పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : సాంఘిక మాధ్యమాలలో పోతన

ముఖ పుస్తకంలో అప్పుడప్పుడు పోతనామాత్యుల వారి గురించి వచ్చిన టపాలను ఇక్కడ ఉల్లేఖించబడుతున్నాయి. . మనసారా. . ఆస్వాదించండి. . . .

ముఖ పుస్తకం 2016-10-16
భమిడిపాటి సుహ్మణ్యం

పో న యాంధ్ర భాగవత పూత మహత్వ కవిత్వసంపదల్
జా తికి నక్షరామృత విశాల యశోభర దివ్యశేవధుల్
చే ము పొంగ నా సుకవిశేఖరు పావన పాద పీఠికిన్
జో లొనర్తు నాజతన శుద్ధికి సిద్ధికి భక్తిభావనన్.


ఇంపారెడు పద్యంబులు సొంపారగకృతిసేసెను శంకాలకు బెదరని టంకాలకు లొంగని తెలుగన్నమనపోతన్న.
- గంటి లక్ష్మీనారాయణ, బెంగళూరు


2016-10-16 భాగవత గణనాధ్యాయి
భాగవతం కల్పవృక్షం అని నిర్దేశించాడు మన జాతీయ మహాకవి పోతన.
అవును కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుంది. కాని, ఎంతటి మందారమైనా, మేడిపండు మేలిమి కోసం అర్రులు చాస్తుంటే, మందారమాలల మప్పిదాలతో మైమరపించదు కదా.
అందుకే మర్చిపోకుండా, పోతన తెలుగు భాగవతాన్ని లోకోపకారార్థం వాగ్మయ రూప విశ్వేశ్వర విందుగా ఆస్వాదిద్దాం.
ఆత్మతత్వ విశ్లేషణలైనా, కవితామృత ఝరులైనా, భక్తిప్రపత్తుల ప్రవాహాలైనా, విషయ వైజ్ఞానికాలైనా ఏమైనా లోకోన్నతికోసమే అద్యయనం చేద్దాం, పరిశోదిద్దాం.

వ్యాసభగవానుని మనసు, సంస్కృత భాగవతంలో కంటే,
పోతన భాగవతంలోనే మరింత సమృద్ధిగా ఆవిష్కృతం అయింది
- గణనాధ్యాయి


2016, సెప్టంబరు – 21.
అనంత కృష్ణ గారు,

ఉత్పలమాల.
భా వతమ్ము మోక్షమిడు భాగవతమ్మును నమ్ముకొన్నచో
భా వతమ్ముతోడి గతి భాగవతమ్మునకై నమస్కృతుల్
భా వతమ్ముబట్టి మెలు భాగవతమ్మునకిచ్చు మన్ననౌ
భా వతమ్మునందు రుచి భా గ్యము నాకిడు భావవేదివై.


బమ్మెర పోతన జయంతి మహోత్సవం
కవి సమ్మేళనము


బమ్మెర : 17 జూలై 2016

బమ్మెర పల్లెది భాగ్యమదేమి?

బమ్మెర పల్లెది భాగ్యమదేమి?
పోతన్న పుట్టిన పుణ్యాల ఊరు!
బమ్మెర పల్లెది భాగ్యమదేమి?
పోతన్న నడిచిన పుత్తడి నేల

బమ్మెర పల్లెది భాగ్యమదేమి?
కమ్మని కవనాల తెమ్మెర లాయె!
చాళుక్య రాజుల కాలమ్ము నాడె
కట్టిరి ఇక్కడ కరకంఠు గుడిని
పక్కనే పాల్కుర్కి పరమేశు గుట్ట
ఆపక్క వల్మిడి రామన్న గుట్ట
వారసత్వమ్మిచ్చె భక్తి భావుకత
పాల్కుర్కి సోమన్న పాండిత్య మిచ్చె
పల్కు లాలిత్యంబు వాల్మికి ఇచ్చె
లక్కమ్మ వాగులో చక్కని నీల్లు
నరసన్న బావికి నడిచెడి మోట
పోతన్న మాన్యాన్ని పొతముగా దున్న
సేద్యాలు చేయుచు పద్యాలు చెప్ప
కవితలు గుత్తులై కాసినా యిచట
పద్యాలు పంటలై పండినా యిచట
వీరభద్రుని యొక్క విజయమున్ వ్రాసి
నిటలాక్షు మహిమను నిక్కంబు తెలిపె
భోగాలు భాగ్యాలు పొందగా భ్రమసి
సర్వజ్ఞులని నమ్మె సరస రాజులను
భోగినీ దండకం పొరపాటు చర్య
పడియల నీరది వలదని తెలిసి
మందార మకరంద మాధుర్య మైన
భాగవత కథలు భక్తితో పాడె
చేతు లారంగను శివుని పూజించి
నోరు తీయంగను హరిని నుతించి
జీవన సాఫల్య చిరకీర్తి నందె
పావన కైవల్య పదవిని పొందె
బమ్మెర పల్లెది భాగ్యమదేమి?

