పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పోటీలు : భాగవత రత్న పురస్కారానికి దరఖాస్తు


EMBLEM

; తెలుగు భాగవత ప్రచార సమితి
హైదరాబాద్, తెలంగాణా, ఇండియా.
(85/2015 సంఖ్యతో నమోదైన సంస్థ; Regd. Trust wide no. 85/2015)
చరవాణి: +91 9959 61 3690; +91 9000 00 2538; +91 8826 33 3690;

హైదరాబాద్,
2018-03-18,

2018 సంవత్సరానికి భాగవత రత్న పురస్కారానికి ఆహ్వానము

తెలుగు భాగవత ప్రచార సమితి వారు 2018 సంవత్సరానికి గాను భాగవత రత్న పురస్కార ప్రదానం చేయదలచారు. ఇందునిమిత్తమై, అర్హులైన పరిశోధకుల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
నియమాలు:
* సదరు పరిశోధకులు కాని ఇతరులు కాని దరఖాస్తులు వివరాలు అందించవచ్చు. దరఖాస్తులు వివరాలు 2018, ఏప్రిలు 30వ తారీఖు లోపున అందేలా పంపవలెను.
* తెలుగులో వచ్చిన భాగవతంపై; కాని సహజ కవి పోతనామాత్యులపై కాని చేసిన పరిశోధనకు పిహెచ్.డి లేదా ఎమ్,ఫిల్ పట్టా పొంది ఉండాలి.
* సదరు పట్టా 2007 లేదా తరువాత కాని పొంది ఉండాలి.
* సదరు పరిశోధకుని పేరు, స్పష్టమైన సంపర్క (contact) వివరాలు, పరిశోధనాశం, సంవత్సరం, గైడు పేరు, విశ్వవిద్యాలయం పేరు అందించాలి.
* పరిశోధనా పత్రం పిడిఎఫ్ రూపంలో కాని యూనీకోడు లిపి దస్త్రంగా కాని సమర్పించాలి.
* సదరు పత్రం మన జాలగూడులో ప్రచురించవలెను అంటే తగిన అనుమతి పత్రం కూడ జతచేయాలి.
* (bhagavatapracharasamiti@gmail.com కు ), లేదా (vsrao50@gmail.com కు ) వేగరి సందేశం రూపంలో ధరఖాస్తులను పంపాలి,
* పురస్కార ప్రదానం విషయంలో కాని, జాలగూడులో ప్రచురించు విషయంలో కాని తెలుగు భాగవత ప్రచార సమితిదే తుది నిర్ణయం. ఎట్టి సంప్రదింపులు అనుమతింపబడవు.
భాగవత గణనాధ్యాయి.
తెలుగు భాగవత ప్రచార సమితి.