పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : ఫలశ్రుతుల సమాహారం

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


జాతీయ మహాకవి, సహజకవి, మన బమ్మెర పోతనామాత్యుల వారి తెలుగుసేత, శ్రీమత్ భాగవత పురాణం స్వయానా మహా మంత్రరాజం. గాయత్రిని అధికరించిన మహా మంత్రం. ఇహ పరాలు రెంటికి అనుసంధానించే కల్పవృక్షం. దీనిలోని ప్రతి ఘట్టం, శీర్షిక, పద్యం ప్రభావవంతమైన మంత్రాలే. వాటిలో బహుళ ప్రచారం కలిగి మిక్కిలి ప్రభావవంతమైన వాటి కొన్నిటి జాబితా ఇక్కడ ఉదహరిస్తాను. అందుకోండి. మీకు తెలిసినవి ఉంటే అందించండి, జత చేద్దాం.

అద్భుత ఫలాలను, ఇహపర శుభాలను అందించేది భాగవత పురాణం. మహామంత్ర రాజం.
ప్రతి ఘట్టం, ప్రతి పద్యం మహా ఫలప్రదాయి అయిన మహా మంత్రపూరితమే,
వీటిలో ఏర్చి కూర్చిన కొన్ని మంత్రపూరితాల జాబితా.


సం. | వృత్తాంతం | ఫలశ్రుతి
1 | భాగవతము | కల్ప వృక్షంలా, అమృతంలా, గాయత్రీ మంత్రంలా ఇహ పర సర్వ శ్రేయస్సులు అందిస్తుంది.
2 | అజామిళోపాఖ్యానం | ఏకాగ్రచిత్తంతో పారాయణ చేసినవారికి మోక్షం బహు సుగమమం అవుతుంది.
3 | కూర్మావతార కథ | కష్టాల కడలిలో మునిగిపోయే వారిని కూడా పైకెత్తి విజయాలను అందించే అమృత ప్రాయం. విశేషమైన సుఖసంతోషాలను కలుగజేస్తుంది
4 | క్షీరసాగరమథనం | కష్టసాధ్యమైన సకల కార్యాలను సుఖకరంగా, శుభకరంగా తీర్చే దివ్యాయుధం.
5 | గజేంద్ర మోక్షం | కీర్తి ప్రతిష్టలు పెరగటానికి; సంపదలు సకల భోగభాగ్యాలు కలగడానికి; పీడలు, సంకటాలు, ప్రాణభయంతో సహా సమస్త ఆపదలు తొలగడానికి తిరుగులేని మంత్ర రాజం.
6 | చిత్రకేతోపాఖ్యానం | భక్తితో చదివిన వారికి పాపాలు పటాపంచలౌతాయి; సమస్త వైభవాలు సమకూరతాయి; కోరిన కోరికలు నెరవేరతాయి; కుటుంబపరివార సమేతంగా అపారసౌఖ్యాలు అనుభవిస్తారు.
7 | దక్షాధ్వర ధ్వంసం | ఐశ్వర్యం, ఆయుస్సు, కీర్తి లభిస్తాయి; దురితములు, భవబందాలు తొలగుతాయి.
8 | ధ్రువ చరిత్ర | క్లేశ నాశనం, మంచి భక్తి, శీలం, తేజస్సు, మానసిక శక్తి, తత్వజ్ఞానం దొరుకుతాయి, వినిపించేవానికి దైవానుగ్రహం లభిస్తుంది.
9 | ప్రహ్లాద చరిత్ర | దివ్యమంగళ విగ్రహం కలవాడై నిత్య భయరహిత లోకాన్ని పొందుతాడు.
10 | నారాయణ కవచం | తిరుగులేని శత్రు నాశని, శత్రు భయ నివారిణి, సిద్ధ విజయ కారిణి
11 | పయోభక్షణవ్రతం | అద్భుతమైన సంతానం అనుగ్రహించే తిరుగులేని వ్రతం.
12 | మత్యావతారం కథ | మోక్షాన్నిసుగమం చేస్తుంది; కోరికలు సత్యంగా నెరవేరతాయి.
13 | రుక్మిణీ కల్యాణం | వివాహాది శుభకార్యాలు ఆలస్యం కాకుండా శీఘ్రమే జరిగేలా చూస్తుంది. కల్యాణ ప్రదాయిని.
14 | వామనావతారం | అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది; ఇంద్రభోగాలు ఇచ్చి, గొప్ప భాగ్యవంతుని చేస్తుంది; దివ్యసుఖాలను సమకూరుస్తుంది.
15 | విదుర-మైత్రేయ సంవాదం | విస్తృతమైన కీర్తులను సమకూరుస్తుంది.