పోతన్న పుట్టిన పుణ్యాల ఊరు!
బమ్మెర పల్లెది భాగ్యమదేమి?
పోతన్న నడిచిన పుత్తడి నేల
~'రసన' (రాపోలు సత్యన్నారాయణ)




10 - ఏప్రిలే, 2015.
భక్తి ప్రపత్తికి మారుపేరు బమ్మెర పోతన – గణనాధ్యాయి. ఈ విషయంలో పరిటాల గోపీ కృష్ణ గారు ఏమంటున్నారు అంటే.
పరిటాల గోపీ కృష్ణ
శరణాగతి

భక్తుడు తన రక్షణ భారం సమస్తము భగవంతునియందే సమర్పించడం శరణాగతి. శరణాగతుడు కావడానికి లింగవయోభేదం కాని, జాతిమతభేదం కాని, దేశకాల నియమం కానీ లేదు. అందరూ, అన్నివేళలా, అన్నిచోట్లా, అన్ని విషయాల్లో భగవంతుడి శరణు పొందవచ్చు.

సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||
(భగవద్గీత 18-66)

ఈ శ్లోకం శరణాగతి అవసరాన్ని, విశిష్టతను, విధానాన్ని ఇలా పేర్కొన్నది. సమస్త ధర్మాలను విడిచిపెట్టి, నన్ను ఒక్కణ్ణే శరణు పొందు. నేను సమస్త పాపల నుండి నిన్ను ఉద్ధరిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కనుక భగవంతుణ్ణి శరణు పొందడం మోక్షప్రదం. శరణాగతునికి ఇతర సాధనాదికంతో పనిలేదు.

శరణాగతి ఆరువిధాలు:
(1) అనుకూల సంకల్పం :: భగవంతుడు తనకు అనుకూలుడు అనే విశ్వాస భావంతో ఆయన్నే ఆశ్రయించి ఉండడం.
(2) ప్రతికూల వర్జనం :: భగవంతుని ఆశ్రయం పొందడానికి వ్యతిరేకమైన సంసార సంబంధ విషయాలను వదలిపెట్టడం.
(3) సంపూర్ణ విశ్వాసం :: స్వామియే తనను రక్షిస్తాడనె సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం.
(4) గోప్తృత్వ వరణం :: రక్షించువాడు భగవంతుడే అని నమ్మి, తనను రక్షించమని వేడుకొనడం.
(5) ఆత్మ నిక్షేపణం :: భగవంతునియందే ఆత్మ సమర్పణం చేసి, తాను అస్వతంత్రుణ్ణి అని భావించి, ఆత్మ రక్షణకై స్వామిని వేడుకొనడం.
(6) కార్పణ్యం :: నైచ్యానుసంధానం చేసి, అనగా తాను చాలా తక్కువ వాణ్ణి అని విన్నవించి, తన దీనత్వాన్నీ, అశక్తతను స్వామికి విన్నవించడం.

ఇలా ఈ ఆరు లక్షణాలు కలిగి, సర్వకాల సర్వావస్థలలో భగత్సేవలతో, స్మరణతో జీవితం గడపడం సంపూర్ణ శరణాగతి.

(విద్వాన్ డా. పమిడికాల్వ చెంచుసుబ్బయ్య)


POOVA RAGHAVAN IYENGAR
"அனைத்து எனது பிராமண சொந்தங்களுக்கு"
VADAKALAI AND TENKALAI DISTINCTIONS

