పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : రతీదేవి శివునిపైఁ బోవల దని మన్మథుని మందలించుట - తరువాయి భాగము

2-105-శా.
టంకారధ్వని నింగినిండ వెడవింటం పుష్పబాణంబుని
శ్శంకంబూని సురేంద్రు కిచ్చిన ప్రతిఙ్ఝాసిద్ధిగాఁజేసి తాఁ
గింన్విల్లెగఁదీసి గౌరి శివునిం గేలెత్తి పూజించుచో
హుంకారించుచు నీశు నేసె మదనుం డుజ్జృంభసంరంభుఁడై.

టీక :-
టంకారము = నారి శబ్దము; నిశ్శంక = అనుమానం లేకుండా; సిద్ధిగాజేయు = నెరవేర్చు; కింకను = కోపముతో; కేలు = చేయి; జృంభము = ఒళ్ళువిరుచుకొను, వికాసము; సంరంభం = వేగిరపాటు.
భావము :-
గౌరీదేవి శివుని చేయెత్తి పూజించు ఆసమంయలో, ఇంద్రునికిచ్చిన ప్రతిజ్ఞ నెరవేర్చుటకు మన్మథుడు కినుకతో విల్లును పైకిలేపాడు; నారి ధ్వని ఆకాశంలో వ్యాపించింది; వికసించిన వేగిరపాటుతో, నిశ్శంకగా శీఘ్రమే శివునిపై పుష్ప బాణము వేసెను .

2-106-క.
నుం డేసినబాణము
హృయంబునఁ గాడి పార నీశుఁడు దన్నున్
చెరించె నెవ్వఁ డక్కడ
చిత్తుఁడు ఘోరకర్మమానసుఁ డనుచున్.

టీక :-
గాడిపారు = గాయంచేయు.
భావము :-
మదనుడు వేసిన బాణము మనసును గాయపరచగా ఈశ్వరుడు “ఎవడక్కడ? నన్ను చలింపచేసాడు; ఘోరపాపియైన ఆ మదచిత్తుడు ఎవడువాడు?”

2-107-క.
సియు నంతటఁ దనియక
భాసిలి వెండియును బుష్పబాణము నారిం
బోసిన మానససంభవు
నీశుఁడు గనువిచ్చి చూచె నెవ్వఁడొ యనుచున్.

టీక :-
ఏసియు = బాణము వేసికూడా; తనియు = తృప్తిచెందు; భాసిలు = ప్రకాశించు; వెండియును = మరియు; మానససంభవుడు = మన్మథుడు.
భావము :-
(మన్మథుడు శివునిపై) బాణము వేసినా కూడా తృప్తి పడక ఇంకొక పుష్పబాణమును ప్రకాశించి నారిని సంధించాడు ఆ మన్మథుని ఈశ్వరుడు ”ఎవరా?” యని కన్నులు విప్పి చూసాడు.

2-108-వ.
ఇట్లు చూచిన.
భావము :-
అలా చూడగా.

2-109-మ.
కుశైలంబులుభేదిలన్ జలనిధుల్కోలాహలంబైవెసం
లఁగన్దిక్కులుఘూర్ణిలన్ జగములాకంపింపవిశ్వంభరా
స్థ మల్లాడనభస్థలిం గరుడగంర్వామరాధీశ్వరుల్
లుమాఱుంబెగడొందఁజుక్క లురలన్బ్రహ్మాదులున్భీతిలన్.

టీక :-
కులశైలంబులు = కులపర్వతములు; భేదిలన్ = పగులగా; జలనిధులు = మహాసముద్రాలు; కోలాహలం = కలకలం; వెసంగలగ = వేగము కలుగగా; ఘూర్ణిలన్ = ప్రతిధ్వనించగా; కంపించు = వణకు; విశ్వంభరాస్థలము = భూమి; అల్లాడు = ఊగు; నభముస్థలి = ఆకాశము; బెగడు = భయపడు; భీతిల్లు = భయపడు.
భావము :-
(అలా శివుడు మూడవ కన్ను తెరవడంతో,) కుల పర్వతాలు బీటలువారాయి; సముద్రాలు ఎగిసిపడ్డాయి; దిక్కులు ప్రతిధ్వనించాయి’ లోకాలు అల్లల్లాడాయి; భూమి కంపించింది; స్వర్గంలో గరుడులు, గంధర్వులు, దేవతలు మిక్కిలిగా భయపడుతున్నారు; నక్షత్రాలు రాలుతున్నాయి. బ్రహ్మాదులు భయపడుతున్నారు.

2-110-క.
భుభుగ యను పెనుమంటలు
భగమనిమండ నంత బ్రహ్మాండంబున్
దిగుదిగులు దిగులుదిగులనఁ
దెగి మరుపైఁ జిచ్చుకన్నుదేవుఁడు విచ్చెన్.

టీక :-
పెను = పెద్ద; తెగ = విధము; చిచ్చుకన్నుదేవుడు= అగ్నినేత్రం అయిన మూడవ కన్నుకల శివుడు, ముక్కంటి; విచ్చు= విప్పు, తెరచు.
భావము :-
భుగభుగమంటూ పెద్ద పెద్ద మంటలు భగభగమని మండెను. దానితో బ్రహ్మాండమంతా దిగులు దిగులుగా యుండెను. ఈ విధముగా మహాదేవుడు పరమశివుడు తన అగ్నినేత్రాన్ని మదనునిపై తెరిచెను.

2-111-క.
దిక్కు లెఱమంటఁ గప్పెను
మిక్కిలిగా మింటనెగయు మిడుఁగురుగములున్
గ్రక్కఁదలి రాల వడిగాఁ
జుక్కలు ధరఁ బడఁగ మింట సురలుం గలఁగన్.

