పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన వంశము

వెనుకటి పుట . . . ఓం శ్రీరామ . . . తరువాత పుట

పోతన - వంశము

మహాకవి, ప్రజాకవి, సహజకవి బమ్మెర పోతనామాత్యులవారి తల్లి “లక్కమాంబ”; తండ్రి “కేసయ”; అన్న “తిప్పన”; పుత్రుడు “మల్లయ”. వీరిది బమ్మెర వంశం; శైవ కుటుంబం; గురువు ఇవటూరి “సోమనాథుడు”. వీరు ఆరువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.
వీరి వంశవృక్షాలు (1) పోతన భాగవతము ప్రకారమూ, (2) పోతన వీరభద్ర విజయము ప్రకారమూ రెండు పటాలుగా తయారుచేసి తరువాతి పుటలలో పెట్టాను.
“దాక్షాయణీ పరిణయ” గ్రంథ కర్తలు ఆశ్వాసాంతమున చెప్పిన ప్రకారము*
ఆ మల్లయ కొడుకు “ప్రౌఢ సరస్వతి”,
ప్రౌఢ సరస్వతి పుత్రులు “కేసన” “మల్లనలు”.
కేసన ‘అప్పమ’ల కూతురు “ఎల్లమ”.
దాక్షాయణీ వివాహము గ్రంథ కృతి నాథుడు మల్లయసోమయాజి,
మల్లయ కుమారుడు లింగన్న,
లింగన్న కొడుకు యజ్ఞన్న,
యజ్ఞన్న పుత్రుడు పార్వతీశ్వరుడు.
పార్వతీశ్వరుని కుమారుడు పేరమంత్రి.


(*) -దాక్షాయణీ పరిణయం గ్రంథ ఆశ్వాసాంతము – “ఇది శ్రీమద్భవానీశంకరపర్వతాలగురు ప్రసాదాసాదితసారస్వత బమ్మెరకుల పవిత్ర కౌండిన్యసమునిగోత్ర పోతయామాత్యపుత్ర మల్లయామాత్యపుత్ర సంస్కృతాంధ్ర భాషాచమత్కారకవితాధురీణతాబుధవిధేయ ప్రౌఢ ,ర్సవంతికవినామధేయవరతనూభవ కేసనకవి మల్లనకవి ప్రణీతంబైన దాక్షయణీవివాహం బను మహీప్రబంధంబునందు. . . “