పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : చంద్రవంశం - పురూరవుడు

1వ తరం. చంద్రుడు, బృహస్పతి భార్య తార- పుత్రుడు

(9-379-వ.) 2వ తరం. బుధుడు, శ్రాద్ధదేవుడు / వైవస్వతమనువు శ్రద్ధల కుమార్తైన ఇళాకన్యకగా- పుత్రుడు

(9-387-వ.) 3వ తరం. పురూరవుడు, అప్సరస ఊర్వశి- పుత్రులు

(9-422-వ.) 4వ తరం. 1. ఆయువు, 2. శ్రుతాయువు, 3. సత్యాయువు, 4. రయుడు, 5. జయుడు, 6. విజయుడు.

4వ తరం.1. ఆయువు- పుత్రులు

(9-497-వ.) 5వ తరం 1 నహుషుడు, 2 క్షత్రవృద్ధుడు, 3 రజి, 4 రంభుడు, 5 అనేనసుడు.

9(-506-వ.) 5వ తరం 1 నహుషుడు- పుత్రులు 6వ తరం. 1) యతి, 2) యయాతి, 3) సంయాతి, 4) నాయాతి, 5) వియతి, 6) కృతి.

6 తరం 1) యతి- విరాగి.

(9-510-ఉ.) 6వ తరం 2) యయాతి 1వ భార్య శుక్రుని కూతురు దేవయాని- పుత్రులు 7వ తరం 1.యదువు, 2 తుర్వసుడు. 3 త్రుహ్యుడు

7వ తరం 1. యదువు (వీరి వంశం వారు యాదవులు)- పుత్రులు 8వ తరం 1) సహస్రజిత్తు, 2) క్రోష్ణువు, 3) నలుడు, 4) రిపుడు.

8వ తరం 1) సహస్రజిత్తు- 9వ తరం శతజిత్తు, 10వ తరం 1 మహాహయుడు, 2 వేణుహయుడు, 3 హైహయుడు- పుత్రుడు

11వ తరం ధర్ముడు, 12వ తరం నేత్రుడు, 13వ తరం కుంతి, 14వ తరం మహిష్మంతుడు, 15వ తరం భద్రసేనుడు. 16వ తరం దుర్మదుడు, 17వ తరం ధనికుడు, 18వ తరం 1. కృతవీర్యుడు, 2. కృతాగ్ని, 3. కృతవర్మ, 4. కృతౌజుడు.

(9-431-సీ.) 18వ తరం 1. కృతవీర్యుడు- 19వ తరం కార్తవీర్యార్జునుడు- పుత్రసహస్రం వీరిలో పరశురాముని నుండి తప్పించుకుని బ్రతికిన వారు ఐదుగురు వారు

20వ తరం 1) జయధ్వజుడు, 2) శూరసేనుడు, 3) వృషణుడు, 4) మధువు, 5) ఊర్జితుడు.

20వ తరం 1) జయధ్వజుడు- 21వ తరం తాళజంఘుడు- ఔర్వ ముని వలన 100 మంది అందు ప్రథముడు వీతిహోత్రుడు.

20వ తరం 2) శూరసేనుడు/-

20వ తరం 3) వృషణుడు-

20వ తరం 4) మధువు- వీరి వంశం వారు మాధవులు- 21వ తరం వృక్ణుడు- పుత్రులు 22వ తరం 100 మంది వారిలో వృష్ణి- వీరి వంశం వారు వృష్ణులు-

8వ తరం 2) క్రోష్ణువు- 9వ తరం వృజినవంతుడు, 10వ తరం శ్వాహితుడు, 11వ తరం భేరుశేకుడు- 12వ తరం చిత్రరథుడు, 13వ తరం శశిబిందుడు- పుత్రులు పదివేలమంది వారిలో ముఖ్యుడు పృథుశ్రవుడు- 14వ తరం ధర్మజుడు, 15వ తరం ఉశనుడు, 16వ తరం రుచికుడు- పుత్రులు 17వ తరం 1. పురుజిత్తు, 2. రుక్ముడు, 3. రుక్మేషువు, 4. పృథువు, 5. జ్యాముఖుడు, భార్య శైబ్య- పుత్రుడు