టీక :-
ఎఱమంట = ఎర్రనిమంట; మిన్ను= ఆకాశం; గ్రక్కదలు = ఎక్కువగా కదలు; కలగు= కలతచెందు.
భావము :-
(అలా శివు మన్మథునిపై మూడవకన్ను తెరవడంతో,) మిడుగురులు (అగ్నికణాలు) గుంపులు గుంపులుగా వేగముగా కదలుచూ రాలగా, చుక్కలు వేగముగా భూమిపై రాలి పడగా, ఆకాశంలో దేవతలు కలత చెందగా. దిక్కులను ఎర్రనిమంట కప్పివేసెను. మంటలు ఆకాశానికి ఎగయుచుండెను.

2-112-వ.
అంత.

2-113-సీ.
లహంసములతోడ గండుగోయిలలతో;
మేలైనకమ్మదెమ్మెరలతోడ;
చిలుకలగములతో నలరులతేరుతో;
రముపూన్చిన శరానముతోడ;
పుష్పహారములతోఁ బుష్పవస్త్రములతోఁ;
నరారు మకరకేనముతోడ;
పువ్వులజోడుతోఁ బువ్వులదొనలతోఁ ;
గొమరారు చిగురాకు గొడుగుతోడ;

2-113.1-ఆ.
ఱియుఁ దగినయట్టి హితశృంగారంబు
తోడఁగూడి వేగఁ దూలితూలి
శివునినుదుటికంటి చిచ్చుచే సుడివడి
పంచవింటిజోదు స్మమయ్యె.

టీక :-
అలరులు = పుష్పములు; శరాసనము = ధనుస్సు; తనరారు = అతిశయించు; జోడు = కవచము; దొన = అమ్ములపొది; కొమరారు = అందముగనుండు; మహిత = గొప్ప; తూలు = ఊగు, తూలిపడుట; జోదు= శూరుడు.
భావము :-
కలహంసలతో, గండుకోయిలలతో, మలయమారుతాలతో, చిలుకల గుంపుతో, పూలరథంతో, శరము పూన్చిన ధనుస్సుతో, పూలమాలలతో, పూలవస్త్రములతో, అతిశయించే మీనధ్వజముతో, పూల కవచముతో, పూల అమ్ములపొదితో, అందమైన చిగురుటాకుల గొడుగుతో ఇంకను తగినట్టి గొప్ప శృంగారముతో వేగముగా వచ్చిన పంచబాణముల శూరుడు మన్మథుడు, శివుని నుదుటి కంటి అగ్నిచే చుట్టబడి తూలిపడిఅంతటి శూరుడు బూడిదాయెను.

2-114-క.
“ఓహో దారుణతమమిది
యాహో మరుఁడీల్గెనీల్గె” ని శివమదనో
గ్రావముచూచిమింటను
హాహానాదంబులిచ్చి మరేంద్రాదుల్.

టీక :-
దారుణము – దారుణతరము -దారుణతమము; ఈల్గు= చనిపోవు; ఆహవము= యుధ్ధము.
భావము :-
“అయ్యో! మహాదారుణమిది. ఆయ్యయ్యో! మరుడు మరణించె మరణించె.” అంటూ శివ, మదనుల ఉగ్రమైన యుద్ధము చూసి ఆకాశంలో హాహాకారములు చేశారు ఇంద్రాదులు.

2-115-వ.
మఱియు నయ్యవసరంబున ఫాలలోచనాభీలపావకకరాళజ్వాలావళీపాతభస్మీభూతుండై చేతోజాతుండు దెగుటఁ గనుంగొని విస్మయాకుల చిత్తయై యతనిసతియైన రతీదేవి జల్లనియుల్లంబు పల్లటిల్ల నొల్లంబోయి మూర్ఛిల్లి యల్లన తెలివొంది శోకంపువెల్లిమునింగి కలంగుచుఁ దొలంగరాని బలువగలపాలై తూలుచు వదనంబును శిరంబును వదనగహ్వరంబు నందంద మోదుకొనుచు మదనుండు వొలిసినచోటికి డాయంబోయి యిట్లని విలపింపందొడంగె.

టీక :-
ఆభీల = భయంకరమైన; పావక = అగ్ని; కరాళ = భయంకరమైన; జ్వాలావళి = మంటలవరుసలు; అపాత = పడుటచే; చేతోజాతుడు = (మనస్సునందు పుట్టువాడు) మన్మథుడు; తెగుట = చనిపోవుట; ఉల్లము = హృదయము; పల్లటిల్లు = చలించు; ఒల్లఁబోలు = చేష్టలుదక్కు; అల్లన = మెల్లగా; వెల్లి = ప్రవాహము; కలంగు = కలతచెందు; తొలంగరాని = దాటరాని; వగలు = కష్టాలు; తూలు = దుఃఖించు; వదనము = ముఖము; శిరము = తల; వదన గహ్వరము = నోరు; అందంద = మరలమరల; ఒలియించు = చంపు; డాయంబోయి= సమీపించి.
భావము :-
మరియు ఆ సమయంలో ఫాలలోచనుని భయంకరాగ్నిచే పుట్టిన దారుణమైన మంటలలో బూడిదై మన్మథుడు మరణించాడని చూసి, యాశ్చర్యపోయి మిక్కిలి వ్యాకులత పొందిన అతని భార్య రతీదేవి చల్లని మనసు చలించిపోయింది; ఆమె కుప్పకూలి, మూర్ఛపోయి, మెల్లిగా తెలివొంది శోక ప్రవాహంలో మునిగి కలతచెందింది; తీర్చలేని దుఃఖంతో తూలిపోయింది; మాటిమాటికీ నెత్తి, నోరు మొత్తుకుంటూ, మొహం మొత్తుకుంటూ పొయి మదనుడు బూడిదైన చోటుకు చేరి ఇలా విలపింట సాగింది....

