పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : దక్షుని యజ్ఞ వృత్తాంతము దధీచి శివునకుఁ దెల్పుట.

4-47-సీ.
నీలకంఠునకును నెచ్చెలిగాఁడొకో
టమటీఁడైన యీ యంబుజాక్షుఁ
హికంకణునకు మూఁవకన్ను గాఁడొకో
పాటుమాలిన యట్టి పావకుండు
గంగాధరునకు సండికాఁడు గాఁడొకో
వెనుకూళ్ల మారైన యనిమిషపతి
పురవైరికిని తల పుష్పంబు గాఁడొకో
నిర్భాగ్యుఁ డైన యీ నీరజారి

4-47.1-తే.
యేమి కుడువంగ వచ్చితి రిందు మీరు
తాము పాలించునట్టి లోముల విడచి
పంచవదనుని కను జేఁగురించెనేని
క్షణంబునఁ దమయాళ్ల త్రాఁళ్లుదగవె.

టీక :-
అటమటీడు = మోసగాడు; అంబుజాక్షుడు = విష్ణువు; అహి = పాము; పాటు = శ్రమ; పావకుడు = అగ్ని; సంగడికాడు = స్నేహితుడు; అనిమిషపతి = దేవేంద్రుడు; నీరజారి = చంద్రుడు; ఆలు = భార్య; తాడుతెగు = భర్త చనిపోవు.
భావము :-
నీలకంఠునకు స్నేహితుడు కాదా ఆ మోసగాడైన విష్ణువు? నాగ కంకణునకు మూడవ కన్ను కాదా శ్రమలేని అగ్ని? గంగాధరునకు స్నేహితుడు కాదా (వెనుకూళ్ళమారు = ఇంద్రుడు?) ఆ ఇంద్రుడు? పురవైరికి తలలో పువ్వు కాదా ఆ నిర్భాగ్యుడైన చంద్రుడు? మీరు పాలించే లోకాలను విడిచి ఏమి తినడానికి వచ్చారిక్కడికి? పంచముఖుని కనులెరుపైతే ఆ క్షణములో మీ భార్యల తాళ్ళు తెగుతాయని తెలీదా!

4-48-ఉ.
రితంబు లెల్లఁ దన యాత్మ నెఱింగి కలంగి దిక్కులన్
జూచి కడిందికోపశిఖ చుట్టి మనంబున సందడింపఁ దా
రాలనాధు సన్నిధికి ల్లన వచ్చి భవాని నీశునిం
జూచి నమస్కరించి తనచేతులు మోడ్చి మహేశుకిట్లనెన్.

టీక :-
చరితము = చరిత్ర; కడింది = చాలా; రాచలనాధు = వెండికొండ.
భావము :-
ఆ గత చరిత్రంతా అలా తన మనసులో తలచుకొంటూ, దిక్కులను చూస్తూ, కోపంగా సిగను చుట్టుకుంటూ మనస్సులో జ్ఞాపకం తెచ్చుకుంటూ తాను వెండికొండ చేరి భవానీశంకరులను దర్శించాడు. తన చేతులు జోడించి నమస్కరించి పరమేశ్వరునితో ఇలా అన్నాడు.

4-49-చ.
హర! నేఁడు దక్షుఁడు రమావర దిగ్వర వాగ్వరాదులం
బిలిచి హిమాద్రిపై మనలఁ బిల్వక యాగముఁ జేయు చున్నవాఁ
వున మీరు వేగఁ జని చ్చట శూరుల వానితోడుత
న్నవడఁ జెండి పీచము లడంచి ననున్ బ్రమదాత్ముఁ జేయవే.

టీక :-
రమావరుడు = విష్ణువు; దిగ్వర = దిగ్గజేంద్రులు; వాగ్వరుడు = బ్రహ్మదేవుడు; అలవు = బలము; పీచమణచు = పొగరణచు; ప్రమద = సంతోషము.
భావము :-
"శివా! నేడు దక్షుడు విష్ణువు, దిక్పాలకులు, బ్రహ్మాదులను పిలిచి మనలను పిలువకుండా హేమాద్రిపై యాగము చేస్తున్నాడు. మీరు బలములతో వేగముగా అక్కడకు వెళ్ళి యచ్చటి శూరులను దక్షునితో సహా వారి పొగరణచి నన్ను సంతోషపెట్టవా!

