పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : భాగవతం - నారద బోధ

ధర్మశాస్త్రం; వేదాంతం; నీతిశాస్త్రం; మహాకావ్యం; సర్వలక్షణ సంగ్రహం;
యితిహాసం; పురాణసముచ్ఛయం – భాగవతము

సౌజన్యం:-రూపనగుడి సుగుణ 2016-10-29 ముఖపుస్తకం •

భాగవతం - వ్యాసుడికి నారదుని ఉద్బోధ.
"ధాతవు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి
జ్ఞాతవు, కామముఖ్యరిపుషట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని
ర్ణేతవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!
కాతరుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!"
టీకా:
ధాతవు = బ్రహ్మ దేవుడివి; భారత = భారతమనే; శ్రుతి = వేదము; విధాతవు = సృష్టించిన వాడివి; వేద = వేదము లందలి; పదార్థ = విషయముల నుండి; జాత = పుట్టిన; విజ్ఞాతవు = విజ్ఞానము కలవాడివి; కామ = కామము {అరిషడ్వర్గములు - 1కామము 2క్రోధము 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు; ముఖ్య = మొదలగు; రిపు = శత్రు; షట్క = షట్కమును (6); విజేతవు = జయించినవాడివి; బ్రహ్మ = బ్రహ్మజ్ఞానము యొక్క; తత్త్వ = స్వభావమును; నిర్ణేతవు = నిర్ణయించిన వాడవు; యోగి = యోగులలో; నేతవు = నాయకుడవు; వినీతుఁడవు = జితేంద్రియుడవు; ఈవు = నీవు; చలించి = చలించి పోయి; చెల్లరే = తగునా; కాతరు = దీనుని; కైవడిన్ = వలె; వగవన్ = దుఃఖ పడుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; పరాశరాత్మజా = వ్యాసా {పరాశరాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}.
భావము:
“పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయింనిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి,వేదాలని నాలుగుగా విభజించి వ్రాసినవాడివి. యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?”
హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుఁగొందుఁ శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీ
కరమై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.
నీవు శ్రీహరిని స్తుతిస్తూ కావ్యాలను వ్రాస్తే మానససరోవరం విహరించే బంగారు హంసల మాదిరి ప్రకాశిస్తాయి. శ్రీహరినామ స్తుతి చేయని కావ్యాలు ఎంత విచిత్ర ఆర్థాలున్నదైనా శ్రీకరమై వుండదు. అందుకని శ్రీహరి చరిత్రము భాగవతమును రచియింపుమని నారదుడు వ్యాసుడికి బోధించాడు.
1.ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని
2.ఆత్మతత్వవిదులు వేదాంతమనియు
3.నీతి విచక్షుణుల్ నీతిశాస్త్రంబని
4.కవిఋషభులు మహాకావ్యమనియు
5.లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహంబనియు
6.ఐతిహాసికులు యితిహాసమనియు
7.పరమ పౌరాణికులు పురాణసముచ్ఛయమనియు
8.మహి కొనియాడుచు వివిధ వేదతత్వమని
విధి వేదవ్యాసుడాది ముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భాగవతంబు
నారద ఆగనమనంబు