పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : తమాదిదేవం

భాగవత - భగవంత అభేదం


భగవంతునికి, భాగవతానికి, భక్తునికి అభేదం చెప్తుంది భాగవతపురాణం. పెద్దలు, విజ్ఞులు భాగవత స్వరూపానికి ఇలా ప్రణమిల్లుతూ ఉంటారు. . .


తమాదిదేవం కరుణానిధానం
తమాలవర్ణం సుహితావతారం
అపారసంసారపయోధి సేతుం
భజామహే భాగవతస్వరూపం.

దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు కృపానిధి, తమాలవృక్షం వలె శ్యామవర్ణశోభితుడు, లోకకల్యాణార్ధము పెక్కు అవతారములను దాల్చినవాడు, అపారమైన ఈ సంసారసాగరము నుండి తరింపజేయునట్టి దివ్యసేతువై భాసిల్లుచుండెడివాడు. ఆ పరమాత్ముని దివ్యస్వరూపమే భాగవతం. ఆ పరంధాముని భజింతుము.

అందుకే కావచ్చు, బమ్మరె పోతనామాత్యుల వారు ఎంతో శ్రమకోర్చి, ధైర్యం వహించి నరులకు అంకింత మివ్వను, రామచంద్రునికే అంకితం అని నిష్ఠగా తెలుగీకరించినది. "పలికెడిది భాగవత మట, పలికెంచెడి వాడు రామ భద్రుండట" అన్నది. ఈ ప్రభు గ్రంథాలకు అభేద దృష్టి సాధించిన అమ్మహనీయుని భక్తుడని వారికి భాగవతానికి, భగవంతునికి భేదం లేదని అనవచ్చును అని నా అభిప్రాయం.