16 | హాలాహలభక్షణ | సర్వ భయ హారిణి; విష, అగ్ని, భయ నివారిణి
17 | పృథుమహారాజు కథ | సర్వశ్రేయోదాయి, విష్ణుపద ప్రదాయని, పుణ్యచరిత్రను భక్తితో ముమ్మారు చదివితే దరిద్రుడు ధనవంతు డౌతాడు. అప్రసిద్ధుడు సుప్రసిద్ధు డవుతాడు. సంతానహీనుడు సంతానవంతు డౌతాడు. అజ్ఞాని విజ్ఞానవంతుడై విశేష ఖ్యాతిని ఆర్జిస్తాడు. (4-669,670)
18 | ప్రచేతసుల కథ | ఉత్తములైన ప్రచేతసులను ఏ మానవుడు నిత్యం నిద్రపోయే ముందు స్మరిస్తాడో… అతడు సోదర స్నేహాన్ని, భూతదయను, నిర్మల బుద్ధిని, సజ్జనుల ప్రేమను పొ౦ది సుఖిస్తాడు. అతని సమస్త పాపాలు నశిస్తాయి. (4-907,908)
19 | రుద్ర స్తవము | ప్రచేతసులకు ఉపదేశించిన రుద్రుస్తవం నిత్యం జపించేవారికి కోరిన వరాలను, శుభకరమైన ప్రజ్ఞను హరి ప్రసాదిస్తాడు. (4-909)
20 | గోపబాలురతో చల్ది గిడుచుట | అఘాసుర సంహారం - గోపబాలురతో చల్ది గుడుచుట - బ్రహ్మకు తన లీలలు చూపట మొదలుగా గల ఈ కధను ఎవరు చదివినా ఎవరు విన్నా వారు కోరిన కోరిక తీరుతుంది. (10.1-594-ఆ.)
21 | వృత్రాసుర వృత్తాంతము | ఎవరికయినా విశేషమయిన కష్టములు, బ్రహ్మహత్యాపాతకం వంటి కష్టములు వస్తే వృత్రాసుర వధలో వున్న పద్యములను, వచనములను కూర్చుని ఒక పుస్తకంలో వ్రాస్తే చాలు వాళ్ళ కష్టములు పోతాయి. చెపితే చాలు కష్టములు పోతాయి. ఎంతటి మహాపాపం తరుముకు వస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు ఆ పాపములన్నీ పోతాయి. (6-440-సీ.)
22 | కాళియమర్దన ఘట్టంలోని నాగసతుల ప్రార్థన | శ్రీకృష్ణ భగవానునకు చేసిన నాగసతుల ప్రార్థన స్వతసిద్ధంగా ధ్యాన, వేదసార సమృద్ధం; పురుషసూక్తంతో సమానంగా ఉన్నది.ఉపనిషత్ సార సమున్నతమైనది! వ్యథ కలిగినప్పుడు ఈ భాగాన్ని చదువుకుంటే ఎంతో చక్కటి ధీశక్తి, స్వాంతనలను రూఢిగా ఇస్తుంది! (10.1-673-వ. నుండి10.1-691-వ. వరకు)
23 | ఋషభుని వృత్తాంతము | ఎవరయితే ఋషభుని చరిత్రను మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన భక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తి పట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరి కృపవల్ల ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించుకుంటారు. నానావిధ పాపకారణమైన సంసార తాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనే అమృతస్నానం చేసి పునీతులౌతారు. పరమ పురుషార్థమైన మోక్షాన్ని సిద్ధింపజేసుకుంటారు.
24 | సింధుపతి విప్ర సంవాదము | ఈ భరతుని చరిత్రను ఎవరు చెప్పినా, ఎవరు విన్నా వారిని విష్ణువు రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధి, ధనధాన్య సమృద్ధి సిద్ధిస్తుంది. స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. (5.1-139-సీ. :: 5.1-180-చ.)
25 | శైవవైష్ణవ జ్వరాల వివాదం | ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్నీ, శివ జ్వరం శ్రీకృష్ణుని శరణుకోరిన విధానాన్ని మనస్సులో స్మరిస్తారో, అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగవు. (10.2-433-క.)
26 | బాణాసుర శివులపై కృష్ణవిజయం | బాణాసురుడు, పరమ శివుల మీద శ్రీకృష్ణుడు గెలిచిన ఈ విజయగాథను పఠించినవారికి ఎల్లప్పుడూ విజయాలు చేకూరుతాయి. ఇహ పర సౌఖ్యాలు శాశ్వతంగా లభిస్తాయి. (10.2-452-క.)