2-116-ఉ.
హా లరాజ! హామదన! హామథురాయతచారులోచనా!
హా విటలోకమానసనిరంతర తాపలసత్ప్రతాపమా!
హా నజాతనేత్రతనయాయెట డాఁగితి? నాకుఁజెప్పుమా
సేవితమైననీబలముచెల్వము మంటలలోనదాఁగెనో?

టీక :-
వల = కామము; ఆయత = దీర్ఘమైన; చారు = సుందరమైన; విటలోక మానస = విటులమనసులలో; తాపము = బాధ; లసత్ = ప్రకాశమానమైన; వనజాతము = పద్మము; చెలువము = అందము.
భావము :-
“హా! కామరాజా! మదనా! మనోజ్ఞమైన, చక్కటి విశాలమైన, కన్నులు కలవాడా! విటులకు ఎడతెగని తాపాన్ని కలిగించే ప్రతాపశాలీ! విష్ణుపుత్రా! ఎక్కడ దాగావు? నాకు చెప్పు. నిను సేవించే నీ బలము, అందము మంటలలో దాగాయా?.

2-117-శా.
ట్టా దేవరకంటిమంటలు నినుం గారించుచో మన్మథా!
చుట్టాలం దలిదండ్రులం దలఁచితో శోకంబునుం బొందితో
ట్టంజాలని శోకవార్థిఁ బడి నీప్రాణేశ్వరిం బిల్చితో?
యెట్టుం బోవఁగలేక మంటలకునై యేమంటివో? మన్మథా!

టీక :-
కట్టా = కటకటా, అయ్యో; దేవర = శివుడు; కారించు = బాధించు; వార్ధి = సముద్రము.
భావము :-
కటకటా! మన్మథా! శివుని కంటి మంటలు బాధించునపుడు బంధువులను, తలిదండ్రులను తలచి ఎంత దుఃఖము పొందావో కదా! పట్టరాని శోకసముద్రంలో పడి నీ ప్రాణేశ్వరిని నన్ను పిలిచావో? తప్పించుకొనలోని ఆ మంటలలో పడి ఎంత బాధపడ్డావో?

2-118-ఉ.
గ్రక్కున రావె నా మదన! కానవె నా వలరాజ! నన్ను నీ
క్కఁదనంబు మోహమును శౌర్యము నేఁగతిఁ దూలిపోయె నీ
వెక్కడఁబోయి తింక నది యెక్కడ నున్నది బాపదైవమా!
క్కట! చెల్లఁబో! కటకటాయిది వ్రాఁతఫలంబు తప్పునే?

టీక :-
దూలిపోవు = నశించు.
భావము :-
మదనా! వెంటనే రా. నా వలరాజా నన్ను చూడు. నీ యందము, మోహము, శౌర్యము ఏ విధంగా మట్టిగొట్టుకు పోయాయి? నీ వెక్కడకు పోయావు? ఇంక ఆ పాపపుదైవం యెక్కడ యున్నది? అయ్యో! అయ్యయ్యో! కటకటా! ఇదీ నా తలరాత. తప్పుతుందా?....

2-119-సీ.
పొరిఁబొరిఁబుంఖానుపుంఖంబులైతాఁకు;
పుష్పబాణములెందుఁ బోయెనేఁడు;
రేడుజగముల నేపుమైఁగరగించు;
డిఁదియెచ్చటదూలి గ్రాఁగెనేఁడు;
కాముకవ్రాతంబు ర్వంబుగబళించు;
టంకారరవమెందు డాఁగెనేఁడు;
విటులగుండెలలోన విదళించుచిగురాకు;
సంపెటవ్రేటెందు మసెనేఁడు;

2-120-క.
వాక నిఖిలజనంబుల
నీ సమున సతులఁబతుల నేచికలంపన్
నేరిచి శివునిఁగలంపఁగ
నేరువలేవైతి మదన! నిన్నేమందున్.

టీక :-
వారక = ఎడతెగక; నిఖిలజనంబు = అందరులోకులు; ఏచు= బాధించు.
భావము :-
ఎప్పుడూ సకల లోకాలలోని భార్యాభర్తలను, నీ శృంగార రసముచే నేర్పుగా కలచేవాడివి. శివుని కలచుట నేర్వలేకపోయావా? మదనా! నిన్నేమనాలి?

2-121-శా.
ల్లిందండ్రియుఁ దాతయుం గురుఁడునుం దైవంబు నా ప్రాణమున్
ల్లంబందున నీవె కాఁ దలచి నే నొప్పారగాఁ నియ్యెడన్
జెల్లంబో నిను నమ్మియుండఁగను వే శ్రీకంఠుపై వచ్చి నీ
పొల్లై పోవుట నేనెఱుంగుదునె నీ పుణ్యంబు లిట్లయ్యెనే.

టీక :-
ఒప్పారు = చక్కగానుండు; చెల్లబో = అయ్యో; వే= వేగముగా; పొల్లుపోవు = అబద్ధమైపోవు, వ్యర్థమైపోవు.
భావము :-
తల్లి, తండ్రి, దాత, గురువు, దైవము, నా ప్రాణము నీవే కదా యని నా మనసున తలచి నీ యందు చక్కగా నమ్మియుండగా శివునిపైకి వచ్చి నీవు మసైపోతావు అనుకోలేదయ్యా! అయ్యో! నీవు చేసిన పుణ్యాలన్నీ యిలా అయిపోయాయా?..

2-122-ఉ.
ల్లులు పుణ్యగేహినులు దండ్రులు పుణ్యజనంబులంచు నా
యుల్లమునందు నేఁ దలతు నోసురగేహినులార! మీరు నా
ల్లులు నేను గూఁతురను ర్మపు నోములదానఁ గాన మీ
ల్లుని నిచ్చి నన్మరల నైదువఁ జేయరె మీకు మ్రొక్కెదన్.