In Srivaishnava school itself, two branches of thought had emerged between the time of Sri Ramanuja and that of Sri Vedanta Desika whose contemporary was Pillai Lokacharya. They are called Vadakalai ( Northern ) and Tenkalai ( Southern) though in reality there is NO GEOGRAPHICAL POLARIZATION to justify their nomenclature.
Possibly, this is due to greater importance ascribed by the former to the Vedas which were in Sanskrit, a language prevalent in the Northern part of India, while the latter stressed the importance of the Divya Prabandams of Alwars which were in Tamil, the language prevalent in Southern part of India. This distinction has, in fact, no meaning since both in temple worship and in the hearths and homes the two streams have been so integrated and observed by both the branches.
Swami Sri Vedanta Desika is generally regarded as representing the so called ' Vadakalai' sect. But, since he has produced monumental works in both the ' Northern Sanskrit' and the ' Southern Tamil', he and his followers could more appropriately be called ' Ubhaya Kalai' ( both Kalais) rather than mere ' Vadakalai'.
Also, their differences are not on fundamentals but on certain aspects of the Srivaishnava philosophy which one branch emphasises with greater force than the other. It is unfortunate that some later day enthusiasts of the two branches went to stupid lengths ( e.g. ) putting alternatively their respective ThirumaN on the forehead of the poor temple elephant and taking the dispute right upto the privy council.
In fact, most people know only this difference regarding the application of the white clay caste marks in the form of 'U' by the northern and 'Y' by the Southern sects. It would appear that when an Acharya observed that the base of the castemark should touch the TIP of the nose. one set took it to mean the TOP-TIP where to link the eyebrows with a U shaped curve while the other took it to mean the TOE-TIP, with a spear- point -like stroke riding on the back of the nose reaching up to the nostrils. We do not know whether the Acharya did not explain what he meant or the Sishyas did not seek a clarification or the Acharya had become unavailable for an explanation. Be that as it may, the practices had come to stay and stay with such disastrous consequences. This is an example of how over- enthusiastic fanatics could blow up even insignificant and inconsequential distinctions to abnormal proportions.
There are about 18 such points of differences with varying degrees of insignificance as not to deserve a discussion at all. Still, being on the subject, we shall briefly allude to a few of them by way of illustration and without comment
1. Regarding Lord's mercy. Next to the Caste mark, this probably is the only other difference most people are aware of
Vadakalai View
Some positive gesture is necessary on the part of the jeevatma to deserve the grace of God, because He can be deemed partial if He grants Moksha to all both deserving and undeserving.
Tenkalai View
Lord's grace is spontaneous. He can grant Moksha to anyone he likes.
2. Regarding the status of Lakshmi (i) as to her being the means (ii) as to her being infinite (iii) as to her being Paramatma
Vadakalai View
(i) She is the means for attaining salvation as much as the Lord Himself and also has the role of a mediator ( Purushakara)
(ii) She is infinite in nature (Vibhu) like the Lord Himself
(iii) She is also Paramatma as much as the Lord Himself
Tenkalai View
(i) Do not accept this position though they accept her recommendatory role as held by
Vadakalais
(ii) She is atomic in nature like other Jeevatmas
(iii) She is a Jeevatma like any of us.
3. Regarding Kaivalya
Vadakalai View
(i) Kaivalya is inferior to Paramapada
(ii) Kaivalya is not eternal
(iii) Kaivalya is situated Outside Paramapada
Tenkalai View
(i) Accepted
(ii) Kaivalya is eternal
(iii) Kaivalya is within Paramapada but in its outermost parts.
4. Regarding the means of Bhakti and Prapatti
Vadakalai View
Accept both as the direct means but Bhakti is more difficult and dilatory while Prapatti is easy and immediate
Tenkalai View
Do not accept any means because Jeevatma is so utterly dependent as to be incapable of adopting either Bhakti or Prapatti as a means.
5. Regarding Prapatti
Vadakalai View
Prapatti has to be a positive specific act of surrender by the jeevatma to the Paramatma
Tenkalai View
No positive, specific act is necessary. All that is required is
(i) the knowledge of the Svarupa of the Jeevatma and
(ii) mental acceptance of the Lord's grace in granting salvation
6. Regarding sins
Vadakalai View
When a jeeva surrenders, the Lord forgives the sins committed by the jeevatma and grants Moksha.
Tenkalai View
The sins of a jeevatma is a source of joy for the Lord who relishes the same like a cow licking off the dirt on the body of its calf
7. Regarding performance of Compulsory duties like Sandhyavandanam
Vadakalai View
As compulsory duties are laid down by the Sastras which are the Lord's commandments, non- performance will tantamount to transgression of His commands (Ajna adhilangana) and will render the Prapanna liable for punishment
Tenkalai View
To a highly evolved soul, non- performance of the compulsory duties is not an offence. But, they should continue to do them more for setting an example to the less evolved souls.
8. Regarding the interpretation of the words "Sarva Dharman Parityajya' occurring in the Charama sloka
Vadakalai View
The Dharmas actually refer to the 32 Vidyas attaching to Bhaktiyoga which had already been given up by the jeeva due to incapacity and delay involved in observing them and the Lord offers to stand in their place
Tenkalai View
This is literally interpreted to mean ' First, give up your duties and then take refuge in the Lord'
9. Regarding the Lord's grief at the suffering of the souls
Vadakalai View
One can have grief only when one cannot remove suffering of another. But, the Lord is capable of removing suffering. So, there is no need for Him to grieve. As Sri Rama , He shows to the World how a human would feel and how one should react on seeing the misery of others.
Tenkalai View
They hold that the Lord actually feels sorry on seeing the sufferings of souls and cite examples from Srimad Ramayana where Sri Rama is depicted as grieving over the misery of others.
10. Regarding the Lord's being also atomic as well as gigantic in size as mentioned in the Veda
s.Vadakalai View
He is smaller than the atom in beings that are atomic in size. This is called 'Antar Vyapti' ( Immanence). He is also greater than the greatest in the sense He pervades and surrounds everything. This is called ' Bahir Vyapti'. ( Transcendence)
Tenkalai View
His being atomic in atoms and enveloping even the biggest are all done by what is known as 'Agatitha Ghatana Saamartya'- Special powers enabling accomplishment of even the impossible.


