పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : రతీదేవి శివునిపైఁ బోవల దని మన్మథుని మందలించుట

2-71-వ.
అనవుడు నక్కాంతా తిలకంబు విస్మయాకుల చిత్తయై మూర్ఛిల్లితెలువొంది; నగవును, గోపంబును, దైన్యంబును సుడివడుచుండ నిట్లనియె.

టీక :-
కాంతాతిలకము = కాంతలలో శ్రేష్ఠమైనది, రతీదేవి; విస్మయము = ఆశ్చర్యము; ఆకుల = క్షోభ చెందినది; మూర్ఛిల్లి = సొమ్మసిల్లినదై; దైన్యము = దీనత్వము.
భావము :-
అనగా విని ఆ రతీదేవి యాశ్చర్యము, బాధతో కలతచెంది, సొమ్మసిల్లి తేరుకునన్నది. నవ్వు, కోపము, దీనత్వము పెనగగొనగా ఇలా అన్నది.

2-72-శా.
లా మన్మథ! యిట్లుపల్కఁ దగవా? యీ చందముల్ మేలె? నీ
వేలా మూఢుఁడవైతి? నీదుమది దానెచ్చోటికిం బోయె? మి
థ్యాలాపంబులఁ బల్క నీకుఁ దగ భవ్యంబౌ రతిక్రీడయే
కాలారిఁద్రిపురారిఁజేరవశమే? కందర్ప! నీబోటికిన్.

టీక :-
చందము = విధము; మది = బుద్ధి; మిథ్య = అసత్యము, భ్రాంతి; భవ్యము = శుభమైన; కాలారి = యముని సంహరించినవాడు, శివుడు; త్రిపురారి = త్రిపురాసురుని సంహరించినవాడు, శివుడు.
భావము :-
“ఎందుకు మన్మథా! ఇలా మాట్లాడుతున్నావు? ఇది మంచి పద్ధతాదా? నీవెలా తెలివితక్కువవాడిలా అయ్యావు? ఇలా భ్రాంతిభాషణలు పలుకుటకు నీ బుద్ధి ఎక్కడకు వెళ్ళింది? . యిది ఏమైనా శుభమైన రతిక్రీడా? యముని, త్రిపురాసురుని సంహరించిన శివుని చేరుట కందర్పా! నీవంటివారికి వశమా?......

2-73-వ.
అదియునుంగాక.
భావము :-
అంతేగాక.

2-74-సీ.
నిఖిలప్రపంచంబు నిర్మించిశోభిల్లు;
రమేష్ణికంటె నీ లముబలమె?
మూఁడువేల్పులఁబట్టి మూలకుఁజొనిపిన;
కరివైరికంటె నీ వెరవువెరవె?
నభీకరాటోపలితుఁడైవర్తిల్లు;
యకాలుకంటె నీ లావులావె?
లదైవములనెల్ల ఖండించిమించిన;
యంతకుకంటె నీ రుదుయరుదె?

2-74.1-ఆ.
యెట్టిఘనులఁబట్టి యెనయంగఁదలకొని
తెచ్చి విఱిచి త్రుంచి చ్చినాఁడు
లదు శంభుతోడ వైరంబు మన్మథ!
యూరకుండి చచ్చువారు గలరె.

టీక :-
నిఖిలము = సమస్తము; శోభిల్లు = ప్రకాశించు; పరమేష్ఠి = బ్రహ్మ; మూడు వేల్పులు = బ్రహ్మ, ఉపేంద్రుడు, ఇంద్రుడు; కరివైరి = గజాసురవైరి, శివుడు; వెరవు= ఉపాయము, నేర్పు; ఆటోపము = వేగిరపాటు; లయకాలుడు = శివుడు; లావు = బలము; ఖలుడు = అదముడు; అరుదు = దుర్లభము; ఎనయగ = పొంది; తలకొని = ఎదుర్కొని.
భావము :-
సమస్త ప్రపంచాన్నీ సృష్టించే బ్రహ్మదేవునికంటే నీ బలము గొప్పదా? త్రిమూర్తులను మూలకు తోసే శివునికంటె నీ నేర్పు గొప్పదా? మహా భయంకర యాటోపముతో మెలగెడి ఆ లయకారునికంటె నీ బలము గొప్పదా? అదములైన దైవాలను ఖండించినవాని కంటె దుర్లభమైనదా నీశక్తి? ఎంతటి గొప్పవారినైనాతలపడి త్రుంచి వచ్చువాడు. తీరికూచుని చావు తెచ్చుకుంటారా ఎవరైనా? శివుడితో వైరము వద్దు మన్మథా!

2-75-చ.
లువలరాజుపువ్వు, కడికంచముబ్రహ్మకపాల, మన్నువ
న్నె పులితోలుచీర, పదనిర్మలపద్మము, విష్ణువమ్ము, వే
లవిభుండుకంకణము, ప్పనిలెంకలుదేవసంఘనుల్,
లితమమ్మహామహిమ ర్వము వానిగణింపవచ్చునే.

టీక :-
కలువలరాజు = చంద్రుడు; కడి = (కబళము) భోజనము; మన్ను = మట్టి; వన్నె = రంగు; చీర = వస్త్రము; వేదలలవిభుడు = వేయి తలల ఆదిశేషుడు; కంకణము = ముంజేతి ఆభరణం; లెంకలు = సేవకులు; సలలితము = రమణీయము.
భావము :-
శంకరునికి చంద్రుడు శిగపూవు. బ్రహ్మ కపాలము భోజన కంచము. మట్టిరంగు పులితోలు వస్త్రము. పాదములు నిర్మలమైన పద్మములు. విష్ణువు బాణము. శేషుడు కంకణము. దేవతలు సేవకులు.మహామహిమంతా బహు రమణీయము అంతటి ఆ పరమశివుని నుతించగలమా?

