పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : 8-97-వ లో ప్రక్షిప్తమా.


గజేంద్ర మోక్షణము - విష్ణువు ఆగనము ఘట్టము
వచనము "ఇట్లు భక్తజనపాలన పరాయణుండును,.." నందు
నిజపరికరమలను అవధరించి ప్రక్షిప్తము గానోపును

 పోతనామాత్య విరచిత తెలుగు భాగవతమునందలి అష్టమ స్కంధములో, విష్ణువు ఆగమనములో, 8-97-వ. పాఠ్యము నందు. చివరి భాగములో “గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి, [నిజపరికరంబుల నవధరించి] గగనంబున కుద్గమించి వేంచేయు నప్పుడు." అని ఉన్నది. అయితే కుండలీకరణములో పెట్టిన [నిజపరికరంబుల నవధరించి] పొసగని ప్రక్షిప్తము కానోపును. ఏలనన,
 (1)ముందు పద్యం 8-86-మ. "సిరికిం జెప్పడు.." నందు శంఖచక్రాదులను గ్రహించక, లక్ష్మీదేవి కొంగును విడువక త్వరతో బయలుదేరెను అని చెప్పబడింది.
 (2) తరువాత, 8-98-మ. "తనవెంటన్ సిరి..." పద్యంలో పరికరములన్నీ వెనుక వస్తున్నట్లు చెప్పబడింది.
 (3) అటుపిమ్మట 8-107-మ, "చనుదెంచెన్ ఘను డల్లవాడె.." పద్యంలో నింగిన నేగుతున్న హరి వెనుక లక్ష్మీదేవి , శంఖము, చక్రము.. వెళ్తుచున్న వని వీక్షిస్తున్న దేవతానికరములు అనుకొనుచున్నట్లు చెప్పబడింది.
 ఈ మధ్యలోని 8-97-వ. "ఇట్లు భక్తజనపాలన పరాయణుండును,..." నందలి [నిజపరికరంబుల నవధరించి] పొసగుటలేదు. పోతనామాత్యులవారు చేసినది స్వతంత్ర ఆంధ్రీకరించుట తప్ప యథాతథ అనువదించుట కాదు. వారు ఈ ఘట్టంలో తన స్వతంత్రను ప్రదర్శిస్తూ విస్తరించిరి అనిన విషయము లోకవిదితము. ముందు కాలంలో ఎప్పుడో వ్యాసమూలముతో అనుసంధించుకుంటూ, ఈ "[నిజపరికరంబుల నవధరించి]" ప్రక్షిప్తము చేయడము జరిగి ఉండనోపు అని గ్రహించడమైనది. అందుచేత, దీనిని తెలుగుభాగవతం.ఆర్గ్ నందు [కుండలీకరణంము] చేయుడమైనది.

- భాగవత గణనాధ్యాయి, 2020-03-10.