టీక :-
గేహిని = ఇల్లాలు; ఉల్లము = మనస్సు; ధర్మము = పుణ్యము; ఐదువ = మాంగల్యము గల స్త్రీ.
భావము :-
ఓ దేవతలారా! మిమ్మల్ని తల్లులు పుణ్యసతులు, తండ్రులు పుణ్యమూర్తులు అంటూ నా మనస్సులో తలుచుకుంటూ యుంటాను. ఓ దేవలోకపు ఇల్లాళ్ళారా! మీరు నా తల్లులు. నేను కూతురను. పుణ్యమైన నోములు నోచినదానను. కావున మీ యల్లుని బ్రతికించి యిచ్చి నన్ను మరలా ముత్తైదువగా చేయండి. మీకు నమస్కరిస్తాను.

2-123-ఉ.
దేతలార! మీకొఱకు ధీరగతిం వెడవింటిజోదు దా
దేరచేతఁ జచ్చె వనదేవత లెల్లను సాక్షి నాకు నా
దేర మీకు నీఁదగవు తెల్లముగా శివుఁ గొల్చి యిచ్చినన్
గారె ప్రోవరే వగపు గ్రక్కునఁ బాపరె మీకు మ్రొక్కెదన్.

టీక :-
వెడ = అల్పము; తగవు = న్యాయము; తెల్లము = స్పష్టము.
భావము :-
దేవతలారా! మీకోసం నా భర్త మన్మథుడు ధైర్యంగా తన చిన్ని విల్లుతో శూరుడు వెళ్ళి తాను పరమేశ్వరుని వలన మరణించాడు. వనదేవతలంతా సాక్షి. నాకు నా ప్రభువును ఇచ్చుట న్యాయము. చక్కగా శివుని కొలిచి రక్షించండి. వెళ్ళండి. నాబాధను త్వరగా పోగొట్టండి. మీకు నమస్కరిస్తాను.

2-124-ఉ.
 లరాజుభార్యను, నుపేంద్రుని కోడల శంభుచేత నా
దేరఁ గోలుపోయి కడుదీనత నొందుచునున్నదానఁ రం
డో వినువీథినున్న ఖచరోత్తములార! దిగీంద్రులార! రం
డో నవాసులార! వినరో మునులార! యనాథవాక్యముల్.

టీక :-
ఏ = నేను; వలరాజు = మన్మథుడు; ఉపేంద్రుడు = హరి; శంభుడు = శివుడు; వినివీథి = ఆకాశం; వనము = అడవి; వనవాసులు = తాపసులు; ఖచరులు= ఆకాశంలో విహరించేవారు, దేవతలు; దిగీంద్రులు = దిక్పాలకులు; అనాథ = భర్తలేని.
భావము :-
నేను మన్మథుని భార్యను. హరి కోడలిని. శివునివలన నా పతిని పోగొట్టుకొని చాలా దీనతను పొందుతున్నదానిని. రండి. ఓ! వినువీధిలో ఆకాశంలో విహరించే దేవతలారా! దిక్పాలకులారా! రండి. ఓ! వనవాసులారా! ఓ!మునులారా! అనాథనైన నా మొర వినండి.

2-125-సీ.
పురుషబిక్షమువెట్టి పుణ్యంబుసేయరే;
పముసేయుచునున్న పసులార!
ర్మమెంతయు భర్తృదానంబుసేయరే;
దివినున్న యింద్రాది దివిజులార!
నా వల్లభుని నిచ్చి న్నురక్షింపరే;
లలెత్తి చూచి గంర్వులార!
దిక్కుమాలినదాన దిక్కయికావరే;
ర్మమానసులగు తండ్రులార!

2-125.1-తే.
మరశరణంబు వేడెద న్నలార!
ధిపుఁ గోల్పడి కడుదీననైనదానఁ
రుణఁ గావంగ నింక నెవ్వరునులేరు
పుణ్యమౌను మొరాలించి ప్రోవరయ్య.

టీక :-
అమర = వేల్పు; అధిపు = ప్రభువు, భర్త..
భావము :-
తపము చేస్తున్న తపసులారా! పతిభిక్ష పెట్టి పుణ్యం చేయండి. స్వర్గంలోనున్న ఇంద్రాది దేవతలారా! భర్తృదానము యెంతో పుణ్యమది చేయండి. గంధర్వులారా! తలలెత్తి చూచి నా వల్లభునిచ్చి నన్ను రక్షించండి. ధర్మ మానసులైన తండ్రులారా! దిక్కమాలినదానిని. దిక్కయి కాపాడండి. వేల్పులారా! శరణమంటున్నాను. అన్నలారా! ప్రభువును కోల్పోయి చాలా దీనురాలినయ్యాను. నన్ను కరుణించడాని కింకెవరూ లేరు. పుణ్యముంటుంది. నా మొరవిని నన్ను కాపాడండి.

2-126-శా.
రారే; యేడుపు మాన్పరే; మధురిపున్ ప్పింపరే; కావరే;
పోరే కుయ్యెరిగింపరే సిరికి నాపుణ్యంబు విన్పింపరే;
తేరే దేవర వేడి నా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా
నీరే] మంగళసూత్రబంధనము మీ కెంతేని పుణ్యంబగున్.

టీక :-
ఏడుపు = రోదనము; మధురిపుడు = విష్ణువు; కుయ్యో = ఆర్తనాదాన్ని వ్యక్తం చేసే ధ్వని, మొర; ఎఱిగించు = తెలియచేయు; సిరి = లక్ష్మీదేవి; పుణ్యము = సుకృతము; వేడు = ప్రార్థించు; దీర్ఘాయుషు = చిరకాలము బ్రతుకు; ఉపేతి = కలిగియుండుట.
భావము :-
రండి. నా ఏడుపు మాన్పించండి. విష్ణువును పిలవండి. అయ్యో! వెళ్ళి లక్ష్మక్ష్మీదేవికైనా చెప్పండి. నా సుకృతాన్ని వినిపించండి. శివుని ప్రార్థించి చిరకాలం బ్రతికేలా నా ప్రభువును తెండి. నా మంగళసూత్రం నాకీయండి. మీకెంతైనా పుణ్యముంటుంది.