27 | నృగోపాఖ్యానము | నృగోపాఖ్యానము కథను చదివినవారికీ, విన్నవారికీ, సర్వపాపాలు తొలగిపోతాయి. ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది. పరలోకంలో మోక్షం సులభంగా లభిస్తుంది. (10.2-482-క.)
28 | కృత్య వృత్తాంతం | కాశీరాజు, కృత్యలపై శ్రీకృష్ణుని విజయ కథను భక్తితో చదివినా వినినా జనులు పాపరహితులై ఆ దేవుని దయచేత ఇహపరసౌఖ్యాలను పొందుతారు. (10.2-536.క.)
29 | పదహారువేల మంది స్త్రీలతో విహారం | శ్రీకృష్ణుడు పదహారువేల మంది స్త్రీలను ఆదరించిన మానవాతీత లీలలను వినినా, చదివినా విష్ణుదేవుడి పాదాలపై భక్తి ప్రాప్తించటమే కాకుండా ధన, పశు, పుత్ర, మిత్ర, కళత్రాది సౌఖ్యాలు సైతం లభిస్తాయి. (10.2-635-చ.)
30 | రాజబంధమోచనం | రాజులను బంధవిముక్తులను చేయడం శిశుపాలుడిని వధించటం ధర్మజ్ఞుని యజ్ఞాన్నిరక్షించడం మొదలైన శ్రీకృష్ణుని విజయ గాధలను చదివినవారు కోరిన సౌభాగ్యాలనూ, కీర్తిని, దివ్యమైన జ్ఞానాన్ని వైకుంఠ వాసాన్ని పొందుతారు. (10.2-829-చ.)
31 | కుచేలోపాఖ్యానం | శ్రీకృష్ణులవారు కుచేలుడిని చరితార్ధునిగా చేసిన ఈ వృత్తాంతం విన్న వారికి ఇహపర సుఖాలూ, హరిభక్తి, యశస్సూ కలుగుతాయి. (10.2-1033.)
32 | శృతిగీతలు | శృతిగీతములు అని ప్రసిద్ధము అయిన నారాయణోపాఖ్యానం సకల వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాల సారం. ఉపనిషత్తులకు సమానం. దీనిని పఠించినా విన్నా పాపాలు నశించిపోతాయి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. (10.2-1230-వ.)
33 | వృకాసుర వృత్తాంతం | వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు. (10.2-1264-క.)
34 | శ్రీకృష్ణకథారసం | శ్రీకృష్ణకథారసం ముల్లోకాలకూ శుభదాయక మైనది. భక్తితో ఆస్వాదించే పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి పాపాలు సమస్తము తొలగిపోతాయి. తుదకు శాశ్వతమైన కైవల్యాన్ని అందుకుంటారు. (10.2-1237-మ.)
34. |వృత్రాసుర సంహారం. |వృత్రాసుర సంహారమనే ఈ ఇతిహాసం సమస్త దుఃఖాలను శమింప జేస్తుంది. భక్తి పూర్వకంగా ప్రతిదినమూ పఠించినా, విన్నా, వ్రాసినా ఆయురారోగ్యాలు లభిస్తాయి. భోగ భాగ్యాలు ప్రాప్తిస్తాయి. విజయశ్రీ వరిస్తుంది. కర్మక్షయమై మోక్షాన్ని చేకూరుతుంది. (6-440-సీ.)
35. |విదేహ ఋషభ సంవాదం|ఈ విదేహ ఋషభ సంవాదం ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువుఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.( 11-79-వ.)
36. |చిత్రకేతూపాఖ్యానం|వృత్రాసురునికి రాక్షసాకారం కలిగిన పూర్వజన్మ వృత్తాంతాన్ని, చిత్రకేతుని పవిత్ర చరిత్రను భక్తితో విన్నవారికి, చదివిన వారికి పాపాలన్నీ నాశనమై చెదరిపోతాయి. సమస్త వైభవాలు సమకూరుతాయి. కోరిన కోరికలు తమంత తామే తీరుతాయి.వారు నిర్మల హృదయులై, నిత్య సత్య వ్రతులై, తొలగిన పాపాలు కలవారై బంధువులతోనూ మిత్రులతోనూ పుత్రులతోనూ, పౌత్రులతోనూ కూడి ఉండి అధిక సుఖాలను అనుభవిస్తారు.(9-505-సీ.)
37. |శమంతకమణి కథ|శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి, ఇచ్చిన కథను విన్నా, పఠించినా, తలచినా జనుల పాపాలు పటాపంచలవుతాయి; అపకీర్తి తొలగిపోతుంది.(10.2-102-సీ.)
. . *** . .