17వ5. జ్యాముఖుడు, భార్య శైబ్య- పుత్రుడు 18వ తరం విదర్భుడు- పుత్రులు 19వ తరం 1 కుశుడు, 2 కృథుడు, 3. రోమపాదుడు

19వ తరం 1 కుశుడు- x x x

19వ తరం 2 కృథుడు- 20వ తరం కుంతి, 21వ తరం దృష్టి, 22వ తరం నిర్వృతి, 23 దశార్హుడు, 24 వ్యోముడు, 25వ తరం జీమూతుడు, 26వ తరం వికృతి, 27వ తరం భీమరథుడు, 28వ తరం నవరథుడు, 29వ తరం దశరథుడు, 30వ తరం శకుని, 31వ తరం కుంతి, 32వ తరం దేవరాతుడు, 33వ తరం దేవక్షత్రుడు, 34వ మధువు, 35వ తరం కురువశుడు, 36వ తరం అనువు 37వ తరం పురుహోత్రుడు, 38వ తరం అంశువు, 39వ తరం సాత్వతుడు- వీరి వంశస్థులు సాత్వతులు., పుత్రులు- 40 తరం 1, భజమానుడు, 2, భుజి, 3, దివ్యుడు, 4, వృష్ణుడు, 5, దేవాపృథుడు, 6, అంధకుడు, 7, మహాభోజుడు

40వ తరం 6, అంధకుడు,- పుత్రులు41వ తరం 1. భజమానుడు, 2. కుకురుడు, 3. శుచి, 4. కంబళబర్హిషుడు.

41 వ తరం 1. భజమానుడు, పుత్రుడు 42వ తరం విడూరథుడు, 43వ తరం శిని, 44వ తరం బోజుడు, 45వ తరం హృదికుడు,- పుత్రులు 46వ తరం (1) దేవమీఢుడు / శూరుడు, భార్య మారిష, (2) శతధనువు, (3) కృతవర్మ.

46వ తరం (1) దేవమీఢుడు / శూరుడు, భార్య మారిష--- పుత్రులు 47వ తరం 1. వసుదేవుడు / నానకదుందుభి, 2. దేవభాగుడు, 3. దేవశ్రవుడు, 4. ఆనకుడు, 5. సృంజయుడు, 6. శ్యామకుడు, 7. కంకుడు, 8. ఆనీకుడు, 9. వత్సకుడు, 10. వృకుడు; పుత్రికలు 47వ తరం 1. పృథ / కుంతి (పెంపుడు కూతురు), 2. శ్రుతదేవ, 3. శ్రుతకీర్తి, 4. శ్రుతశ్రవస, 5. రాజాధిదేవి.

47వ తరం 1. వసుదేవుడు / నానకదుందుభి, భార్యలు (1) రోహిణి, (2) పౌరవి, (3) మదిర, (4) కౌసల్య, (5) రోచన, (7) ఇళ, మఱియు దేవకుని పుత్రికలు ఐన (8) ధృతదేవ, (9) శాంతిదేవ, (10) ఉపదేవ, (11) శ్రీదేవ, (12) దేవరక్షిత, (13) సహదేవ, (14) దేవకి.

47వ తరం 1. వసుదేవుడు / నానకదుందుభి, భార్య (1) రోహిణి, పుత్రులు 48వ తరం 1 బలరాముడు, 2 గదుడు, 3 సారణుడు, 4 దుర్మదుడు, 5 విపులుడు, 6 ధ్రువుడు, 7 కృతుడు మున్నగువారు.

