పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతనకు సమర్పించిన ఉత్పల మాలిక

పోతనకు సమర్పించిన ఉత్పల మాలిక
శతావధాని, సుకవి, శ్రీ మద్దూరి రామమూర్తి గారు

1) శ్రీరమై, సుధీజన వశీకరమై, శ్రితలోక నిత్య ర
2) క్షారమై, శ్రుతిస్వర లయాంచిత పూజిత వాగ్విశేష ర
3) మ్యారమై ,సతీపతి రమాపతి వాక్పతి భోగభాగ్య భ
4) వ్యారమై, విరాజిత విహార విలాస సుశస్త్ర హస్త భూ
5) పారమై, వణిగ్వర సమార్జిత మౌక్తిక విద్రుమాది ర
6) త్నారమై, రమేశ పదజాద్భుత దాన విశేషలబ్ధ కీ
7) ర్త్యారమై, సుగంధ భరితాద్భుత పుష్పిత దివ్య భవ్య ప
8) ద్మారమై, నిరంతర మహామృడ పాద సమర్చనాత్త భ
9) క్త్యారమై, కృతీందు వదనార్థ రసాన్విత వాగ్విలాస కా
10) వ్యారమై, నిరంతర సహాయక దాన విధాన లబ్ధ ధ
11) ర్మారమై, సుధర్మ సమమైతత శత్రుసమూహ భేక ద
12) ర్వీరమై, గుణాన్విత వివేక విశుద్ధ మహానుభూతి దూ
13) రీకృత దుష్టయై, నృపవరేణ్య విరాజితయై వెలుంగు నీ
14) కాతి ముఖ్యపట్టణముగావిలసిల్లెడు నోరుగంటిలో
15) లోసఖుండునౌ శశి విలోకన చంద్రిక లెల్లగూడి తా
16) మేములై మహోజ్జ్వలత పృథ్విని భక్తి ఫలించు రీతిగా
17) నేశిలాపురిన్ బుధ కవీంద్ర హృదబ్జము లుల్లసిల్లగా
18) నాము పుష్పవృష్టి నభినందనముల్ వెదజల్లుచుండ తా
19) నేళ నుండెనో జగదధీశ్వర పుత్రుడు సృష్టిజేసె న
20) స్తోరసప్రవాహ పరిశోభిత మూర్తిని పోతనాహ్వయున్
21) శోము బాపు సూత్రమును జూపగ భాగవతమ్ము వ్రాయ వా
22) ణ్యాకృతితో జనించె రవియైకవితల్లజులెల్ల మెచ్చగా
23) మనీయ ఘంటమున కంతటి శక్తి లభింప హేతువే
24) మో!లకండ శర్కరయొ? పొల్పగు నిక్షురసమ్మొ? పాలతో
25) పాము పట్టి తేనియ ద్రమ్మున ఘంటము ముంచితో భళీ!
26) యామనీయ కావ్యమహహా!జగదేక యశమ్మునందె. ని
27) క్ష్వాకుకులప్రదీపుడగు స్వామి పదాబ్జము నెమ్మనంబునన్
28) ప్రాట భక్తిగొల్చి రఘురామున కంకితమిచ్చి వేడ్క వి
29) ద్యామలాక్షి దివ్య కరుణాబ్జ మరందము నాను తేటియై
30) లోకులు మెచ్చగా పదములున్వచనంబులు పల్కులందు మా
31) రాకుగ విచ్చురీతి కవిరాజు రచించె మనోజ్ఞ కావ్యమున్
32) రణిన్ దిగంతముల హృద్యత భాగవతమ్ము మించి వా
33) ణీర వల్లకీ కృతుల నిత్యము వర్ధిలుగాత! భవ్య శౌ
34) ర్యార ధర్మరక్షిత విరాజిత రాజస లోకపాలనా
35) లోన మించుగాత! సురలోక సుఖప్రద ప్రాగ్జనుః కృతా
36) శోసమూల నాశిని సుశోభిత వర్ణిని పద్మనేత్రయున్
37) నాముఖుల్ మునీశ్వరులు జ్ఞానుల దీవనలంది సర్వమున్
38) శ్రీర శోభలంది విలసిల్లుత! జ్ఞాన సరస్వతీ కృపా
39) శీరముల్ మనోజ్ఞమయ జీవికలై కృతి నోముగాత! య
40) స్తోతమః ప్రభావమును సోకగ నీక వెలుంగు నింపుచున్
41) నామనీయమౌ కృతి జమ్ము మనమ్మున నిల్చురీతి ర
42) త్నార గర్భజాత వనితామణి శ్రీరమ మందహాసియై
43) చేకొని సాకుగాత! ఘన శీతల శైల కుమారిసర్వ లో
44) కైజనిత్రి శాంకరి దృగంచల వర్షిత చంద్రచంద్రికా
45) స్తోకృపాంబురాశి పరితోషిత జేయుత కావ్యరాజమున్
46) నాకుమనంబు పొంగ వదమ్మున మంగళ భావ వీచికల్
47) తేకువ మీర కన్పడగ తృప్తిగ ధీవరులెల్ల మెచ్చగా
48) నీకృతి యామనిన్ పికము హేలగ మోద మొసంగునట్లు, శో
49) భారమౌచు చిల్క తన ల్కుల సందడి నింపినట్టు లిం
50) పౌమనీయ నృత్య గరిమ్మున కేకి నటించినట్లు, సొం
51) పైలహంస కుల్కులు సమంచిత భావము నింపునట్లుగా
52) స్వీకృత కౌముదీ రుచుల ప్రీతిగ మెచ్చిన జక్కవాంగనల్
53) చీటిలోన వెన్నెలను చిత్రముగా గమనించినట్లు, దో
54) షారు డబ్ధి ఘోషలకు సంతసమంది వెలుంగునట్లు, లో
55) కైయశమ్మునంది కలకాలము మంజుల నవ్యభావ సం
56) ఖ్యామనీయ రూపమయ కాంతుల నింపి రసజ్ఞులైన యీ
57) లోకుల గుండెలోతుల విలోకన చేయును గాత మంచు నే
58) తేకువమీర గూర్చితిని దీప్తిగ పోతనపైన మాలికన్
59) స్వీకృత హృద్య పద్య పరిబృంహిత మద్దురి రామమూర్తి ప్ర
60) జ్ఞావి కృష్టి వర్ణితము జ్ఞాన నిధానము సర్వ దేవతా
61) నీము తారకా సహిత నిత్యచరుల్ రవి చంద్రు లబ్ధులున్
62) ప్రాట పంచ భూతములు వ్య కవిత్వ మహత్వ సిద్ధు లెం
63) దారహించు నంతవడి ప్పక భాగవతమ్ము వెల్గుతన్.