2-76-శా.
పుట్టించున్ భువనంబునల్మొగములన్ పొల్పారఁగా ధాతయై
ట్టై రక్షణసేయుచుండును సుధార్యంకుఁడై రుద్రుఁడై
ట్టల్కం దెగటార్చు నిట్లు మఱియుం ర్వించి లీలాగతిం
ట్టా! యిట్లు మహేశుమీఁద నరుగంగాఁ బాడియే? మన్మథా!

టీక :-
పొల్పారు = వెలయు; పట్టు = ఆధారము; పర్యంకం = మంచము; రుద్రుడు = శివుని అష్టమూర్తులలో ఒకటి, శివుడు; కట్టా = కటకటా; అల్కం= అలుకతో; తెగటార్చు= నశింపచేయు; పాడి = ధర్మము.
భావము :-
నాలుగు ముఖములతో వెలయు ధాతయై లోకాలను పుట్టిస్తాడు, పాలసముద్రంలో శేషసాయి, విష్ణువుగా ఆధారమై రక్షణ చేయుచుండును, రుద్రుడై కోపంతో ఇలా నశింపచేస్తాడు. మన్మథా ! ఇంచతెలిసీ, గర్వముతో విలాసంగా శివుని మీదకు వెళ్ళడం ధర్మమా?

2-77-ఉ.
ని చెప్పవచ్చు నతఁ డెంతటివాఁ డని పల్కవచ్చునీ
భూమియు నాకసంబు జలపూరము నాత్మయు నగ్ని గాలియున్
సోముఁడు చండభానుఁడగుసూర్యుఁడు నాతఁడు దాను బ్రహ్మయుం
దారసాక్షుఁడున్ నతని త్త్వముఁ గానరు నీకుశక్యమే?

టీక :-
తామరసాక్షుడు = విష్ణువు.
భావము :-
ఏమని చెప్పగలము? ఎంతటివాడని పలుకగలము? ఈ భూమి, ఆకాశం, జలము, ఆత్మ, అగ్ని, గాలి, చంద్రుడు, చండభానుడైన సూర్యుడు, బ్రహ్మ, విష్ణువు కూడా ఆ శివుని తత్వమును తెలుసుకోలేరు. ఇంక నీవల్లవుతుందా?

2-78-మ.
దువుల్ మంత్రములుం బురాణ చయముల్ శాస్త్రంబులుం గూడి య
మ్ముదుకం గానఁగలేక తోఁచినగతిం మోదించి వర్ణించు నా
దువుల్ పూర్వులుకన్నవిన్న తపసుల్ స్రష్ట్రండముల్ కుక్షిలో
నుయంబైనవి గాన నమ్మహిమ దా నూహింపరా దేరికిన్.

టీక :-
చదువులు = వేదాలు; చయము= సమూహము; ముదుకన్ = చిక్కటిదైవం, ఆదిముసని, ఆదిశివుడిని; మోదించి = ఆనందించి; స్రష్ట = బ్రహ్మ; స్రష్ట్రండముల్ = బ్రహ్మాండములు; కుక్షి = కడుపు; ఏరికిన్ = ఎవరికీ.
భావము :-
వేదములు, మంత్రములు, పురాణ సమూహములు, శాస్త్రములు అన్నీ పఠించిన పూర్వులు తపస్సులు, కూడా ఆ పరమశివుని సరిగా దర్శించలేక తోచిన విధముగా వర్ణిస్తారు., బ్రహ్మాండములు శివుని కడుపులోనుండి పుట్టినవి. కావున ఆతని మహిమను ఊహించుట ఎవరి తరమూ కాదు.

2-79-శా.
ల్లోలధ్వని మంత్రజాలములునుం, గాయంబు బాఠీనముల్,
ల్లాలిత్యతతిద్విజుల్, మణులు నక్షత్రావళల్ ఫేనముల్,
తెల్లం బైన త్రిమూర్తు లూర్ములు గతుల్, దివ్యప్రభావంబు రం
జిల్లంగా జలపూర సంకుల మహాశ్రీకంఠవారాశికిన్.”

టీక :-
కాయము = శరీరము; జాలము = సమూహము; పాఠీనము = పెద్దచేప, తిమింగలం; సల్లాలిత్యము = మంచి సౌందర్యము, జ్ఞానముతో; తతి = సమూహము; ద్విజులు = బ్రాహ్మణులు; ఫేనము = సముద్రపు నురుగు; ఊర్ములు = కెరటాలు; గతులు = కదలికలులు; సంకుల = వ్యాపించిన; శ్రీకంఠుడు = శివుడు; వారాశి = సముద్రము.
భావము :-
కల్లోల ధ్వనులే మంత్ర సమూహములుగా, శరీరమే తిమింగలాలుగా, జ్ఞానులైన బ్రాహ్మణులే మణులుగా, సముద్రపు నురుగే నక్షత్రాలుగా, త్రిమూర్తులే కెరటాలుగా కదలికలే మహా ప్రభావాలుగా శోభిల్లుతుంటాడు ఆ శివుడు అనే జలము సంపూరిత మహా సముద్రము.”

2-80-వ.
మఱియు నిట్లనియె.

టీక :-
మఱియు = ఇంకా.
భావము :-
రతీదేవి మన్మథునితో ఇంకా ఇలా అంది.

