సభలు సమావేశాలు : 2024 - భాగవత జయంతి
ఆత్మీయ భాగవత బంధుమిత్రులారా నమస్కారములు. మీకు తెలుసు కదండి! మనం భాగవతరత్న పురస్కారం వార్షికోత్సవమున ప్రదానం చేయుచుంటిమి. ఈ పుణ్యకార్యక్రమము ఆరంభమునుండియూ ఎంపిక మండలి అధ్యక్షులుగా మమ్ము అనుగ్రహిస్తున్న, శ్రీ శ్రీ శ్రీ మహాస్వామి అమృతానంద సరస్వతీ స్వాములవారి ఆశీర్వాదబలంముతో ఇప్పటికి ఏడుగురికి (7) భాగవతరత్న పురస్కారాములు ప్రదానము చేయుట జరిగెను.
కృష్ణాష్టమి తత్కాల2024, ఆగస్టు- 27వ తారీఖు సాయంకాలం; 8వ భాగవతరత్న పురస్కారం “డా. భూపతిరాజు బంగార్రాజు” వారికి ప్రదానం చేయు శుభకార్యక్రమం జరిగింది. “శ్రీసీతారామాంజనేయ స్వామి దేవస్థానము, కొండాపూర్”, ప్రాంగణంలో వారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవముతో కలిసి శుభప్రదంగా, జయప్రదంగా జరుపుకున్నాము. “డా. చిలకపాటి విజయ రాఘవాచార్యులవారు”, దేవస్థానము కార్యదర్శి వారి అధ్వర్యంలో ఆరంభించబడినది. ప్రార్థనలో చి.సౌ. అమృత త్యాగరాజ కృతులు, తరంగము పాడారు.
తెలుగు భాగవత ప్రచారసమితి వారు 8వ భాగవత రత్న పురస్కార ప్రదానము, డా. భూపతిరాజు బంగార్రాజు వారికి ప్రదానము చేయబడినది, ముఖ్యఅతిథి ప్రముఖ గాయక విద్వాంసులు డా. కొమ్మండూరు రామాచార్యులు వారి చేతులమీదుగా ప్రదానం చేయబడినది. దేవస్థానం కార్యదర్శులు డా. చిలకపాటి రాఘవాచారి వారి ప్రత్యక్షంలో పోతనామాత్యులను ఆజ్ఞాపించిన శ్రీరామచంద్రల వారి దివ్య క్షేత్రంలో శుభప్రదంగా జయప్రదంగా డా. భూపతిరాజు బంగార్రాజు వారికి ప్రదానం చేయడం జరిగింది.
శ్రీ శ్రీ శ్రీ మహాస్వామి
అమృతానంద సరస్వతీ స్వాములవారి
అభిభాషణ, ఆశీస్సులు:-
“డా. చిలకపాటి విజయ రాఘవాచార్యులు”, దేవస్థానము కార్యదర్శి వారి సభాప్రారంభ అభిభాషణ
దీనికి ముందు స్వామి వారి పల్లకీ సేవ, పిల్లల కృష్ణ గోపికల వేషధారణ మఱియు ఉట్టికొట్టుట బహు రమణీయంగా, అత్యంత కోలాహలంగా జరిగింది.భాగవత రత్న ప్రదానము పిమ్మట, శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానము తరఫున డా. చిలకపాటి విజయ రాఘవాచార్యులవారిచే ప్రథమ “భాగవతప్రియ పురస్కార” ద్వయము “డా. శ్రీ బాదం మురళీ కృష్ణ”, “వేదాల బదరీనాథ స్వామి” గార్లు ఇద్దరకు “డా. రామాచార్యులు” వారి చేతులమీదుగా ప్రదానము చేయబడినది.