4-50-ఉ.
దారుణబాహుదండ బల దండధరోన్మది కుంభికుంభకం
ఠీవ వైరిదానవఫణివ్రజశేఖర పన్నగాంతకా
కాభుజంగహార భుజ ర్వమదోద్ధత పంచబాణసం
హాత్రిలోకవీర త్రిపురాసుర దర్పవిరామ శంకరా!

టీక :-
దండధరుడు = యముడు; కుంభి = ఏనుగు; కుంభ = ఏనుగు కుంభస్థలము; కంఠీరవ = సింహము; వ్రజము = సమూహము; విరామ = ఆపుట.
భావము :-
భయంకర బాహుబలముతో యమధర్మరాజనే మదపుటేనుగు కుంభస్థలమును కొట్టిన సింహమా! శతృవులైన రాక్షస మహాసర్పమనే సమూహానికి గరుడుని వంటివాడా! నాగాభరణా! భుజగర్వ బలంకలిగిన మన్మథుని సంహరించినవాడా! ముల్లోక వీరా! త్రిపురాసురుని గర్వమును అణచినవాడా! శంకరా!"

4-51-వ.
అని విన్నవించిన నతని పలుకులు విని పరమేశ్వరుండు కోపించి.

టీక :-
విన్నవించు = మనవి చేయు.
భావము :-
అని దధీచి మనవి చేయగా ఆ మాటలు విన్న పరమేశ్వరుడు కోపించి.

4-52-ఉ.
"ధారుణి దిగ్ధిరం దిరుగఁ దామరసప్రభవాండభాండముల్
బోరున ఘూర్ణిలన్ నిఖిల భూతములున్ బెగడొంద శూలి హుం
కాము చేనెఁ జేసిన నఖండతరప్రళయాగ్నిసన్నిభా
కారుఁడు వీరభద్రుఁ డతి ర్వసముద్రుఁడు పుట్టె రౌద్రతన్.

టీక :-
ధారుణి = భూమి; దిగ్ధిరం = గిరగిరా; తామరసుడు = బ్రహ్మదేవుడు; ఘూర్ణిల్లు = తలకిందులగు; బెగడు = భయపడు; అఖండము = సమస్తము; సన్నిభ = సమానము.
భావము :-
భూమి గిరగిరా తిరుగగా బ్రహ్మాండ భాండములన్నీ తలకిందులు కాగా సమస్త భూతములూ భయపడగా శివుడు హుంకారము చేసెను. అపుడు అనంతమైన ప్రళయాగ్ని వంటి సముద్రమంత గర్వము గల వీరభద్రుడు రౌద్రముగా పుట్టెను.

4-53-వ.
ఇట్లు పుట్టి.

4-54-సీ.
లలిత వేదండ ర్మాంబరంబుపై
భుజగేంద్ర చిహ్నంబు పొల్చువాఁడు
కాలాగ్ని హేతి సంఘంబుకైవడి నొప్పు
దినూఱుచేతులఁ రఁగువాఁడు
ప్రళయాభ్రవిద్యుత్ప్రభాభాసురం బగు
మెఱుగారుకోఱల మెఱయువాఁడు
భానుబింబముతోటి ర్వతాగ్రముభంగి
నెమ్మేని మణికిరీటమ్మువాఁడు

4-54.1-ఆ.
లుగువాఁడు నిప్పు లొలుకుఁజూపులవాఁడు
మంటలెగయు నొసలి కంటివాఁడు
లిమిఁబట్టి యెట్టి బ్రహ్మాండములనైనఁ
ద్రుంపువాఁడు రిపులఁ జంపువాఁడు.

టీక :-
వేదండము = ఏనుగు; పొల్చు = ప్రకాశించు; హేతి = మంట.
భావము :-
గజ చర్మ వస్త్రముపై సర్ప భూషణములచే ప్రకాశించేవాడు, కాలాగ్ని మంటల సమూహములా యుండే వేయి చేతులు గలవాడు, ప్రళయకాల విద్యుత్తులా మెఱిసే కోరలు గలవాడు, పర్వత శిఖరముపై సూర్యబింబం కనిపిస్తున్నట్లు తలపై మణికిరీటము గలవాడు, రౌద్రుడు, నిప్పులు రాలే చూపులు కలవాడు, అగ్నిని చిమ్మే కన్నును నొసటిపై కలవాడు, తన బలముచేత యెంతటి బ్రహ్మాండములనైనా తెంపేవాడు, శతృవులను చంపేవాడు.