2-81-సీ.
"భూకాంతతేరును బూవులతేరును;
నిర్జరసుభటులు న్గీరభటులు;
నకాచలమునిల్లు డుతియ్యనగువిల్లు;
మేటినందిపడగ మీనుపడగ;
హుమంత్రవాజులు చ్చనివాజులు;
పెక్కుదలలనారి భృంగనారి;
లుమొగంబులయంత వవసంతుఁడుయంత;
పురుషోత్తముండమ్ము పూవుటమ్ము;

2-81.1-ఆ.
వెలయరేయుఁబగలు వెలిఁగించుకన్నులు
మ్మికండ్లు; త్రిపురదైత్యకోటి
గురి విటువ్రజంబుగురి; యతనికి నీకు
నేమిసెప్పవచ్చు? నెంతకెంత.

టీక :-
భూకాంత = భూమి; నిర్జరులు = దేవతలు; కీరము = చిలుక; కనకాచలము = మేరు పర్వతం; పడగ = ధ్వజము; మీను = చేప; వాజులు = గుఱ్ఱాలు; పెక్కుతలలనారి = శేషుడు నారి; భృంగము = తుమ్మెద; యంత = సారథి; పురుషోత్తముడు = విష్ణువు; వెలయు = ప్రకాశించు; తమ్మి = తామరపూవు; దైత్యులు = రాక్షసులు; విటులు = వేశ్యాలోలురు; వ్రజము = సమూహము.
భావము :-
శివుని రథం భూమి. నీ రథం పూలరథం. అతని భటులు దేవతలు. నీ భటులు చిలుకలు. అతని విల్లు మేరుపర్వతం. నీ విల్లు చెఱకు. అతని ధ్వజము మహా నంది. నీ ధ్వజము చేప. అతని గుఱ్ఱాలు వేదాలు. నీ గుఱ్ఱాలు రామచిలుకలు. అతని వింటినారి ఆదిశేషుడు. నీ వింటినారి తుమ్మెద. అతని రథసారథి బ్రహ్మ. నీ రథసారథి వసంతుడు. అతని బాణము విష్ణువు. నీది పూలబాణము. రాత్రి పగళ్ళకు కాంతినిచ్చే సూర్యచంద్రులు అతని కన్నులు. నీ కన్నులు తామరపూలు. అతని గురి త్రిపురాసురులవంటి రాక్షసులపైన. నీ గురి విటులమీద. అతనెక్కడ, నీవెక్కడ. అసలు పొలికెక్కడ. ఎంతకుఎంత?

2-82-క.
నిరుపమ నిర్మల నిశ్చల
మమహాదివ్యయోగ రిత నిజాంతః
ణుఁడు శివునిం గెల్చుట
విహులఁ బొరిగొంటకాదు విరహారాతీ!

టీక :-
నిరుపమ = సాటిలేని; భరిత = పూరితము; పొరిగొను = జయించుట; విరహ+ఆరాతి = విరహిజనులకు శతృవు, మన్మథుడు.
భావము :-
సాటిలేని, పరిశుద్ధమైన, నిశ్చలమైన, మిక్కిలి గొప్పదైన దివ్య యోగము పూరిత అంతఃకరణము కలవాడు. అట్టి శివుడిని గెలుచుట విరహులను గెలవటం వంటిది కాదు విరహారాతీ! మన్మథుడ!.

2-83-సీ.
ద్యోతబృందంబు ర్వింపవచ్చునే;
రఁగ దేజఃప్రదీపంబుమీఁద;
రఁగఁ దేజఃప్రదీపంబు శోభిల్లునే;
యాభీలఘోరదావాగ్నిమీఁద;
భీలఘోరదావాగ్నిపెంపేర్చునే;
వలింటి భానుబింబంబుమీఁద;
వలింటి భానుబింబంబు వెలుంగనే;
ప్రళయకాలానల ప్రభలమీఁద;

2-83.1-తే.
ప్రళయకాలగ్నికోటిచేఁ బ్రజ్వరిల్లు
మంటఁగలకంఠఁబరఁగు ముక్కంటిమీఁద;
వ్రాల నేరదు నీపెంపు దూలుఁ గాని
జితజగజ్జనసంఘాత చిత్తజాత!”

టీక :-
ఖద్యోతబృందము = మిణుగురు పురుగులు; పరగ = ఒప్పుగా; తేజము = ప్రకాశము; ప్రదీపము = వెలుగుతున్న దీపము; శోభిల్లు = ప్రకాశించు; ఆభీల = భయంకరమైన; ఘోర = భయంకరమైన; దావాగ్ని = అడవులను కాల్చే అగ్ని, కార్చిచ్చు; పెంపేర్చు = అతిశయించు; పవలు = పగలు; ఇంటి = వసించు; అనలము = అగ్ని; పరగు = ప్రవర్తిల్లు; వ్రాలు = మీఱు; దూలు = నింద; జితజగజ్జనసంఘాత = జిత = జయించిన; జగజ్జన = లోకులు; సంఘాత = సమూహము కలవాడు, మన్మథుడు; చిత్తజాత = మనస్సు నందు పుట్టెడివాడు, మన్మథుడు.
భావము :-
పెద్ద తేజస్సునిస్తున్న దీపం మీద, మిణుగురు పురుగులు గర్వం చూపవచ్చునా?? భయంకర దావాగ్ని మీద ప్రకాశించే దీపం శోభిల్లుతుందా? భయంకర దావాగ్ని పగటి సూర్యబింబం కంటె ప్రకాశించగలదా? ప్రళయ కాలాగ్నిని మించి, పగటి సూర్యబింబం వెలుగ గలదా? మంటమండే గరళం కంఠముననున్న పరమశివునిమీద, ఎంతటి ప్రళయకాలాగ్నులైనా మించి ప్రజ్వరిల్లి గెలవగలవా? ఇవేవీ మీఱలేవు. నీవు ఎంతటి లోకంలోని జనులందరినీ జయించగలవాడవైనా, ఎంత మనసులో పుట్టువాడవైనా ఓ మన్మథ! నీ గొప్పదనం పరమశివుని ముందు వెలవెలబోతుంది తప్ప ఎందుకూ పనిచేయదు.”

