స్తుతియింపఁ దొడంగిరి.

టీక :-
ఫాలము = నుదురు.
భావము :-
ఇంకనూ ఆ సమయంలో నారాయణుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు చేతులెత్తి నమస్కరించి చేతులు నుదుటిన చేర్చి ఇలా స్తుతించసాగారు.

4-217-సీ.
"భుజగేంద్రభూషాయ! భూతాధినాథాయ!
నిత్యానురాగాయ! నిర్మలాయ!
గంగావతంసాయ! ఖండేందుజూటాయ!
దేవాది దేవాయ! దిక్పటాయ!
వేదాంతవేద్యాయ! వీరప్రతాపాయ!
కైవల్యనాథాయ! నఘనాయ!
ణరంగవీరాయ! మణీయరూపాయ!
భువనాభిరామాయ! పురహరాయ!

4-217.1-ఆ.
ఓంనమశ్శివాయ! ఓంకారరూపాయ!
శంకరాయ! రిపుభయంకరాయ!
దనసంహరాయ! మానితకైలాస
మందిరాయ! నీలకంధరాయ!

టీక :-
అవతంసము = సిగబంతి.
భావము :-
"సర్పములను ఆభరణములుగా ధరించినవాడా! భూతగణాలకు నాయకుడా! నిత్యమూ ప్రేమను కురిపించేవాడా! నిర్మలమైనవాడా! గంగను, చంద్రరేఖను జటలో పూవువలె ధరించినవాడా! దేవాధిదేవా! దిక్పతుడా! వేదములచే స్తుతించబడినవాడా! వీర ప్రతాపము కలిగినవాడా! కైవల్యమిచ్చేవాడా! గొప్పవారికే గొప్పవాడా! యుద్ధరంగంలో వీరుడా! అందమైనరూపం కలవాడా! అన్ని లోకాలూ పూజింపదగినవాడా! త్రిపురాసుర సంహారకుడా! ఓంకార రూపుడా! శంకరా! శతృవులకు భయంకరమైనవాడా! మన్మథుని సంహరించినవాడా! పూజనీయమైన కైలాసం నివాసంగా కలవాడా! నీలకంఠా! నమశ్శివాయ.

4-218-క.
జయగౌరీవల్లభ!
జయ కైలాసనాధ! య కరుణాబ్ధీ!
జయ త్రిజగన్మోహన!
జయ లోకైకమాత! య శర్వాణీ!

టీక :-
అబ్ధి = సముద్రము.
భావము :-
గౌరీమనోహరా! జయము. కైలాసపతీ! జయము. కరుణా సముద్రుడా! జయము. త్రిజగన్మోహనా! జయము. లోకైకమాతా! జయము. శర్వాణీ! జయము.జయము.

4-219-వ.
అని మఱియు ననేకవిధంబుల నయ్యాదిదంపతుల స్తుతియింప నంత నప్పరమేశ్వరుండును వీరభద్రునిం జూచి కరుణావిశేషమానసుండై భద్రకాళియును నీవు నిందు రమ్మని చేరంబిలిచి సమ్మదమున గాఢాలింగనంబు చేసి; తన యంకపీఠంబున నునిచి వినుతించె; వారల గౌరీదేవియును కృపాకటక్ష యై యుల్లంబున సంతసిల్లి వీక్షించె; నివ్విధంబున సతియునుఁ బతియును గారవించి యిరువురు నిట్లని యానతిచ్చిరి.

టీక :-
సమ్మదము = సంతోషము; అంకపీఠము = తొడ భాగము; వినుతించు = పొగడు, అభినందించు; వీక్షించు = చూచు.
భావము :-
అని ఇంకనూ అనేక విధములుగా ఆ ఆది దంపతులను దేవతలు స్తుతించారు. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని భద్రకాళిని దయతో ఇలా రమ్మని దగ్గరకు పిలిచి సంతోషంతో గాఢముగా కౌగిలించుకొని తన తొడపై కూర్చుండచేసి అభినందించెను. వారిని గౌరీదేవి కూడా మనసులో సంతోషిస్తూ చూసింది. ఈ విధముగా ఆ ఆది దంపతులు వారిని గౌరవించి ఇలా ఆనతిచ్చారు.

4-220-క.
"లోకంబులు గల్పింపఁగ
లోకంబులు గావ నణఁప లోకైకనిధీ!
నీకును భారము మీఁదట
నాకాధిపవినుతచరణ !నాగేంద్రధరా!"
భావము :-
"ఇంద్రాదులు పొగిడే పాదములు కలవాడా! నాగేంద్రధరుడా! లోకములను సృష్టించడం, లోకములను రక్షించడం, లోకములను నశింపచేయటం ఇకనుంచీ నీ భారమే."