4-55-వ.
మఱియుఁ బ్రచండమార్తాండమండలమండితోద్దండ తేజో విరాజిత దుర్నీక్షణకుండలాభరణుండును, సహస్రరవి మండల తేజోవిలాస ప్రకాశిత దివ్వదేహుండును, బాలసూర్యప్రభా పటల చటులపద్మరాగ మణిమకుటవిటంక విలంబమాన కర్కాటకశిరోవేష్టన కాలకూట త్రినేత్రసంయుక్తంబై రౌద్రరసంబు వెదచల్లు హస్తసహస్రంబును, గఠోరకుఠార గదాదండ భిండివాల కరవాల ముసలముద్గర తోమర భల్లాంగ ప్రాస పట్టిన కోదండ శర చక్ర ముష్టిసంబగళ గదా త్రిశూల పరశులవనిలాంగోష్ఠ్యసి క్షురి కౌతళ వంకుళీ యమదండ నారసజముదాళ శక్తిప్రముఖ దివ్యదివ్యాయుధసమూహ శిఖా సమాశ్రయంబై బ్రహ్మాండంబు వ్రక్కలించునట్టి దీర్ఘబాహుదండసహస్రంబును, నారాయణేంద్రాది నిఖిలదేవతాదుల మణిఘటిత మకుటారణ్యస్ధలీ రంగవల్లీరణరంగ తాండవక్రియా నిర్ఘాత భయదండంబు లగు చరణారవింద రాజితుండును భుజంగ రుద్రాక్షమాలికా విభూతి త్రిపుండ్ర శార్దూల చర్మాంబర సామజచర్మాంబర రథారూఢుండును, వజ్ర వైడూర్యేంద్ర నీల గోమేధిక పుష్యరాగ మరకత పద్మరాగాది మౌక్తికహార కేయూర కంకణాంగుళీయక మంజీరాంకిత దివ్యదేహుండును, ప్రళయకాల సమయపయోధరగర్జిత నిర్ఘాతజనితనినదసన్నిభ సకల భువనభయంకర సింహనాదుండును, సకల బ్రహ్మాండభాండసముదయ భయద విపరీతాట్టహాసుండును, విపుల విలయకాలానల మారుత శైలశిఖర ప్రపాత నాసికాపుటకుటీనిశ్శ్వాసుండును, మదగజగండభేరుండ సింహశరభశార్దూలాది సంగర విద్యావిశారదుండును, నిఖిల లోకైకోత్పత్తిస్ధితిలయప్రకారుండును, నిర్జరారాతిసంఘాత నిరస్తగహనక్రియాకలాపుండును, అఖిల భూత సమాశ్రయుండును నైన ధూమకేతుండును, త్త్రెలోక్యదానవ విదారుండును, అనేక సహస్రకోటి మధ్యందినమార్తాండపటల ప్రభోజ్జ్వలుండును, శైవదూషకజన వక్త్ర పదతాడన నిర్ఘాత సంఘటితుండును, అగణిత గుణగణాలంకృతుండును, అసహాయశూరుండును, అతులిత దుర్వారగర్వదర్పోద్ధతుండును నై యొప్పుచున్న వీరభద్రేశ్వరుండు.