2-84-క.
ని నేర్పుమెఱసి పలుమరుఁ
కుం గడుబద్ధి చెప్పు దామరసాక్షిం
ని కర్మపాశహతుఁడై
సతికి మనోభవుండు దా నిట్లనియెన్.

టీక :-
తామరసాక్షి = తామరపూలవంటి కన్నులు కలామె, రతీదేవి; కర్మపాశహతుడై = కర్నపాశమునకు చిక్కుకొన్నవాడై.
భావము :-
అంటూ నేర్పుగా పలుమార్లు తనకు బుద్ధిచెబుతున్న రతీదేవిని చూసి కర్మపాశబద్ధుడై తన భార్యతో మన్మథుడు యిలా అన్నాడు.

2-85-మ.
భేద్యాదిసురాళితోఁ బలుకు నాపంతంబు చెల్లింప ను
త్పగంధీ! తలఁపొండె గాని యతఁ డీబ్రహ్మాండభాడావళుల్
లఁగంజేయు సదాశివుం డని యెఱుంగంజాలుదుం జాలునే
కంఠీరవ! కంబుకంఠి! శివువక్కాణింప నింకేటికిన్.”

టీక :-
బలభేది = బలాసురుని భేదించినవాడు, ఇంద్రుడు; ఆది= మొదలగు; సురాళి = దేవతల సమూహము; ఉత్పలగంధి = కలువల వాసన గలామె, రతీదేవి; తలపు = ఆలోచన; బ్రహ్మాండభాండావళులు= బ్రహ్మాండలతో నిండి ఉండే బ్రహ్మాండభాండముల సమూహాలు; కలగజేయు = కలతపొందించు; కలకంఠీరవ = కోకిల వంటి స్వరము కలామె, రతీదేవి; కంబుకంఠి = శంఖము వంటి మెడ కలామె, రతీదేవి; వక్కాణించు = నొక్కి చెప్పు; ఏటికి = ఎందులకు.
భావము :-
“ఉత్పలగంధీ! కలకంఠీరవ! కంబుకంఠి!రతీదేవీ! ఇంద్రాది దేవతలతో పలికిన నా పంతము చెల్లించడం ఒక్కటే ఆలోచిస్తున్నాను. కానీ యతను ఈ బ్రహ్మాండ సమూహాలను కలచివేయగల సదాశివుడని తెలియదా నాకు? చాలునే! ఇంకా ఎందుకు శివుని గూర్చి నొక్కి మాట్లాడతావు?”.

2-86-వ.
అని పల్కి మరుండు మదాంధసింధురంబునుంబోలె నతులితమదోద్రేక్ర మానసుండై తదవసరంబున.

టీక :-
సింధురము = ఏనుగు; అతులిత = అసమానమైన, సాటిలేని; ఉద్రేకము = ఆవేశము.
భావము :-
అని రతీదేవితో పలికి, మన్నథుడు మదపుటేనుగు వలె అసమాన ఆవేశపూరితమైన మనసు కలిగి ఆ సమయంలో....

2-87-క.
ఖండేందుధరునిమీఁదను
దండెత్తఁగవలయ ననుచుఁ నబలములఁ బి
ల్వుంని కాలరి తుమ్మెద
తంముల న్మరుఁడు పంపెఁ ద్దయువేడ్కన్.

టీక :-
ఖండేందుధరుడు= చంద్రవంకను ధరించినవాడు, శివుడు; కాలరి = పదాతి బంటు; తండము = గుంపు; తద్దయు = మిక్కిలి; వేడ్క = వేడుక, అభిలాష, వినోదము.
భావము :-
శివుని పైకి దండెత్తాలంటూ తన సైన్యమును పిలువమని పదాతి దళాలైన తుమ్మెద గుంపును మరుడు తో పంపెను.

2-88-ఉ.
పంపినఁ గాలరుల్గదలి పంకజరేణువు రేగునట్లు గా
వింపుచుఁ బోయి జుమ్మరని పిల్చినఁ దద్బలముల్ చెలంగఁగాఁ
గంపితులై పతింగొలువ గ్రక్కున నప్పుడు వచ్చిరోలిమైఁ
దెంపును సొంపు గ్రాలఁ గడు దీవ్రగతిం రతినాథుఁ గానగన్.

టీక :-
పంకజరేణువు = పద్మముల పరాగరేణువులు; తద్బలములు = ఆసైన్యాలు; చెలంగు = ఉత్సాహము; గ్రక్కున = వెంటనే; ఓలిమి = చాటు, అడ్డపాటు; తెంపు = సాహసము; క్రాలు = సంభ్రమించు; తీవ్రగతి = మిక్కిలి వేగము; కానగన్ = చూచుటకు.
భావము :-
పంపిన కాల్బలం కదలి పద్మ పరాగరేణువులు రేగునట్లుగా వెళ్ళి, ఝుమ్మని పిలువగానే, యజమానిని సేవించుటకు ఆ సైన్యములు ఉత్యాహంగా కదలిపోతూ వెంటనే అడ్డపాటుగా సాహసముగా సంభ్రమించి బయలుదేరారు. అప్పుడు చలా వేగముగా రతీనాథుని దర్శనమునకు వచ్చిరి.

2-89-క.
ములఁ గొలఁకులఁ దిరిగెడి
 కోకిలకీరభృంగ కాదంబతతుల్
నుదెంచికొల్చె పశ్చిమ
తరశైలార్కతేజుఁ గామునిఁ గడఁకన్.

