పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : కరుణశ్రీ వారి మహాకవి పోతన

కరుణశ్రీ వారి మహాకవి పోతన

1
ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో
ద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్య మధ్య ఆ
ట్లద్దక వట్టి గంటమున ట్టిటు గీచిన తాటియాకులో
ద్దెములందు ఈ మధురభావము లెచ్చటనుండి వచ్చురా?

2
గంమొ చేతిలోది ములుఱ్ఱయొ? నిల్కడ యింటిలోననో
పంపొలానొ? చేయునది ద్యమొ సేద్యమొ? మంచమందు గూ
ర్చింటివొ మంచెయందొ? కవివో గడిదేరిన కర్షకుండవో? 
రెంటికి చాలియుంటివి సరే హలమా కలమా ప్రియంబగున్?

3
కాలు గాచిపోయినవిగా యరచేతులు! వ్రాత గంటపున్
రాయిడి చేతనా? మొరటునాగలిమేడి ధరించి సేద్యమున్
జేయుట చేతనా? కవికృషీవల! నీ వ్యవసాయదీక్ష కా
హా ని యంతలేసి కనులార్పక చూచిరిలే దివౌకసుల్.

4
మెత్తని చేయి నీది; సుతిమెత్తని చిత్తమువాడ వంచు నీ
పొత్తమె సాక్ష్యమిచ్చు; పొలమున్ హలమున్ గొని దున్నుచో నెటుల్
గిత్తల ముల్లుగోల నదలించితివో; వరిచేలపైన ను
వ్వెత్తుగ వ్రాలుచో పరిగపిట్టల నెట్టుల తోలినాడవో! 

5
మ్ముము తల్లి నాదు వచమ్ము; ధనమ్మునకై బజారులో
మ్మనుజేశ్వరాధముల మ్మను ని”న్నని బుజ్జగించి నీ
గుమ్మములోన నేడ్చు పలుకుంజెలి కాటుకకంటి వేడి బా
ష్పమ్ములు చేతితో తుడిచివైచెడి భాగ్యము నీకె యబ్బెరా!!

6
గంలు కట్టుకొంటివటగావిటగాండ్రను బోలునట్టి యీ
కుంటి కురూపి భూపతులకుం గవితాసుత నీయ నంచు; ఆ
పంవలంతి యల్లునకె భాగవతమ్మును ధారవోసి ని
ష్కంక వృత్తికై నడుముట్టితి వెంతటి పుణ్యమూర్తివో!

7
చ్చపు జుంటితేనియల, నైందవబింబలుధారసాల, గో
ర్వెచ్చని పాలమీగడల, విచ్చెడి కన్నెగులాబి మొగ్గలన్
చ్చరికించు ఈ మధురమంజుల మోహనముగ్ధశైలి నీ
వెచ్చట నేర్చినావు? సుకవీసుకుమార కళాకళానిధీ!

8
మ్మని తేటతెల్గు నుడికారము లేరిచి కూర్చి చాకచ
క్యమ్ముగ కైతలల్లు మొనగాండ్రు కవీశ్వరు లెంతమంది లో
మ్మున లేరు -నీ వలె నొకండును భక్తిరసామృతప్రవా
మ్ముల కేతమెత్తిన మహాకవి యేడి తెలుంగు గడ్డపై?

9
ఎండిన మ్రోడులే కిసలయించెనొ! యేకశిలాపురమ్ములో
బంలు పుల్కరించెనొ! అపారముదమ్మున తెల్గుతల్లికిన్
గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనొ! పచ్చిపైరులే
పండెనొ! జాలువాఱిన భత్కవితామృత భక్తిధారలన్.

10>br> భీష్ముని పైకి కుప్పించి లంఘించు గో
పాలకృష్ణుని కుండలాల కాంతి;
రిరాజు మొఱవెట్ట ఱువెత్తు కఱివేల్పు
ముడివీడి మూపుపై బడినజుట్టు;
మరమ్ముగావించు త్య కన్నుల నుండి
వెడలు ప్రేమక్రోధవీక్షణములు;
కొసరి చల్దులు మెక్కు గొల్లపిల్లల వ్రేళ్ళ
సందు మాగాయ పచ్చడి పసందు; 
టుల కనుగొంటివయ్య! నీ కెవరు చెప్పి
య్య! ఏ రాత్రి కలగంటియ్య! రంగు
కుంచెతో దిద్ది తీర్చి చిత్రించినావు! 
హజపాండితి కిది నిదర్శన మటయ్య!

11
భావతమ్ము భాగ్యపరిపాకమ ఆంధ్రులకెల్ల దాని ముం
దాగజాల వేకవిత లంచు నభంబున దేవదుందుభుల్
మ్రోగినవేమొ! నీవు కలముం గొని కావ్యము వ్రాయ చిందిపో
సాగినవేమొ! తీయని రసాలరసాలు త్వదీయలేఖినిన్!

12
వేము మార్చి యిన్ని దిగవేసి “యభా” సొనరింపకుండ శ్రీ
వ్యాసుని గ్రంథ మాంధ్రమున వ్రాసితి వందము చింద; నీద అ
గ్రానమయ్య; ఆంధ్రకవులందు; వరాలకు నెత్తు కెత్తుగా
 సొగసైన పద్దము లయారె! తయారగు నీ కలాననే! !

13
ఖ్యాతి గడించుకొన్న కవులందరు లేరె! అదేమి చిత్రమో
పోన యన్నచో కరిగిపోవు నెడంద, జొహారు సేతకై
చేతులు లేచు; ఈ జనవశీకరణాద్భుతశక్తి చూడగా
నాని పేరులో గలదొ! యన గంటములోన నున్నదో!

- ( కరుణశ్రీ - ఉదయశ్రీ)