47వ తరం 1. వసుదేవుడు, భార్య(2) పౌరవి, పుత్రులు 48వ తరం 1 సుభద్రుడు, 2 భద్రవాహుడు, 3 దుర్మదుడు, 4 భద్రుడు, 5 భూతుడు మున్నగు మన్నెడుమంది (12)

47వ తరం 1. వసుదేవుడు, భార్య (3) మదిర, పుత్రులు 48వ తరం (1) నందుడు, (2) ఉపనందుడు, (3) కృతకుడు, (4) శ్రుతుడు, (5) శూరుడు మున్నగువారు

47వ తరం 1. వసుదేవుడు, భార్య (4) కౌసల్య, పుత్రుడు 48వ తరం కేశి

47వ తరం 1. వసుదేవుడు, భార్య (5) రోచన, పుత్రులు 48వ తరం (1) హస్త, (2) హేమాంగుడు మున్నగువారు.

47వ తరం 1. వసుదేవుడు, భార్య (7) ఇళ, పుత్రులు 48వ తరం (1) యదువు, (2) ఉరువల్కలుడు మున్నగువారు.

47వ తరం 1. వసుదేవుడు, భార్య దేవకుని పుత్రిక ఐన (8) ధృతదేవ, పుత్రుడు 48వ తరం త్రిపృష్టుడు.

47వ తరం 1. వసుదేవుడు, భార్య దేవకుని పుత్రిక ఐన (9) శాంతిదేవ, పుత్రులు 48వ తరం (1) ప్రశ్రముడు, (2) ప్రశ్రితుడు మున్నగువారు.

47వ తరం 1. వసుదేవుడు, భార్య దేవకుని పుత్రిక ఐన (10) ఉపదేవ, పుత్రులు 48వ తరం వృష్ణుడు మున్నగువారు పదిమంది (10).

47వ తరం 1. వసుదేవుడు, భార్య దేవకుని పుత్రిక ఐన (11) శ్రీదేవ, పుత్రులు 48వ తరం (1) వసుహంస, (2) సుధ్వానుడు మున్నగువారు ఆరుగురు (6).

47వ తరం 1. వసుదేవుడు, భార్య దేవకుని పుత్రిక ఐన (12) దేవరక్షిత, పుత్రులు 48వ తరం గదుడు మున్నగువారు పదిమంది (10).

47వ తరం 1. వసుదేవుడు, భార్య దేవకుని పుత్రిక ఐన (13) సహదేవ, పుత్రులు 48వ తరం (1 పురూఢుడు, (2) శ్రుతుడు మున్నగు ఎనిమిది మంది (8).

47వ తరం 1. వసుదేవుడు, భార్య దేవకుని పుత్రిక ఐన (14) దేవకి, పుత్రులు 48వ తరం (1) కీర్తిమంతుడు, (2) సుషేణుడు, (3) భద్రసేనుడు, (4) ఋజువు, (5) సమదనుడు, (6) భద్రుడు, (7) సంకర్షణుడు, (8) కృష్ణుడు (యశోదానందుల వద్ద పెరిగాడు); పుత్రిక సుభద్ర భర్త అర్జునుడు / పాండవ మధ్యముడు.

47వ తరం 2. దేవభాగుడు, భార్య ఉగ్రసేనుని పుత్రికైన కంస- పుత్రులు 48వ తరం 1 చిత్రకేతుడు, 2 బృహద్బలుడు.

47వ తరం 3. దేవశ్రవుడు, భార్య ఉగ్రసేనుని పుత్రికైన కంసవతి- పుత్రులు 48వ తరం 1 వీరుడు, 2 నిషుమంతుడు

47వ తరం 4. ఆనకుడు, భార్య కర్ణిక- పుత్రులు 48వ తరం 1 ఋతుధామ, 2 జయుడు.

47వ తరం 5. సృంజయుడు, భార్య ఉగ్రసేనుని పుత్రికైన రాష్ట్రపాలి- పుత్రులు 48వ తరం వృష, దుర్మర్షణ మున్నగువారు.