టీక :-
కొలకు = కొలను, సరస్సు; కాదంబము = హంస; తతి = సమూహము; శైలము = కొండ; అర్కుడు = సూర్యుడు; కాముడు = మన్మథుడు.
భావము :-
ఉద్యానవనములలో సరస్సులలో తిరిగే గొప్పగొప్ప కోకిలల, చిలుకల, తుమ్మెదల, హంసల గుంపులు; అస్తమయ సమయ సూర్యునికి సమానమైన తేజస్సు గల మన్మథుని వద్దకు వచ్చి సేవించెను.

2-90-వ.
అయ్యవసరంబున.
భావము :-
ఆ సమయములో.

2-91-సీ.
లమునేర్పులతోడఁ న్నించితెండని;
డవాలుకోకిల పంక్తిఁబంపె;
భేరీ మృదంగాది చారు నాదంబులు;
నెనయఁ దుమ్మెదల మ్రోయింపఁబంపె;
రాకీరములఁగట్టి థమాయితముసేయ;
సంగడికాని వసంతుఁబంపె;
హనీయమగుచున్న నబలంబులనెల్ల;
మనింపుమని కమ్మ గాలిఁబంపె;

2-91.1-ఆ.
మేలుబలమువాఁడు మీనుటెక్కమువాఁడు
నిఖిలమెల్లఁగలఁచు నేర్చువాఁడు
చ్చవింటివాఁడు రగఁ బల్పువుటమ్ము
లుగువాఁడు ప్రౌఢతులవాఁడు.

టీక :-
పన్నించి = పద్ధతిగా పేర్చి; పడవాలు = సేనాధిపతి; చారు = మనసుకు సంతోషం కలిగించేది; ఎనయు = సరిపోలు; ఆయితము = సన్నాహము; సంగడికాడు = చెలికాడు; బలుపుటమ్ము = బలమైన బాణము; ప్రౌఢ = యువకుడు, దిట్ట, నిపుణుడు.
భావము :-
సైన్యమును నేర్పుగా సిద్ధంచేసి తెమ్మని సేనాధిపతులైన కోకిల గుంపును పంపెను. భేరీ మృదంగములవలె వీనులవిందుగా నాదముచేయడానికి తుమ్మెదలను పంపెను. రామచిలుకలను కట్టి రథము సిద్ధము చేయడానికి చెలికాడైన వసంతుని పంపెను. గొప్పదైన మన సైన్యాన్నంతా గమనించమని కమ్మని గాలిని పంపెను. ఇలా సకల సైనిక ఏర్పాట్లు మంచి బలము గలవాడు, మీన ధ్వజము గలవాడు, సకల ప్రాణులనూ కలవరపరచే నేర్పు గలవాడు, పచ్చని విల్లు గలవాడు, ఒప్పుగా బలమైన బాణము గలవాడు, నిపుణవర్తనల వాడు మన్మథుడు చేశాడు.

2-92-క.
 తేజము తన బలమును
 గర్వము తన మదంబు న సంపదయున్
తరముగ నచ్చెరువుగఁ
నిగొని పరమేశుమీఁదఁ బైనంబయ్యెన్.

టీక :-
తేజము = కాంతి; అచ్చెరువు = ఆశ్చర్యము; పనిగొను = వినియోగించు, ప్రయత్నించు; పయనము = ప్రయాణము.
భావము :-
తన కాంతి, బలము, గర్వము, పొగరు, సంపదలతో మహా ఆశ్చర్యంగా వినియోగింస్తూ పరమేశ్వరుని పై ప్రయోగించడాని ప్రయాణమయ్యాడు.

2-93-వ.
 అంత
భావము :-
అంతట...

2-94-సీ.
మలషండము నున్నఁగాఁ జేసి యిరుసుగాఁ;
గావించి కెందమ్మి కండ్లఁగూర్చి;
తగ నించుమోసుల నొగలుగాఁగావించి;
రమొప్పఁ గేదెఁగి కాడివెట్టి;
సంపెంగమొగ్గల నుగొయ్యలొనరించి;
ల్లవంబులుమీఁదఁ ఱపుఁజేసి;
చెలువైన పొగడదండలచేత బిగియించి;
యెలదీఁగె పలుపులు లీలఁజొనిపి;

2-94.1-ఆ.
తెఱఁగు లరసి పువ్వుతేనెఁ గందెనవెట్టి;
గండురాజకీర ములఁగట్టి;
మెఱయ చిగురుగొడుగు మీనుటెక్కము గ్రాలఁ
దేరుబన్ని సురభి తెచ్చెనపుడు.

టీక :-
కమలషండము = కమలము యొక్క మధ్యభాగము; కెందమ్మి = ఎఱ్ఱ తామర; కండ్లు = చక్రములు; ఇంచు = చెఱకు; మోసు = మోపు; నొగ = కాడిమానికి ఆధారమై బండిలో నదువాని మొదటనుండెడు నిడుపాటి మ్రాను, కూబరము; కరమొప్పు = మిక్కిలి ప్రకాశించు; గేదగి = పచ్చని మొగిలి పూవు, కేతకి; చను గొయ్యలు = బండి చట్రమునకు ఇరువైపులా నుండు కొయ్యలు; పల్లవములు = లేత చిగుళ్ళు; చెలువైన = అందమైన; ఎలతీగ = లేతతీగ; పలుపు = పశువుల మెడకు కట్టు తాడు; తెఱగులు = విధములు; అరసి = తెలుసుకొని; పువ్వుతేనె = మకరందం; కందెన = బండి ఇరుసునకు పూయు చిక్కటి నూనె; గండురాజకీరములు = మగరామచిలుకలు; గములుగట్టు = గుంపుగాకట్టు; టెక్కెము = జండా; క్రాలు = అల్లలాడు(ఊగు); తేరు = రథము; సురభి = వసంతఋతువు, వసంతుడు.
భావము :-
కమలములోని దిమ్మెను నున్నగా చేసి ఇరుసుగా చేసి ఎఱ్ఱతామరలను చక్రాలుగా చేశాడు.లేత చెఱకు గడలతో నొగలు చేసి ప్రకాశించేలా మొగలితో కాడి తయారు చేశాడు.సంపంగి మొగ్గలతో చనుగొయ్యి కూబరముగా చేసి దానిపై లేత చిగురులతో పరుపు చేశాడు. అందమైన పొగడపూల దండలచే బిగించి లేత తీగెలతో లీలగా పలుపును తయారు చేశాడు. తెలవిగా పూమకరందాన్ని కందెనగా పూసాడు. మగరామచిలుకలను గుంపుగా కట్టి, చిగురు గొడుగు మెరయుచుండగా మీన ధ్వజము రెపరెపలాడుచుండగా రథమును సిద్ధపరచి వసంతుడు అప్పుడు తీసుకువచ్చెను.