టీక :-
ప్రచండ = మిక్కిలి తీవ్యమైన, చూడరాని; మార్తాండుడు = సూర్యుడు; మండిత = అలంకరించబడిన; ఉద్దండ = ఎక్కువైన; దుర్నిరీక్ష్యము = చూడశక్యము కాని; పటల = కప్పు; చటుల = చంచలమైన; విటంక = భవనము శిఖరము లందలి పక్షి గూడు; విలంబము = వేలాడుతున్న; కర్కాటకము = ఎండ్రకాయ, పీత; శిరోవేష్టన = తలపాగ; కుఠారము = గొడ్డలి; భిండివాలము = ఇనుప అలుగు; ముసలము = రోకలి; ముద్గరము = సమ్మెట; తోమర = చిల్లకోల; భల్ల = బల్లెము; ప్రాస = ఈటె; కోదండము = విల్లు; శరము = బాణము; ముష్టి = కత్తిపిడి; పరశు = గండ గొడ్డలి; లవన = కోయుటకైన కొడవలి; లాంగల = నాగలి; క్షురి = చిన్నకత్తి; నారసము =ఇనుప బాణము; జముదాడి = మొలకత్తి; నిరస్త = తిరస్కరింపబడిన; ధూమకేతుడు = అగ్ని; విదారువు = విదారించిట అనగా వ్రయ్యలుచేయుట చేయువాడు.
భావము :-
చూడలేనంత మిక్కలి తీవ్రమైన సూర్యమండలమును అలంకరించిన గొప్పతేజస్సుతో విరాజిల్లే చూడశక్యముకాని కుండలములు (చెవి ఆభరణము) ధరించినవాడును, వేయి సూర్యమండలముల తేజస్సుతో ప్రకాశించే దివ్యమైన శరీరము కలవాడును, భవన శిఖరాలపై యుండే పక్షిగూడు వంటి తలపాగాతో, దానిపై పెట్టుకున్న కిరీటపు అంచునయున్న మణులు బాలభానుని కిరణాల వలె ప్రకాశిస్తూ కదలుతుండగా, కాలకూటము, త్రినేత్రములు కలిగి, కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. అతని వేయి చేతుల యందు కఠినమైన గొడ్డలి, గద, దండము, ఇనుప అలుగు, చేతికత్తి, రోకలి, సమ్మెట, చిల్లకోల, బల్లెము, ఈటె, విల్లు, బాణము, చక్రము, పిడికత్తి, గద, త్రిశూలము, గండగొడ్డలి, కొడవలి, నాగలి, చిన్నకత్తి, ఇనుప బాణము, మొలకత్తి, శక్తి మొదలైన దివ్యాయుధముల సమూహముతో జ్వలిస్తూ బ్రహ్మాడమును ఛేదించే పొడవైన వేయి చేతులను, విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతల మణిమయ కిరీటములపై తాండవమాడి ఆ మణులచే రంగవల్లులవలె పడేలా ఆశ్చర్యపోయేలా చేయగల భయం కలిగించే చరణములతో ప్రకాశిస్తున్నాడు. సర్పములు, రుద్రాక్ష మాలికలు, విభూతి త్రిపుండ్రములు, పులితోలు గజచర్మము గల రథమునెక్కినవాడై వజ్ర వైఢూర్య ఇంద్రనీల గోమేధిక పుష్యరాగ మరకత పద్మరాగ ముత్యములతో కూడిన నవరత్న హారములు కేయూరములు అంగుళీయకములు మంజీరములు ధరించిన దివ్యదేహము కలవాడు, ప్రళయకాలంలోని సముద్రఘోష వంటి భువన భయంకర సింహనాదము చేసేవాడు, సకల బ్రహ్మాండ భాండములు భయపడేలా వికటాట్టహాసము చేసేవాడును, అతను శ్వాసించునపుడు విషాగ్ని జ్వాలలా పర్వత శిఖరాలు కదిలేంత గాలి నిశ్వాసము చేసేవాడును, మదగజము గండభేరుండము సింహము ఎలుగుబంటి పెద్దపులి వంటి వానితో పోరాడగల విద్య తెలిసినవాడు, సకల లోకాల ఉత్పత్తి స్థితి సంహారము విధము తెలిసినవాడు, దేవతల సమూహములను తిరస్కరించగలవాడును, అన్ని భూతములకూ ఆశ్రయమైనవాడును, ఉత్పాతమును సూచించేవాడును, మూడు లోకాలలోని దానవులను వ్రయ్యలుచేయువాడును, అనేక వేల కోట్ల సూర్య మండలాల ప్రకాశము కలవాడును, శివదూషణ చేసేవారి ముఖములను తన్నగలిగేవాడును, సకల గుణగణములు కలవాడును. అసహాయశూరుడు, సాటిలేని నివారింపలేని గర్వము దర్పముతో యున్న వీరభద్రేశ్వరుడు. (ఈ వచనములో వీరభద్రుడు ధరించిన ఆభరణములు, ఆయుధములు, అతని శూరత్వము వర్ణించబడినవి.)