47వ తరం 6. శ్యామకుడు, భార్య సురభూమి- పుత్రులు 48వ తరం 1 హరికేశుడు, 2 హిరణ్యాక్షుడు

47వ తరం 7. కంకుడు, భార్య కంక- పుత్రులు 48వ తరం 1. బకుడు 2 సత్యాజిత్తు, 3 పురుజిత్తు.

47వ తరం 8. ఆనీకుడు, భార్య సుదామని- పుత్రులున 1 సుమత్రానీకుడు, 2 బాణుడు మున్నగు వారు.

47వ తరం 9. వత్సకుడు, భార్య మిశ్రకేశి / అప్సరస- పుత్రులు 48వ తరం వృకుడు మున్నగువారు.

47వ తరం 10. వృకుడు, భార్య దార్వాక్షి- 48వ తరం 1 దక్షుడు, 2, పుష్కరుడు, 3. సాళ్వుడు మున్నగువారు.

47వ తరం 1. పృథ / కుంతి (పెంపుడు కూతురు), భర్త పాండురాజు- పుత్రుల- 1 కర్ణుడు / కానీనుడు / సూర్యుని వలన, 48వ తరం 1 ధర్మరాజు, 2 భీముడు,3 అర్జునుడు.

2. శ్రుతదేవ, భర్త వృద్ధశర్మ / కారుష రాజు- పుత్రుడు 48వ తరం - 1 దంతవక్త్రుడు

3. శ్రుతకీర్తి, భర్త ధృష్టకేతుడు- / కేకయ రాజు- పుత్రుడు 48వ తరం ప్రతర్థనుడు మున్నగువారు అయిదుగురు (5)

4. శ్రుతశ్రవస, భార్య దమఘోషుడు / చేది రాజ- పుత్రుడు 48 తరం శిశుపాలుడు

5. రాజాధిదేవి, భార్య జయత్సేనుడు- పుత్రుల 48వ తరం 1 విందుడు, 2 అనువిందుడు.

41వ తరం కుకురుడు, పుత్రుడు వృష్ణి, 42వ తరం విలోమతనయుడు, 43వ తరం కపోతరోముడు, 44వ తరం అనువు / వీరు తుంబురుని సఖుడు,- 45వ తరం దుందుభి, 46వ దవిద్యోతుడు, 47వ తరం పునర్వసువు, 48వ తరం ఆహుకుడు, భార్య ఆహుకి,- పుత్రులు 49వ తరం 1) దేవకుడు, 2) ఉగ్రసేనుడు.

49వ తరం 1) దేవకుడు పుత్రులు- 50వ తరం(1) దేవలుడు, (2) ఉపదేవుడు, (3) సుదేవుడు, (4) దేవవర్ధనుడు, -పుత్రికలు ఏడుగురకు భర్త వసుదేవుడు (1) ధృతదేవి, (2) శాంతిదేవి, (3) ఉపదేవి), (4) శ్రీదేవి, (5) దేవరక్షిత, (6) సహదేవి, (7) దేవకి.

49వ తరం 2) ఉగ్రసేనుడు, పుత్రులు 50 తరం (1) కంసుడు, (2) న్యగ్రోధుడు, (3) సునామకుడు, (4) కహ్వుడు, (5) శంఖుడు, (6) సుభువు, (7) రాష్ట్రపాలుడు, (8) విసృష్టుడు, (9) తుష్టిమంతుడు, - పుత్రికలు నలుగురు వసుదేవుని సోదరుడి భార్యలు (1) కంస, (2) కంసవతి, (3) సురాభువు, (4) రాష్ట్రపాలిక.

40వ తరం మహాభోజుడు- వీరి వంశం భోజులు.