2-95-వ.
ఇట్లు మహిమాతిశయంబగు సుమరథం బాయత్తంబు చేసి వసంతుఁ డనంతవైభవంబున నంగసంభవుం గాంచి “దేవరయానతిచ్చిన విధంబునఁ దేరాయత్తంబుచేసి తెచ్చితి; నదియునుంగాక పిక మధుర మరాళ సేనానాయకుల దండుగండుమొనలై రతీంద్రా! నీరాక గోరుచు మొగసాల నున్నవా” రని విన్నవించిన నవధరించి పురారాతిమీఁద దండు గమకించి మెయివెంచి విజృంభించి సమంచితపుష్పబాణానన తూణీర సమేతుండును; ద్రిభువనభవనాభినవ సుందరుండును; రంగద్భృంగ మంగళ సంగీత పాఠకానేక నిర్మలమహనీయ నాదమోదిత మానసుండును; భూరి కీరకైవారనిజగుణాలంకారుండును; కలహంసనాదగణపరివృతుండును; నగణ్య పుష్పరథారూఢుండును; జగన్మోహనుండును; నగోచర చారుశృంగారుండును; హార కేయూర మణిమకుటాభిరాముండును; రమణీయ రతిరామా సంయుతుండును; కలకంఠ కీర సేనాధిష్ఠితుండును; బల్లవఛత్ర చామర కేతనాలంకృతుండునై నభోభాగంబునం బోవుచుండె నయ్యవసరంబున.

టీక :-
మహిమాతిశయం = గొప్పదైన; సుమరథం = పూలరథం; ఆయత్తంబు చేసి = సిద్ధపరచి; అనంత వైభవము = గొప్ప వైభవం; దేవర = ప్రభువు; పికము = కోకిల; మరాళము = హంస; దండు = సేనా సమూహము; గండు = పౌరుషము; మొన = సేనాముఖము; మొగసాల = వాకిట; అవధరించి = విని; పురారాతుడు = శివుడు; మెయివెంచి = శరీరాన్ని పెంచి (ఉత్సాహంతో ఉబ్బి); అంచిత= గౌరవింపబడిన; తూణీరము = అమ్ములపొది; రంగము = యుద్ధరంగము; భృంగము= తుమ్మెద; పరివృతుడు = చుట్టబడినవాడు; అగణ్య = లెక్కింపరాని; అగోచరము = తెలియరాని; అభిరామము = మనోజ్ఞమైన; నభము = ఆకాశము.
భావము :-
ఈ విధంగా గొప్ప పూలరథం సిద్ధపరచి వసంతుడు అత్యంత వైభవంతో మన్మథుని చూసి “స్వామీ! మీరు ఆజ్ఞాపించిన విధముగా రథమును సిద్ధంచేసి తెచ్చాను. అంతేగాక మధురమైన కోయిలలు, హంసల సేనా నాయకుల సమూహములు పౌరుషంగల సేనాముఖములు ముందు నిలచి రతీంద్రా! మీరాక కోసం వాకిట వేచి యున్నారు” అని విన్నవించాడు. అది విని శివునిపై దండెత్తే సైన్యాన్ని గమనించి ఉబ్బి విజృంభించి గౌరవప్రదమైన పుష్పబాణాలుండే తూణీరముతో కూడినవాడై, ఆ ముల్లోకాలలోనూ అందమైనవాడు యుద్ధమునకు వెళ్ళునపుడు మ్రోగించే తుమ్మెదల మంగళ సంగీత పాఠాలను నిర్మలంగా ఆస్వాదిస్తున్న మనసు కలవాడై, గొప్ప రామచిలుకల సేనా సమేతుడై, కలహంస రవములతో చుట్టు ముట్టినవాడై, లెక్కలేనన్ని పుష్పాలతో తయారుచేసిన రథము ఎక్కినవాడై, ఆ జగన్మోహనుడు తెలియరాని ప్రకాశవంతమైన శృంగారము కలవాడై హారములు, కేయూరములు, మణులతో కూడినకిరీటములతో మనోజ్ఞమైన అందమైన రతీనాథుడు కోయిల రాచిలుకల సేనా సమేతుడై లేత చిగురులచే చేయబడిన గొడుగు, విసనకర్ర కేతనము లతో అలంకరించుకొని ఆకాశమార్గంలో వెళ్తున్నాడు. ఆ సమయంలో.....

2-96-మ.
నియెం గాముఁడు మాతులుంగ కదళీర్జూర పున్నాగచం
 జంబీరకదంబ రంభ ఫలినీ దాడీమమందార కాం
 నాగార్జునబింబ కంటక ఫలానంతప్రవాళావళీ
 సంరంభము శీతవంతమును శర్వాణీప్రియోపాంతమున్.

