పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : ఉటంకింపులు - మౌక్తికమాల

ఉటంకింపులు - మౌక్తికమాల

సౌజన్యము:- భాగవత జయంతిక - ఆర్కైవ్.ఆర్గ్ (archive.com)

1) నిత్య నత్కీర్తి పోతనామాత్యసుకవి

(పుత్తేటి రామభద్రకవి - సకలకథాసార సంగ్రహము)

2) శ్రీ భాగవతసుధాసేవాభిరతుని బ
మ్మెర పోతరాజు వర్ణనము చేసి

(కావూరి యెల్లన - బ్రహ్మాండ పురాణము)

3) ఆంధ్ర సద్భాగవత కర్త నభినుతించి

(అయ్యలరాజు రామభద్రుడు - రామాభ్యుదయము)

4) ధీనిధి బమ్మెర పోతనార్యు

(తెనాలి రామభద్రకవి - ఇందుమతీ పరిణయము)

5) సహజపాండిత్యుని సంస్మరించి

(కాకునూరి అప్పకవి- అప్పకవీయము)

6) వచనసంగతుల నేర్పడ విలాసము గుల్కు
పోతనామాత్యు విఖ్యాతి నుడివి

(కొచ్చెర్లకోట రామకవి - ప్రభులింగలీల)

7) బమ్మెరపోతన కవీంద్రశేఖరున్

(పెనుమళ్ళ సోమకవి - సీమంతినీ పరిణయము)

8) మిక్కిలి భక్తితోడ ప్రణమిల్లెద భాగవత ప్రబంధకున్

(కాళ్ళకూరి లక్ష్మీపతి - భద్రాకల్యాణము)

9) పూని కొలిచెద బమ్మెర పోతవిభుని

(గరికపాటి తమ్మయ - సిరియాళు చరిత్ర)

10) రసికు బమ్మెర పోతరాజు వర్ణించి

(టేకుమళ్ళ రంగశాయి- ద్విపద భాగవతము)

11) అనఘమతిన్ బోతరాజు నభినుతి సేతున్

(నాగలింగకవి- పట్టాభిరామవిలాసము)

12) భూరి సత్కళా ద్విజరాజుఁ బోతరాజు

(కోడూరి వేంకటాచలపతి - శివరహస్య ఖండము)

13) పోతన కవీంద్ర! రససుధాపూర్ణచంద్ర!

(కల్లూరి వేంకటనారాయంరావు - అశోకచరిత్రము)

14) “పోతన్న తెలుగుల పుణ్యపేటి”
“ఆతడె తోడు గల్గినను నచ్చములౌ కలకండ యచ్చులన్
బోతలు పోయకుండుదుమె పోతనగారి విధాన-”

(విశ్వనాథ సత్యనారాయణ - రామాయణ కల్పవృక్షము)

15) పోతనవంటి సత్కవులు పుట్టరు; పుట్టిన నట్టిరీతిగా
వ్రాతలు వ్రాయు వారరిది; భాగవతంబది ముద్దులొల్కు-

(శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి - శ్రీ కృష్ణ భాగవతము)

16) భాగవతంబు నా బాలశిక్ష

(గుఱ్ఱం జాషువా - ఖండకావ్యము)