19వ తరం రోమపాదుడు- పుత్రుడు 20వ తరం బభ్రువు, 21 విభువు, 22వ తరం కృతి, 23వ తరం నుశికుడు, 24వ తరం చేది, 25వ తరం చైద్యుడు--

8వ తరం 3) నలుడు-

8వ తరం 4) రిపుడు-

7వతరం 2. తుర్వసుడు పుత్రుడు 8వ తరం యయాతి, 9వ తరం ద్యుహ్యుడు, 10వ తరం భభ్రుసేతువు, 11వ తరం నారభుడు, 12వ తరం గాంధారుడు, 13వ తరం ఘర్ముడు, 14వ తరం ఘృతుడు, 15వ తరం దుర్మదుడు 16వ తరం ప్రచేతసుడు పుత్రులు నూరుగురు (100).

(9-510-వ., 9-541-ఉ.) 6వతరం యయాతి 3వ భార్య ఋషపర్వుని కూతురు శర్మిష్ఠ- పుత్రులు 7వ తరం 3. త్రుహ్యుడు, 4. అనువు, 5. పూరువు

7వ తరం 3. త్రుహ్యుడు- పుత్రుడు 8వ తరం బభ్రుసేతువు;- 9వ తరం ఆరబ్ధుడు; - 10వ తరం గాంధారుడు;- 11వ తరం ఘర్ముడు;- 12వ తరం ఘృతుడు;-- 13వ తరం దుర్మదుడు;- 14వ తరం ప్రచేతసుడు;- 15వ తరం వందమంది పుత్రులు

7వ తరం తుర్వసుడు, 8వ తరం వహ్ని, 9వ తరం భానుమంతుడు, 10వ తరం త్రిసానువు, 11వ తరం కరందముడు, 12వ తరం మరుత్తుడు.

7వ తరం 4. అనువు- పుత్రులు 8వ తరం 1) సభానరుడు, 2) చక్షువు, 3) పరోక్షుడు.

8వ తరం 1) సభానరుడు- 9వ తరం కాలనాథుడ, 10వ తరం సృంజయుడు, 11వ తరం పురంజయుడు, 12వ తరం జనమేజయుడు, 13వ తరం మహాశాలుడు, 14వ తరం మహామనసుడు, పుత్రులు 15వ తరం (1) ఉశీనరుడు, (2) తితిక్షువు

15వ తరం ఉశీనరుడు- పుత్రులు 16వ తరం 1. శిబి, 2. వన. 3. క్రిమి, 4. దర్పుడు

16 తరం శిబి- పుత్రులు 17వ తరం 1 వృషుడు, 2 దర్పుడు,3 సువీరుడు, 4 మద్రుడు, 5 కేకయుడు

17వ తరం సువీరుడు- 18వ తరం సత్యరథుడు, 19వ తరం దివిరథుడు, 20వ తరం ధర్మరథుడు, 21వ తరం చిత్రరథుడు / రోమపాదుడు, దత్త పుత్రిక 22వ తరం 1) ఋశ్యశృంగుడు భార్య దశరథును కూతురు ఐన శాంత., 2) చతురంగుడు

22వ తరం చతురంగుడు- 23వ తరం పృథులాక్షుడు- పుత్రులు 23వ తరం 1. బృహద్రథుడు, 2 బృహత్కర్ముడు, 3 బృహద్భానుడు

23వ తరం 3 బృహద్రథుడు,- 24వ తరం బృహన్మనసుడు, 25వ తరం జయద్రథుడు, 26వ తరం విజయుడు భార్య సంభూతి, 27వ తరం ధృతి, 28వ తరం ధృతవ్రతుడు, 29వ తరం సత్యకర్ముడు, 30వ తరం అతిరథుడు, 31వ తరం కర్ణుడు / పెంపుడు కొడుకు / (కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు పుట్టిన కొడుకు కనుక కానీనుడు), - 32వ తరం వృషసేనుడు, 33వ తరం ....

15వ తరం తితిక్షువు,- పుత్రుడు 16వ తరం ఋషద్రథుడు, 17వ తరం హేముడు, 18వ తరం సుతరుడు, 19వ తరం బలి.