టీక :-
కనియెను = చూసెను; కాముడు = మన్మథుడు; మాతులుంగ = మాదీఫల; కదళి = అరటి; జంబీర = నారింజ; కదంబ = కడిమి; రంభ = అరటి; ఫలినీ = (తరిగొర్ర చెట్టు), ప్రేంకణపు చెట్టు; దాడిమి = దానిమ్మ; బింబ కంటక ఫలము = పనస పండు; ప్రవాళము = చిగురు; సంరంభము = అతిశయము; శర్వాణి = పార్వతి; ఉపాంతము = సమీపము.
భావము :-
మన్మథుడు మాదీఫలం, అరటి, ఖర్జూరం, పున్నాగ, చందన, నారింజ, కడిమి, అరటి, ప్రేంకణము, దానిమ్మ, మందార, కాంచన, నాగ (నాగ గన్నేరు), అర్జున (ఏఱుమద్ది), కంటకఫలం మొదలైన ఫలవృక్షములు చిగుళ్ళ వరుసలతో వనాతిశయమును చల్లదనమును పార్వతీ సమీపమున చూసెను.

2-97-వ.
కనియమ్మహావనంబుదరియంజొచ్చి.

టీక :-
కని= చూసి; దరియంజొచ్చి= దగ్గరకు వచ్చి.
భావము :-
చూసి ఆ గొప్ప వనము వద్దకు వచ్చి.

2-98-సీ.
నమనోవీథిపై ర్పంబు రెట్టించి;
చెన్నొంద వెడవిల్లుఁ జేతఁ బట్టి;
ట్టపుమొల్లలు లజొమ్మికము వెట్టి;
సొంపారఁబూవులజోడుఁ దొడిగి;
తన బలంబులనెల్ల మొనలుగాఁ గావించి;
కలువలుతూణీరములు ధరించి;
యక్కజముగమీన టెక్కె మెత్తించి; రా;
చిల్కలతే రెక్కి; చివురుగొడుగు

1-98.1-ఆ.
బాలకోకిలంబు ట్టంగఁ గడువేడ్క
గీర చయము తన్నుఁ గీర్తి సేయ
మ్మగాలితోడఁ దన సన్నద్ధుఁ డై
కాముఁ డేగె సోమజూటు కడకు.

టీక :-
మనోవీధి = మనస్సు; దర్పము = గర్వము; చెన్ను= అందము; వెడ = అల్పము; జోడు = కవచము; మొనలు = పదును; తూణీరము= అమ్ములపొద; అక్కజము= ఆశ్చర్యము; కదనము =యుద్ధము; సోమజూటుడు= (చంద్రుని జటయందు ధరించినవాడు) శివుడు.
భావము :-
తన మనస్సునందు గర్వము రెట్టింపుకాగా, అందముగా తేలికైన (చెరుకు) విల్లును చేతబట్టి, మొల్లలను దట్టముగా తలకు చుట్టి, సొంపుగా పూల కవచం ధరించి, తన సైన్యమును వ్యూహాత్మకంగా తీర్చి, కలువలను అమ్ములపొదిగా ధరించి, అద్భుతంగా మీనధ్వజమెత్తించి, రామచిలుకల రథమెక్కి, చివురు గొడుగును బాలకోకిలలు పట్టగా, చాలా వేడుకగా చిలుక సమూహములు తనను పొగడుచుండగా, మలయమారుతముతో యుద్ధానికి సిద్ధమై, కాముడు శివుని వద్దకు వెళ్ళెను.

2-99-వ.
ఇవ్విధంబున నత్యంత సమ్మదంబున సకలసన్నాహబల పరివృతుండై నిదురబోయిన పంచాననంబు నందంద మేలుకొలుపు మదగజంబు చందంబున నిందిరానందనుండు నిరుపమ నిర్వాణ నిర్వంచక నిర్విషయ నిరానంద మానసుండును; సకలబ్రహ్మాండభాండ సందోహవిలంబిత నిర్మల పరమభద్రాసీన దివ్యయోగధ్యాన సంతతభరితాతంరంగుండును; నిర్గుణుండును; నిర్వికారుండునునై తన్నుందాన తలపోయుచు నశ్రాంత సచ్చిదానందహృదయుం డగు నమ్మహేశ్వరుం గాంచి యల్లనల్లన డాయంబోయి తదీయాభిముఖుండై మనోభవుండు.

టీక :-
పంచాననము = (విశాలమగు ముఖము గలది) సింహము; నిరుపమ = సాటిలేని; నిర్వాణ = ముక్తి; నిర్వంచక = మోసములేని; నిర్విషయ = ఇంద్రియ విషయములు లేక; నిరానందమానసుడు = ఆనందానుభవుడు; సందోహ = సమూహము; విలంబిత = వ్రేలాడునది; సంతత = నిరంతరం; భరితాంతరంగుడు = నిండిన మనస్సు కలవాడు; నిర్గుణుడు = ప్రత్యేకించి ఏ గుణమూ లేనివాడు; నిరాకారుడు = ఆకారములేనివాడు; అశ్రాంత = విశ్రాంతిలేని; సచ్చిదానందము = ఎల్లప్పుడు మనసునందు ఆనందము కలవాడు; అల్లనల్లన = మెల్లమెల్లగా; డాయంబోయి = దగ్గరకు వెళ్ళి; అభిముఖం = ఎదురుగా.
భావము :-
ఈ విధముగా చాలా ఉత్సాహంగా సకల సన్నాహపూరిత సైన్యములు చుట్టూకూడి బయలుదేరాడు. అలా బయలుదేరి నిదురపోయిన సింహమును అనయము మేలుకొలిపే మదగజము వలె లక్ష్మీపుత్రుడైన మన్మథుడు పరమేశ్వరుని సమక్షంలోకి మెల్లమెల్లగా వెళ్ళి నిలిచాడు. ఆ పరమేశ్వరుడు సామాన్యుడు కాదు అనన్య మోక్షవిషయుడు; నిర్విషయుడు; నిత్యానందుడు; బ్రహ్మాండభాండములన్నియు వ్రేలునంతటి నిర్మలమైన వీరాసీనుడై యుండువాడు; మహా యోగధ్యానముచే సచ్చిదానందుడై యుండువాడు; గుణరహితుడు; వికారవిహీనుడు; తనను తానే ధ్యానిస్తూ సంతతానందరూపుడు; అలా నిలిచి.....