2-127-సీ.
రమేశుఁడనియెడి డమటికొండపైఁ
సుమబాణార్కుండు గ్రుంకెనేఁడు
గౌరీశుఁడనియెడు గంభీరవార్థిలో
రిగి మన్మథకలం విసెనేఁడు
ఫాలాక్షుఁడనియెడి డబానలములోనఁ
గంధర్పకాంభోధి గ్రాఁగెనేఁడు
లహరుఁడనియెడు హితమార్తాండుచే
దనాంధకారము మ్రగ్గెనేఁడు

2-127.1-ఆ.
నేఁడు మునుల తపము నిష్కళంకతనొందె
నేఁడు యతుల మనసు నిండియుండె
నేఁడు జగములెల్ల నిర్మలాత్మకమయ్యె
నేమిసేయనేర్తు నెందుఁజొత్తు.

టీక :-
అర్కుడు = సూర్యుడు; క్రుంకు = అస్తమించు; వార్థి = సముద్రము; అవియు = పగులు, బద్దలగు; బడబానలము = సముద్రంలో ఉండే అగ్ని; అంబుధి = సముద్రము; క్రాగు = కాగు, ఆవిరి యగు; మలహరుడు = శివుడు; మార్తాండుడు = సూర్యుడు; అంధకారము = చీకటి; మ్రగ్గు = అణగు.
భావము :-
పరమేశ్వరుడనే పడమటి కొండపై కుసుమబాణుడనే సూర్యుడు అస్తమించాడు. గౌరీశుడనే లోతైన సముద్రంలోనికి వెళ్ళి మన్మథుడు అను పడవ బద్దలైది పొంగింది. ఫాలాక్షుడనే బడబానలముచే కందర్పుడనే సముద్రం మరగిపోయింది. మలహరుడనే గొప్ప సూర్యునిచే మదనుడనే చీకటి అణగిపోయింది. నేటి నుండి మునుల తపస్సులకు కళంకం లేదు. నేడు సన్యాసుల మనసు (భక్తితో) నిండిపోయింది. నేడు లోకాలన్నీ నిర్మలమైన మనసుతో యున్నాయి. ఇంక నేనేమి చేయగలను? ఎక్కడకు పోగలను?..

2-128-చ.
ఱిముఱిఁ జిన్ననాఁడు చెలులందఱు గొల్వగఁ గూడియాడ నీ
చిఱుతది పుణ్యకాంత యని చేతుల వ్రాఁతలు చూచి పెద్ద లే
మెఱుగుదు మంచు చెప్పుటలు యెంతయు తథ్యము గాకపోవునే
యెఱుకలు మాలి పోఁ బిదప నే విలపించుట తెల్లమయ్యెఁ బో.

టీక :-
అఱిముఱిన్ = తరచుగా, దట్టంగా; చిఱుతది= చిన్నది; ఎఱుగుదుము= తెలుసును; తథ్యము= సత్యము; ఎఱుకలు= తెలియడాలు; మాలిన= పనికిమాలిన; పిదప= తరువాత; తెల్లము= స్పష్టము.
భావము :-
బాల్యంలోసేవిస్తున్న స్నేహితురాండ్రుతో కలసి అస్తమానూ యాడుచుండగా, హస్తసాముద్రికం తెలిసిన పెద్దలు చూసి, “ఈ చిన్నది నిశ్చయంగా పుణ్యకాంత” యని చెప్పినవన్నీ నిజం కాదేమో? అదంతా తెలివితక్కువ మాటలేనేమో. తరువాత ఇప్పుడు నేను దుఃఖించుటంతో అది స్పష్టమయ్యింది యేమో.

2-129-సీ.
చితమార్గంబున నుపలాలనముజేసి;
యెలమిరక్షించువా రెవ్వరింక
టవారునిటవారు య్యేడుగడయునై;
యెలమి నన్నేలువా రెవ్వరింక
లీలనర్థించిన లే దనిపలుకక;
యిష్టంబులిచ్చువా రెవ్వరింక
ర్ణంబులకు నింపు గా నిష్టవాక్యంబు;
లేపారఁ బల్కువా రెవ్వరింక

2-129.1-ఆ.
నేఁడు నాథ! నీవు నీ ఱైనపిమ్మట
తివిరి నన్నుఁ గావ దిక్కులేమి
లఁపులోనఁ దలఁపఁ గదయ్యె చెల్లబో
వీరసూకళత్ర! విష్ణుపుత్ర!

టీక :-
ఉచిత = తగిన; ఉపలాలనము = బుజ్జగించు; ఎలమి = ప్రేమ; ఏడుగడ = (గురువు,తల్లి,తండ్రి, పురుషుడు,విద్య, దైవము, దాత యని సప్త ప్రకారములు గల) రక్షకము; ఏడుగడ = సమస్తము; లీల = విలాసము; అర్థించు = కోరు; కర్ణములు = చెవులు; ఏపారు = అతిశయించి; నీరగు = నశించు, మరణించు; తివిరి = ప్రయత్నించి; వీరసూ = వీరుని కన్నతల్లి; కళత్రము = భార్య.
భావము :-
నాథా! మన్మథా! నీవు పోయాక, ఇప్పుడు నాకు, చక్కగా బుజ్జగించి ప్రేమగా రక్షించువారెవరింక? అత్తవారు, పుట్టింటివారు అందరూతానేయై ప్రేమగా నన్నేలువారెవరింక? విలాసంగా అడిగినా లేదనక ప్రియముగా నిచ్చు వారెవ్వరింక? చెవులకింపుగా ప్రియ వాక్యములు పలుకువారెవ్వరింక? నన్ను కోరి రక్షించే దిక్కెవ్వరు? అయ్యో! నాకు వీరమాత కావాలని అనుకోడానికి కూడా అవకాశంలేదు కదయ్యా!