19వ తరం బలి, పుత్రులు 20వ తరం (1) అంగ, (2) వంగ, (3) కళింగ, (4) సింహ, (5) పుండ్ర, (6) ఆంధ్ర / {వీరు ఆరుగురు వీరి వంశస్థులు తూర్పుదేశ రాజులు}

(9-593-వ) 7వతరం 5. పూరువు- 8వ తరం జనమేజయుడు, 9వ తరం ప్రాచీనాంసుడు, 10వ తరం చారువు, 11వ తరం సుద్యువు, 12వ తరం బహుగతుడు, 13వ తరం శర్యాతి, 14వ తరం సంయాతి, 15వ తరం రౌద్రాశ్వుడు, అప్సరస ఘృతాచి, పుత్రులు - 16వ తరం 1 ఋతేపువు, 2 కక్షేపువు, 3 స్థలేపువు, 4 కృతేపువు, 5 జలేపువు, 6 సన్నతేపువు, 7 సత్యేపువు, 8 ధర్మేపువు, 9 వ్రతేపువు, 10 వనేపువు.

16వ తరం 1. ఋతేపువు- పుత్రుడు-17వ తరం అంతిసారుడు. - పుత్రులు 18వ తరం 1. సుమతి, 2. ధ్రువుడు, 3 అప్రతిరథుడు,

18వ తరం 1. సుమతి, పుత్రుడు 19వ తరం రైభ్యుడు, 20 తరం దుష్యంతుడు, భ్రయ శకుంతల / కణ్వుని పెంపుడు కూతురు, 21వ తరం భరతుడు, 22వ తరం భరద్వాజుడు / వితథుడు / పెంపుడు కొడుకు / (బృహస్పతికి అన్నభార్య మమత అందు పుట్టినవాడు), 23వ తరం మన్యువు.

23వ తరం మన్యువు - పుత్రులు 24వ తరం 1 భృహత్క్షత్రుడు, 2 జయ, 3, మహావీర్య, 4 నరుడు, 5. గర్గుడు.

24వ తరం బృహత్క్షత్రుడు- 25వ తరం సుహోత్రుడు, 26వ తరం హస్తి / హస్తిన నగరం నిర్మించాడు- పుత్రులు 27వ తరం 1. అజమీడుడు, 2. ద్విమీఢుడు. 3. పురుమీఢుడు / విస్సంతు,

27వ తరం 1. అజమీడుడు,- 28వ తరంపుత్రులు ప్రియమేథాదులు బ్రాహ్మణులైరి, (1) బృహదిషుడు, (2) ఋక్షుడు మఱియు పుత్రులు భార్య నళిని- 28వ తరం (3) నీలుడు,

27వ తరం 1. అజమీడుడు,- 28వ తరం (1) బృహదిషుడు, 28వ తరం బృహద్ధనువు, 29వ తరం బృహత్కాయుడు, 30వ తరం జయద్రథుడు, 31వ తరం విశ్వజిత్తు, 32వ తరం సేనజిత్తు,- పుత్రులు

33వ తరం 1. రుచిరాశ్వుడు, 2. దృఢహనువు, 3. కాశ్యుడు, 4 వత్సుడు.

33వ తరం రుచిరాశ్వుడు- 34వ తరం ప్రాజ్ఞుడు, 35వ తరం పృథుసేనుడు, 36వ తరం పారుడు, 37వ తరం నీపుడు, 38వ తరం వందమంది పుత్రులు. మఱియు 37వ తరం నీపుడు శుక్రుని కూతురైన సత్కృతి- బ్రహ్మదత్తుడు, భార్య గోదేవి- 38వ తరం విష్వక్సేనుడు- 39వ తరం ఉదక్సేనుడు- 40వ తరం భల్లాదుడు / వీరు బార్షదిపులు.

27వ తరం 1. అజమీడుడు,- 28వ తరం(2) ఋక్షుడు- 28వ తరం సంవరణుడు, భార్య సూర్యకన్యకయైన తపతి- 29వ తరం కురువు / కురుక్షేత్రం కట్టించాడు.