2-100-లగ్రా.
ఇంచువిలుకాఁడువెస నించువిలుఁజూచిమెయిఁ;
బెంచితమకమ్మినుమడించి గుణముల్మ్రో
యించి దివిజారినలయించి విటచిత్తములు;
చించి పువుటమ్ముమెఱయించి కడిమిన్సం
ధించి శివునేయఁగమకించి తనచిత్తమునఁ;
బంముఖుమానససమంచితమునాలో
కించి వెఱఁగందిగుఱి యించుకయుఁగానక చ;
లించి నిలిచెన్గళవళించి భయవృత్తిన్.

టీక :-
ఇంచువిలుకాడు = మన్మథుడు; ఇంచు = చెఱకు; వెస = వేగము; తమకము = మత్తు; ఇనుమడించి = రెట్టింపై; గుణము = అల్లెత్రాడు; దివిజారి = సూర్యుని శత్రవు, కలువపూలు; అలయించి = ఎక్కుపెట్టి; కడిమి = అతిశయము; గమకించి = ప్రయత్నించి; పంచముఖుడు = ఐదుమోముల వేలుపు, శివుడు; సమంచితము = అంచితము, ఒప్పిదము; ఆలోకించి= చూసి; వెఱగంది = భయపడి, బెదరి; యించుక = కొంచెము; కళవళము= కలవరము.
భావము :-
మదనుడు వేగముగా తనచెఱకు విల్లును చూసుకుని ఉబ్బిపోయాడు; తమకం ఇనుమడించిది; అల్లెతాడు మ్రోగించి, కలువపూలబాణం ఎక్కుపెట్టాడు; ఆ పూలబాణమును లాగిపెట్టి గట్టిగా సంధించి శివునిపై వేబోయాడు’ తన మనస్సులో పరమశివుని మానసిక యొప్పిదమును కాంచి బెదిరాడు గురి కుదరక వణకి కలవరముతో నిలబడిపోయాడు. భయముతో....

2-101-మ.
విలు జూచున్ వెలిజూచుఁ జూచు సురలన్ విశ్వేశ్వరుం జూచుఁ గొం
మందుం దలపోయఁజొచ్చుఁ గడిమిన్ ర్వీకరాలంకృతో
జ్జ్వవిభ్రాజితనిత్యనిర్గుణతపోవారాన్నిధం జెచ్చెరం
పం జూచుఁ గలంపలేక తలకుం గామండు నిశ్చేష్టుఁడై.

టీక :-
వెలి = బయటకు; విశ్వేశ్వరుడు = శివుడు; కొందలమందు = కలతపడు; కడిమిన్ = అతిశయము; దర్వీకరము= పాము పడగ; విభ్రాజితము = మిక్కిలి ప్రకాశవంతమైన; నిర్గుణ = గుణరహితుడు; వారాన్నిధి = సముద్రము; జెచ్చెర = వేగము, శీఘ్రము; తలకు = వణకు; నిశ్చేష్టుడు= చేష్టలుడిగినవాడు.
భావము :-
మన్మథుడు తన చెరుకు విల్లును చూస్తాడు. పైకి చూస్తాడు. దేవతలను చూస్తాడు. శివుని చూస్తాడు. కంగారు పడతాడు. ఆలోచనలో పడతాడు. చివరికి పాము పడగలను అలంకారంగా ధరించి ఉజ్వలంగా ప్రకాశిస్తున్న నిర్గుణ తపో సముద్రుని శీఘ్రంగా కదపాలని చూసిన ఆ మన్మథుడు కదపలేక ఏమీ చేయలేక నిశ్చేష్టుడై వెనుదీసాడు.

2-102-క.
అం శివార్చనసేయగఁ
గాంతాతిలకంబు శైలన్నియ వచ్చెన్
కంతునిదీపమొ యనఁగా
నెంయు లావణ్యమున మహేశ్వరుకడకున్.

టీక :-
శైలకన్నియ = పార్వతి.
భావము :-
అంతలో శివుని సేవించుటకు పార్వతితీకాంతారత్నం, మన్మథుని దీపమా యన్నట్లు, ఎంతో లావణ్యముతో మహేశ్వరుని వద్దకు చేర వచ్చెను.

2-103-క.
గిరినందన డాయంజని
రుదుగ మఱిపూజసేయ త్తఱి మౌళిన్
గిరిజ కరంబులు సోఁకినఁ
మేశుని చిత్తమెల్లఁ రవశమయ్యెన్.

టీక :-
డాయంజను = దగ్గరకుచేరు; అరుదుగ = అపురూపంగా; అత్తఱి = ఆసమయంలో; మౌళి = శివుడు; సోకిన= తగిలిన.
భావము :-
గిరిజ శివుని దగ్గరకు వెళ్ళి అపురూపంగా పూజ చేయుచున్నది. ఆ సమయంలో శివునకు గిరిజ చేతులు తాకగా పరమేశుని మనసంతా పరవశించెను.

2-104-వ.
ఆ సమయంబున.
భావము :-
ఆ సమయంలో