2-130-క.
అంజ! నేననుమాటలు
వెంలియైవినవె కాక వేగమనీకుం
సంరరంగము లోపల
గంగాధరుఁ గవయఁదరము గాదంటిఁ గదే.

టీక :-
అంగజుడు = మన్మథుడు; వెంగలి = అవివేకి; కవయు= ఎదిరించు.
భావము :-
మన్మథా! యుద్ధములో శివుడిని యెదిరించుట నీ తరం కాదని చెప్పాను కదయ్యా! నేను చెప్పిన మాటలు అవివేకివై వినలేదు నువ్వు.

2-131-మ.
కొదిన్ మీఱిన శంభుయోగ శరధిం గుప్పింప రాదంటిఁగాఁ
లోనైనను నొప్పనంటి భవుఁదాఁకన్ వద్దువద్దంటి దు
ర్భమై యూరకవచ్చి శూలి రుషకుంబాలైతివే యక్కటా!
తొలి నేనోచిననోములిప్పుడు భవద్దూరంబు గావించెనే.

టీక :-
కొలది = పరిమితి, శక్యము; ఒప్పు = తగు; దుర్బలము = బలహీనము; రుష = కోపము; పాలు = వశము; భవత్ = (మీరు)నీవు.
భావము :-
వలనుమీఱి నీకు శివయోగిపై బాణములు కుప్పించరాదన్నాను కదా! కలలోనైనా ఒప్పుకోనన్నాను. శివుని తాకవద్దు తాకవద్దన్నాను. యూరకవచ్చి శివుని కోపము బారిన పడ్డావే. అయ్యో! నేను నోచిననోములిపుడు నిన్ను నాకు దూరం చేసాయా?....

2-132-సీ.
ప్పుడు గోపించి యెనయంగ యోగంబు;
మానునోయీయంగ మాయగొంత
యెప్పడుమరునిదా నీక్షించితెలిసెనో;
ధృతిఁబుట్టువులులేని తిరిపజోగి
యెప్డువిజృంభించి యెఱమంటలెగయంగ;
ముక్కన్నుదెఱచెనో ముదుకతపసి
యెప్పుడుగృపమాలి యెప్పడుగాల్చెనో;
కులగోత్రములులేని గూఢబలుఁడు

2-132.1-ఆ.
నుచునెంతవైర నుచునెద్దియుఁజూడ
నుచుమదనువనిత వనిమీఁద
మూర్చవోయితెలిసి మోమెత్తిబిట్టేడ్చెఁ
డఁగిశోకవార్థి డలుకొనఁగ.

టీక :-
ఎనయు= పొందు; మాయ= తొలిదేవర, శివునిలోనే ఉండి, శివుడి ఇచ్ఛ ప్రకారం నడచుకొనే ఒక వృత్తి అని శైవమతానుయాయుల నిర్వచనం. [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010]; ఈక్షించు= చూచు; ధృతి= భోగము; తిరిప= అడుక్కొనేవాడు; ముదుక= వృద్ధుడు; గూఢ= దాచబడిన; అవని= నేల; బిట్టు= మిక్కిలి; కడంగు= వలె; వార్ధి= సముద్రము; గడలువడుడు= చెవుల్లోకి నీళ్ళుపోయి ఒకరకంగా శబ్దం రావడం.
భావము :-
ఈ తొలిదేవర శివుడు ఎప్పుడు కోపంతో కొంత యోగమును విడిచిపెడతాడో కదా! ఈ పుట్టుకలు లేని ఆదిబిక్షువు ఎప్పుడు మరుని చూసి గుర్తించాడో? ఈ వృద్ధ తాపసి ఎప్పుడు విజృంభించి యెఱ్ఱని మంటలు యెగయగా మూడోకన్ను తెఱిచాడో? కులగోత్రాలు లేని గూఢబలుడు జాలి యన్నది లేకుండా ఎప్పుడు కాల్చాడో?” అంటూ “అంత శతృత్వమా? ఏమీ చూసుకో” డంటూ శోకసముద్రంలో మునిగి నేలపై పడి మూర్ఛపోయి తెలివితెచ్చుకునిన రతీదేవి ముఖమెత్తి బిగ్గరగా యేడ్చెను.

2-133-వ.
మఱియున త్యంత దురంత సంతాప చింతాక్రాంతయై అంతకంతకు నక్కాంతాతిలకంబు మహాశోకవేగంబున.

టీక :-
దురంతము = అంతులేనిది; చింతాక్రాంత = బాధలో మునిగినది.
భావము :-
ఇంకనూ అంతులేని బాధానిమగ్నమైన ఆ రతీదేవి బాధతో..

2-134-సీ.
మెఱుఁగుఁదీఁగెయుఁబోలు మైదీఁగె నులియంగ;
పదపడి వలికి లోఁ బొదలువెట్టు
కోకద్వయముఁలోని కుచకుంభములు గంద;
లినాక్షి కరతాడనంబు సేయు
నీలాలగతిఁబోలు నీలంపుటలకలు;
ముడివడయూచి యమ్ముదితయేడ్చు
ల్హారములఁబోలు న్నులు గతిచెడఁ;
మలాక్షి కడునశ్రుణము లొలుక

2-134.1-తే.
ఇంతి విలపించు నత్యంత మేడ్చుఁ బొక్కు
ధిప! చనుదెంచి కావవె నుచుఁ జివుకు
స్రుక్కు మూర్ఛిల్లు దెలివొందు సురలఁదిట్టు
గువ యెంతయు సంతాప గ్న యగుచు.