29వ తరం కురువు- పుత్రులు 30వ తరం 1) పరీకిత్తు / నిస్సంతువు, 2) సుధనువు, 3) జహ్నువు, 4) నిషధుడు.

30వ తరం 2) సుధనువు,- 31వ తరం సుహోత్రుడు, 32వ తరం చ్యవనుడు. 33వ తరం కృతి, 34వ తరం ఉపరిచరమనువు,- పుత్రులు 35వ తరం 1 బృహద్రథుడు, 2 కుసుంభుడు, 3 మత్స్యుడు, 4 ప్రత్యగ్రుడ, 5 చేదిషాదులు.

35వ తరం 1 బృహద్రథుడు, పుత్రులు ఒక భార్య యందు 36వ తరం 1) కుశాగ్రుడు, వేరొక భార్య యందు 2) జరాసంధుడు / రెండు ఖండములుగా పుట్టిన శిశువును జర అను దైత్యకాంత జోడించుటచే కలిగినవాడు కనుక జరాసంధుడు.

36వ తరం కుశాగ్రుడు, 37వ తరం ఋషభుడు, 38వ తరం సత్యహితుడు, 39వ తరం పుష్పవంతుడు, 39వ తరం జహ్నువు

35వ తరం 1 బృహద్రథుడు,- 36వ తరం 2) జరాసంధుడు- 36వ తరం సహదేవుడు, 37వ తరం సోమాపి, / మార్జాలి,- 38వ తరం శ్రుతశ్రవుడు.- 39వ తరం అయుతాయువు;

40వ తరం నిరమిత్రుడు; 41వ తరం సునక్షత్రుడు; - 42వ తరం బృహత్సేనుడు; - 42వ తరం కర్మజిత్తు; - 43వ తరం శ్రుతంజయుడు; -44వ తరం విప్రుడు; 45వ తరం శుచి; - 46వ తరం క్షేముడు; 47వ తరం సువ్రతుడు; - 48వ తరం ధర్మనేత్రుడు; - 49వ తరం శ్రుతుడు; 50వ తరం దృఢసేనుడు; 51వ తరం సుమతి; - 52వ తరం సుబలుడు; - 53వ వ తరం సునీతుడు; - 54వ తరం సత్యజిత్తు; 55వ తరం విశ్వజిత్తు; -56వ తరం పురంజయుడు. /వీరు మగధాధీశులు.

29వ తరం కురువు- 30 తరం 3) జహ్నువు- 31వ తరం సురథుడు, 32వ తరం విదూరథుడు, 33వ తరం సార్వభౌముడు, 34వ తరం సంభవుడు, 35వ తరం జయత్సేనుడు, 36వ తరం రథికుడు, - 37వ తరం, అయుతాయువు, 38వ తరం క్రోధనుడు, 39వ తరం దేవాతిథి, 40వ తరం ఋక్షుడు, 41వ తరం భీమసేనుడు, 42వ తరం ప్రతీపుడు, పుత్రులు 43వ తరం 1 దేవాపి / రాజ్యం వద్దని అడవికిపోయాడు, 2 శంతనుడు, 3 బహ్లికుడు.

42వ తరం ప్రతీపుడు, - 43వ తరం 2 శంతనుడు, 1వ భార్య గంగాదేవి- 44వ తరం (1) భీష్ముడు, 2వ భార్య సత్యవతి- 44వ తరం (2) చిత్రాంగదుడు / నిస్సంతు, (3) విచిత్రవీర్యుడు.

శంతనుని వివాహానికి ముందు సత్యవతి, పరాశరమహర్షి వలన- వ్యాసమహర్షి.

43వ తరం 2 శంతనుడు,- 44వ తరం ((3) విచిత్రవీర్యుడు, భార్యలు 1వ భార్య అంబిక, వ్యాసుని వలన 45వ తరం 1) ధృతరాష్ట్రుడు, 2వ భార్య అంబాలిక వ్యాసుని వలన 45వ తరం 2) పాండురాజు, అంబాలిక దాసి యందు వ్యాసుని వలన విదురుడు.