ముఖ పుస్తకంలో – 22, నవంబరు-2015
మద్దూరి రామ్మూర్తి

పో త నా!

శ్రీ రఘురామ నామ ఫలసేవన భాగ్య నిరంతరాత్త వి
స్ఫార మహత్వ భక్తిరస వర్ష నిమజ్జన సద్రసజ్ఞ స
త్కార నమస్సుమాళి పరికల్పిత హారధరా! దిగంత
విస్తార యశస్కరా! సుగుణ సాగర! నీ సరి లేరు పోతనా!

హాలికుడీవు. నీ హల మహత్వ పటుత్వ మదెన్ని పుట్ల ధా
న్యాలను నిల్వ జేసినదొ? నాకది యప్రకృతమ్ము పోతనా!
బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్
లీల సృజించినాడ వవనిన్ హరి కీర్తన మిన్ను ముట్టగా!

మొలక లెత్తించితే మురహరి సద్భక్తి
బీజ మంకురమౌచు వెలయు నట్లు,
చిగురింప జేసితే శ్రీనాథు భవ్య నా
మాంకురాల్ చివురులై యలరు నట్లు,
వృద్ధి జేసితె మహావిష్ణుని లీలల
చివురులు ననలౌచు చెలగు నట్లు,
పెంచి పోషించితె యంచితమ్ముగ భక్తి
ననలు ఫలమ్ములై తనరు నట్లు,
హాలికుడవౌచు కలమను హలము పట్టి
సంస్కృతాంధ్ర సుక్షేత్రమున్ సాగుజేసి
భాగవత కల్ప వృక్షమున్ వ్యాప్తిజేసి
భువికి నొసగిన బమ్మెర పోతనార్య!
మహిత గుణశీల! కొమ్ము నమశ్శతమ్ము.

ఇంతింతై మొదటింతయై మహిమతో నింతై పురాణాదులం
దంతై వేద చతుష్క భాష్యముల కంతై శాస్త్ర షట్కమ్ము నం
దంతై లక్షణ లక్ష్య సంతతుల కంతై శబ్ద మాధుర్యమం
దంతై భాగవతమ్ము భక్తి మయమై వ్యాపించె నో

పోతనా!

అడిగెదనని కడువడి జను
పడతి రమకు మకరి కరిని పటుల తరముగా
కడువడి జడియ రదనముల
నొడిసిన కథ పలికితివిగ నురు రచన కవీ "

మందార మకరంద మాధుర్య ధారల
బోలు పద్యరసము గ్రోలినాము,
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరాల
మగుచు భక్తి సుధల నానినాము,
కమలాక్షు నర్చించు కరములు గలవారి
సూక్త్యమృతమ్మున సొక్కినాము,
నారాయణుని దివ్య నామాక్షరమ్మొసగు
జ్ఞానశక్తి ప్రభల్ గాంచినాము,
నవరసమ్ముల కిక్కయై భువన తతికి
భక్తి ముక్తుల నందించె భాగవతము
పోతనా! నీదు కావ్యాబ్ధి మునగనట్టి
ప్రాణి యున్నదె? తెలుపుమా? వర కవీంద్ర!

విశ్వము చుట్టివచ్చిన కవీంద్రుడ వంచు జనుల్ నుతింపగా
శశ్వదనూన మంగళ యశమ్మును బొందితివయ్య
పోతనా!