టీక :-
మెఱగుదీగె = మెరుపుతీగ; మైదీగె = తీగవంటి శరీరము; నులియు = నలుగు; పదపడి = మఱియు, తరువాత; వలి = చలి; పొదలువెట్టు = వర్థిల్లు, పెరుగు; కోకద్వయము = రెండు వస్త్రములు; పోని = పోలిన; కుచకుంభములు = స్తనములు; తాడనము = కొట్టుట; అలకలు = ముంగురులు; కల్హారము = కొంచెము ఎరుపు కలిగి మిక్కిలి పరిమళము గల కలువ; అశృకణములు = కన్నీరు; పొక్కు = దుఃఖించు; చివుకు = మనసు కలతచెందు; స్రుక్కు = భయపడు; మూర్ఛపోవు = సొమ్మసిల్లు; మగ్న = మునిగినది.
భావము :-
దుఃఖములో మునిగిన ఆ రతీదేవి మెరుపు తీగె వంటి శరీరం నలిగిపోయేలాగ, మరింత పెరుగుతున్న చలికి వస్త్రద్వయము నందలి కుచకుంభములు కందేలా చేతితో బాదుకుంటోంది. ఆ రతీదేవి నీలాలవంటి నీలంపు ముంగురులు చిక్కులు పడేలా ఊగిపోతూ ఏడుస్తోంది. కలువకన్నులు కనరేలా కన్నీరు కార్చుతున్నది. రతీదేవి విలపిస్తోంది, హోరున ఏడుస్తోంది, దుఃఖిస్తోంది, కలవరపడుతోంది. “ప్రభూ! వచ్చి కాపాడవా” అంటూ ఆ రతీదేవి కలతచెందుతోంది, భయపడుతోంది, సొమ్మసిల్లిపోతోంది, తిరిగి తెలివితెచ్చుకొని దేవతలను నిందిస్తోంది.

2-135-వ.
 తన మనంబున నిట్లనియె.

టీక :-
మనము = మనసు.
భావము :-
రతీదేవి తన మనసులో ఇలా అనుకుంది.

2-136-మ.
నిను నేభంగుల బాయఁజాల వనితా! నిర్భేదమం దేమియు
న్మ ప్రాణంబులు రెండు నొక్కటిసుమీ నారీమణీ! నమ్ముమీ
ని కావించిన బాసలన్నియును గల్లయ్యెంగదా లక్ష్మినం
యెవ్వారికినైన దైవఘటనల్ ప్పింపఁగావచ్చునే.

టీక :-
ఏ = ఏ యొక్క; భంగి= విధము; పాయు = విడుచు; నిర్భేదించు = విదారించు, చంపు; బాస = ప్రతిజ్ఞ; కల్ల = అసత్యము; ఘటన = కూర్పు.
భావము :-
మన్మథుడా! “ఓ వనితా! నారీమణీ! రతీదేవీ! నిన్ను ఏ విధముగానూ విడిచిపెట్టను చివరకి మన ప్రాణములు రెండూ ఒకటే సుమా! నమ్ము” మంటూ నీవు చేసిన ప్రతిజ్ఞలన్నీ అసత్యాలయ్యాయి కదా! ఎవరికైనా దైవ సంకల్పం తప్పిచుకోవడం సాధ్యం కాదుకదా!

2-137-క.
ని విలపించుచుఁ గుందుచు
 చేరువనున్నయట్టి తాపసవర్యున్
నాథమిత్రు నీశ్వరుఁ
నుఁగొని శోకాతురమునఁ న్నియపలికెన్.

టీక :-
కుందు = క్రుంగు; వర్యుడు = ఉత్తరపదమైన శ్రేష్ఠుడు; ధననాథుడు = కుబేరుడు; ఆతురము = బాధపడునది.
భావము :-
అని దుఃఖిస్తూ క్రుంగిపోతూ తన దగ్గరగా యున్నట్టి తాపసశ్రేష్ఠుడు, కుబేరుని మితృడైన ఈశ్వరుని చూసి శోకముతో బాధపడుతున్న రతీదేవి ఇలా అన్నది.

2-138-క.
“తగు నంబిక శంభునిఁ గని
 మిమ్మిద్ధఱనుగూర్పఁ గు నమ్మరుపైఁ
మీఱఁ గృపఁ దలంపఁక
తెగఁ జిచ్చెరకన్నుమీకుఁ దెరువందగునే.

టీక :-
తగు = యుక్తమగు (తగిన); తగన్ = సరియగు; పగ = విరోధము; కృప = దయ; తెగ = అతిశయిత.
భావము :-
పార్వతీ పరమేశ్వరులను చూసి “యక్తమగు మిమ్ములనిద్దరినీ కలప ప్రయత్నించిన ఆ మన్మథునిపై విరోధమెక్కువై జాలి చూపక అతిశయంతో అగ్నినేత్రం మీరు తెరవచుట తగునా?....

2-139-క.
తొలి నీవు దుష్టజనులం
బొలియింతువు లోకపతులఁ బోషింతువునిం
లఁ బొందవు మరునిట్టులఁ
బొలియించుట నాదునోము పుణ్యము రుద్రా!

టీక :-
తొలి = పూర్వము; దుష్టులు = చెడ్డవారు; పొలియించు = చంపు; పోషించు = రక్షించు; నింద = అపవాదు.
భావము :-
ముందునుండీ నీవు చెడ్డవారిని చంపేవాడివి. లోకపాలకులను రక్షించేవాడివి. అపవాదులు పొందేవాడివి కాదు. మన్మథుని నీవిలా చంపడం, నా నోమముల ఫలము ఈశ్వరా!

2-140-క.
యేచిన మన్మథు దశశత
లోనుఁ డిటుదెచ్చి నీదు లోచనవహ్నిం
ద్రోచెనె యిటుగా నోచితి
యీ చందములైన నోము లిప్పుడు రుద్రా!

