పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2017 - చతుర్థ వార్షికోత్సవాలు, సింగపూరు

2017 భాగవత జయంత్యుత్సవములు; కృష్ణాష్టమి;తెలుగుభాగవతం,ఆర్గ్ చతుర్థ వార్షికోత్సవములు.
(ఈ) సింగపూరు సంబరాల వివరాలు, ఆ చిత్రాలసరళి:-- ఈ ఏడాది ఉత్సవాలు నాలుగు కేంద్రాలలో (అ) హైదరాబాదులో (రవీంద్ర భారతి); (ఆ) అమెరికాలో టాంపా నగరంలో; (ఇ) పిఠాపురం దగ్గరలోని విరవ గ్రామంలో మఱియు (ఈ) సింగపూరు నగరంలో అందరి ఆదర ప్రోత్సాహాలతో సుసంపన్నంగా, జయప్రదంగా జరుపుకున్నాము.
(ఈ) సింగపూరు సంబరాలలో భాగంగా సింగపూరు సభ్యులు ఊలపల్లి భాస్కర కిరణ్ అధ్వర్యంలో జూలై, 2017లో పిల్లలు పాల్గొను ఆన్ లైను పిల్లల బొమ్మల పోటీ పేర శ్రీకృష్ణుని బొమ్మలకు రంగులు వేయుటలో పోటీ పెట్టడం అయింది. దీనికి వివిధ దేశాల నుండి 132 మంది స్పందించారు. 57 మంది బాలలు వేసిన 102 బొమ్మలు అందాయి. పిల్లలు చాలా అద్భుతంగా బొమ్మలు రంగులు వేసి పంపారు. అందరూ తప్పక అభినందననీయులే. కాని కొందరిని మాత్రమే విజేతలుగా నిర్ణయించడం తప్పని సరి. కనుక, వీటి మూల్యాంకన చాలా కష్టమయినది. వాటిని వడగట్టి శ్రీశ్రీశ్రీ పరివాజ్రకాచార్య అమృతానంద సరస్వతి స్వామి వారి ఆజ్ఝ మేరకు, 15 మందిని విజేతలగా ఎంచడం జరిగింది. “పిల్లల బొమ్మల పోటీ” విజేతలకు బహుమతులు, ధృవపత్రములు, పాల్గొన్న వారికి ధృవపత్రములు అందించాము. వారిలో సింగపూరులో వారికి, 2017-09-20 సాయంకాలం, లయను వినాయగర్ దేవాలయం, చైనా బజారు, సింగపూరులో జరిగిన సంబరాలలోను; విరవ గ్రామం పిల్లలకు శ్రీ రామాలయ ప్రాంగణం, విరవ గ్రామంలో 2017, ఆగస్టు, 20 ఉదయం జరిగిన సంబరాలలోను ప్రదానం చేయబడ్డాయి. ఇతర ప్రాంతాల వారికి తొందరలో పంపగలము.

లయను వినాయగరు టెంపులు, చైనా బజారు, సింగపూరులో 2017, ఆగస్టు, 20 సాయంకాలం భాగవత జయంతి 2017 సంబరాలు హుషారుగా జరిగాయి. శ్రీ ఊలపల్లి; శ్రీ రవి; సింగపూరు సమాజం బాధ్యులు శ్రీ రత్నకుమారు; శ్రీమతి మంగపూడి రాధిక; శ్రీ శశికుమారు ప్రభ్రుతులు తెలుగు భాగవతం విశిష్ఠతను ఉదహరిస్తూ, తెలుగు భాగవతం వలన అందరికీ ఎంతో మేలు జరుగుతుంది అంటూ. ఇటువంటి కార్యక్రమం జరగడం ముదావహనీయం అని తమ ప్రసంగాలలో పేర్కొన్నారు. భాగవత పద్యాలు, భావ సహితంగా కొన్నింటిని సభా వేదిక మీద లలిత పారాయణం చేశారు. పిల్లలు పెద్దలు చక్కటి పద్య పఠనాలు, మనోహరమైన అన్నమయ్య కీర్తనలు, చిన్ని కృష్ణ, రాధిక వేషాలు ధరించిన చిన్ని పిల్లల నాట్యం పసందుగా జరిగాయి. అందరూ కలిసి మహా ప్రసాద భోజనాలు కలివిడిగా చేశారు. ఈ విధంగా జయప్రదంగా, సుసంపన్నంగా కార్యక్రమం జరిగింది. ఆ చిత్రాల మాలిక వీక్షించండి.:---


ఓం నమో భగవతే వాసుదేవాయ