పశ్వధినాథ వర్షిత శుభాక్షతలన్ గ్రహియించినావె
వాగశ్వ సుహేషిత ధ్వని వియచ్చర సీమ ప్రతిధ్వనించెగా!
అన్నము లేదుగాని కవితామృత మిచ్చెద గ్రోలుడంచు వి
ద్వన్నుత! సత్కవీశ్వర బుధ ప్రకరాళి కలంకృతమ్ములౌ
గిన్నెల భక్తి శర్కర నొకింతగ జేర్చి యొసంగినావు. పో
తన్న కవీంద్ర! నీవె కవివన్న. కవిత్వమటన్న నీదెగా!

అమ్మకచెల్ల! నీ సుకవితామృత మాని రసజ్ఞులెల్లరా
కమ్మని కైపులో మునిగి కంజ దళాక్షుని సత్కృపా కటా
క్షమ్మె మనమ్ము లోని అరిషడ్తతి ద్రుంచు సుదర్శనమ్ముగా
బమ్మెర పోతనా! దలచి భద్రత నంది తరించి నారుగా!

బుడి బుడి నడకలు నడుచుచు
నుడుగుచు కెరలుచు దుముకుచు నుటజ పరిసరిన్
జడియక మృగతతి వరముని
వడి దెలిపిన కథ వినెనట భళి భళి సుకవీ!

జలజ లతాంతముల్ దిశల సాగ పరీమళ సౌరభమ్ము, ముం
గల గల మాధ్విపూరిత వికాస సరోజము, గున్నమావి మో
కల కలనాద మంగళ పికస్వర గానము, హాయి గొల్పు ని
ర్మల మలయానిలమ్ము. అనుమానమ. నీ కృతి యద్ది పోతనా!

ఇక్షురసమును కండ శర్కరను మధువును చంద్ర చంద్రికలను కలబోసిన దివ్య రసమున ఘంటమునద్ది భాగవత కావ్యమును వ్రాసిన మహా కవిశేఖరునకు, సహజ పాండిత్య బిరుదాంచితునకు, పుంభావ భారతికి ఇంతకన్న నే నే మీయగలను.


@vakkel / twitter.com

@TeluguBhagavatm @Sai_swaroopa

పాలిక నెక్కుచు నిక్కినదొకరు
హాలము దుక్కుతు మెలిగినదొకరు
తెలుగుసాహితీ పొలమునకలయుచు
పలుకులతల్లిని సాకిన ఇరువురు


2005-03-19, ముఖపుస్తకం
వింజమూరి వేంకట అప్పారావు

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్....

.అమ్మల గన్న యమ్మని తలచి ప్రారంభించిన తెలుగీకరింపబడిన శ్రీమద్భాగవత రచన అజరారమరం, మధురాతి మధురం, మహా మహిమాన్వితం అయింది. దుర్గమ్మని స్తుతించే ఈ మహాద్భుత పద్యం అమ్మ గురించీ అంటూ అడగటం మొదలు పెట్టడం ఆలస్యం మనసులో మెదులుతుంది. ఎంతటి పండితులైనా తలచుకోకుండా ఉండలేని మధురమైన పద్యం యిది. పోతన గారు తన యసమాన ప్రతిభతో అమ్మ అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన ఈ దుర్గాదేవి స్తోత్రం తెలుగువారికి అందిన అమూల్య వర ప్రసాదం. భక్తుడికీ, భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి ప్రార్థన. ఇలా "దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా, ప్రేమగా పిలుచుకునే భావన్ని, భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు ఎన్ని శతకోటి వందనాలు చేసినా తక్కువే.

ఎప్పుడో ఒకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడు ఉండడు. నిత్యపూజలో కాని ఏ శుభారంభంలో కాని ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని మంత్రాలు జపించినా “అమ్మ” పూజ మొదలెట్ట దగ్గది ఈ తియ్యటి పిలుపు లాంటి ఈ మహామంత్రం. సర్వ శుభాలని సకల విజయాలు సమకూరతాయి.


సోమవారం, 31 మార్చి 2014 జయ ఉగాది.
భాగవత తత్వం
ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది, గొప్పది, పోతన తెలుగు భాగవతం సర్వం నామరూపకాలాతీతుడైన భగవస్వరూపమే. కనుక, అభిమానించాల్సిందే, ఆరాధించాల్సిందే, గౌరవించాల్సిందే, పూజించాల్సిందే.