టీక :-
ఏచు = బాధించు; దశశతలోచనుడు = వేయి కన్నులవాడు, ఇంద్రుడు; లోచనము = కన్ను; లోచనవహ్ని = కంటిమంట; చందము = విధము.
భావము :-
రుద్రా! నిన్ను బాధించిన మన్మథుని ఇంద్రుడే ఇలా తీసుకువచ్చి నీ కంటిమంటలలోకి తోశాడు. ఈవిధమైన నోములిప్పుడు నేను నోచాను.”

2-141-క.
ను మాటలు విని శంభుఁడు
 మది నీ వనిత శోకతాపాకులయై
ను నేమని యాడునొయని
నియెన్ శీఘ్రమున రజతశైలముకడకున్.

టీక :-
శోకము = దుఃఖము; తాపము = సంతాపము; ఆకుల = చెదరినది; ఆడు = నిందించు; చనియె = వెళ్ళెను; శీఘ్రము = త్వరితము; రజతశైలము = వెండికొండ, కైలాసము; కడకు = సమీపమునకు, వద్దకు.
భావము :-
అలా అంటున్న రతీదేవి మాటలు విని శంభుడు తన మనస్సులో ఈవనిత చాలా దుఃఖముతో తననింకా ఏమంటుందోనని వెంటనే వెండికొండ వద్దకు వెళ్ళిపోయెను.

2-142-వ.
అంతఁ గంతుచెలికాఁడు వసంతుం డిట్లని విలపింప దొణంగె.

టీక :-
కంతు = మన్మథుడు; చెలికాడు = స్నేహితుడు.
భావము :-
అపుడు మన్మథుని స్నేహితుడైన వసంతుడు ఇలా శోకింప సాగాడు......

2-143-ఉ.
సంతితోడ నావలచుజాణఁడు పాంథజనాపహారి నా
సండికాఁడు నన్వలచు ల్లని యేలిక దేవతార్థ మీ
జంముమీఁదవచ్చి బలసంపద నాతనికంటిమంటలన్
సంరభూమిలో మడిసె య్యన దేహముఁబాసి దైవమా!

టీక :-
సంగతి = చేరిక; జాణడు = నేర్పరి; పాంథజనము = బాటసారులు; సంగడికాడు = స్నేహితుడు; ఏలిక = ప్రభువు; దేవతార్థము = దేవతలకొఱకు; జంగము = పరమాత్మ, శివుడు; సంగరము = యుద్ధము; మడియు = చచ్చు; చయ్యన = శీఘ్రముగా; పాయు = త్యజించు.
భావము :-
“స్నేహముతో నేనిష్టపడే నేర్పరి. విట చిత్తములను దొంగిలించేవాడు. నా స్నేహితుడు నన్ను ప్రేమించే చల్లని ప్రభువు. దేవతలకోసం ఈ శివుని పైకి సైన్యముతో వచ్చి యుద్ధభూమిలో శివుని కంటిమంటలతో వెంటనే శరీరము వదలెను కదా. దైవమా!...

2-144-ఉ.
శంరజోగిఁదెచ్చి సమసారనివాసునిఁజేయకున్నచో
నంకిలిగల్లు నీ జగమున్నియు నిర్జరకోటితోడ నే
వంకు వ్రాలు నంచు సురల్లభుఁ డక్కట తన్నుఁ బంప మీ
నాంకుఁడువచ్చి నేఁడు త్రిపురాంతకుచే దెగటారెఁ జెల్లఁబో.

టీక :-
జోగి = యోగి; సమసారము = సంసారము; అంకిలిపడు = నశించు; నిర్జర = దేవత; వంక = దిక్కు; సురవల్లభుడు = ఇంద్రుడు; అక్కట = అయ్యో; మీనాంకుడు = చేప గుర్తు ధ్వజమువాడు, మన్మథుడు; త్రిపురాంతకుడు = త్రిపురములను ధ్వంసము చేసిన వాడు, శివుడు; తెగటార్చు = నశింపచేయు, చంపు; చెల్లబో = సంతాపార్థకము.
భావము :-
“శంకర యోగిని తెచ్చి సంసారవాసునిగా చేయకపోతే నశించెడి యీ లోకాలన్నీ, దేవతలతో సహా యేమై పోతాయో” యని ఇంద్రుడు పంపగా అయ్యో! ఈ మీన ధ్వజుడు, మన్మథుడు వచ్చి ఈనాడు శివునిచే బుగ్గయిపోయాడే

2-145-క.
మానిని! మదనుని యుద్ధము
గానంగా నేరనైతి కాముఁడు రాఁగన్
దానేల పాసిపోయితి
భూనుతగుణహారుఁ గోలుపోయితి నకటా.”

టీక :-
మానిని = మానము గల ఆడుది, రతీదేవి; కానగు = కనపడు; పాసిపోవు = విడివడు; భూనుతము = ప్రసిద్ధమైన; అకటా = అయ్యో.
భావము :-
“అయ్యో! రతీదేవీ! మదనుని యుద్ధము చూడలేకపోయాను. కాముడు రాగా నేనెందుకు కూడా రాలేదు. ప్రసిద్ధమైన గుణములు కలవానిని కోల్పోయాను.” అంటూ వసంతుడు విలపించాడు.

2-146-క.
ని యామని విలపింపఁగ
ని తూలుచు మోదికొనుచుఁ డు వగతోడన్
సిజవల్లభ మఱి దా
విను మని యామినికిఁ బలికె విపులాతురయై.

టీక :-
ఆమని = వసంతుడు; కని = చూసి; వగ = శోకము; మనసిజ = మన్మథుడు; వల్లభ = భార్య.
భావము :-
అలా విలపిస్తున్న వసంతుని చూసి తూలుతూ మొత్తుకుంటూ యేడుస్తూ యెంతో యాతురపడుతూ వినమంటూ మన్మథుని భార్య వసంతునితో ఇలా పలికింది.