45వ తరం 1) ధృతరాష్ట్రుడు, భార్య గాంధారి- పుత్రులు 46వ తరం (1) దుర్యోధనాదులు వందమంది, పుత్రిక దుశ్శల.

45వ తరం 2) పాండురాజు, 1వ భార్య కుంతీదేవి- పుత్రులు ధర్ముని వలన 46వ తరం (1) యుధిష్ఠరుడు, వాయుదేవుని వలన 46వ తరం (2) భీముడు, ఇంద్రుని వలన 46వ తరం (3) అర్జునుడు, 2వ భార్య మాద్రిదేవి- అశ్వనీదేవతల వలన 45వ తరం (4) నకులుడు, (5) సహదేవుడు. / ఈ ఐదుగురు కలిసి పంచపాండవులు.

46వ తరం (1) యుధిష్ఠరుడు, (2) భీముడు, (3) అర్జునుడు, (4) నకులుడు, (5) సహదేవుడు ఈ ఐదుగురికి భార్య ద్రౌపది-

ద్రౌపది భర్త యుధిష్టరుడు- 1) ప్రతివింధ్యుండు, భీముడు- 2) శ్రుతసేనుండు, అర్జునుడు- 3) శ్రుతకీర్తి, నకులుడు- 4) శతానీకుండును, సహదేవుడు- 5) శ్రుతకర్ముండును / 47వ తరం ఈ ఐదుగురను ఉపపాండవులు అందురు.

యుధిష్ఠిరుడు, భార్య పౌరవతి- 6) దేవకుడు, భీమసేనుడు, 1వ భార్య హిడింబి- 7) ఘటోత్కచుడు, 2వ భార్య కాళి- 8) సర్వగతుడు, అర్జునుడు,1వ భార్య- ఉలూపి / నాగకన్యక- 9) ఇలావంతుడు, 2వ మణలూరురాకుమారి యయిన చిత్రాంగద- 10) బబ్రువాహనుడు, 3వ భార్య దేవకీవసుదేవుల పుత్రికైన సుభద్ర- 11) అభిమన్యుడు, , సహదేవుడు భార్య విజయ- 12) సుహ్రోత్రుడు, నకులుడు, భార్య రేణుమతి- 13) నిరమిత్రుడు

గమనిక / 10) బభ్రువాహనుడు మణులూరు వంశంలోకి పెంపెకం వెళ్ళాడు.

47వ తరం అభిమన్యుడు, భార్య విరాటరాజు కుమార్తైన ఉత్తర - 48వ తరం పరీక్షిత్తు.

47వ తరం అభిమన్యుడు,- 48వ తరం పరీక్షిత్తు.- 49వ తరం జనమేజయుడు,- 50వ తరం శతానీకుడు, - 51వ తరం సహస్రానీకుడు- 52 తరం- అశ్వమేధజుడు,- 53వ తరం ఆసీమకృష్ణుడు, 54వ తరం నిచకుడు 55వ తరం ఉప్తుడు; 56వ తరం చిత్రరథుడు, 57వ తరం శుచిరథుడు, 58వ తరం వృష్టిమంతుండు, 59వ తరం సుషేణుడు, 60వ తరం సుపీతుడు, 61వ తరం నృచక్షువు, 62వ తరం సుఖానిలుడు, 63వ తరం పరిప్లవుడు,- 64వ తరం మేధావి,- 65వ తరం సునయుడు,- 66వ తరం నృపంజయుడు, - 67వ తరం దూర్వుడు, - 68వ తరం నిమి, 69వ తరం బృహద్రథుడు,- 70వ తరం సుదాసుడు, - 71వ తరం శతానీకుడు, 72వ తరం దుర్దమనుడు, - 73వ తరం విహీనరుడు, 74వ తరం దండపాణి, 75వ తరం మితుడు, - 76వ తరం క్షేమకుడు, 77వ తరం బ్రహ్మక్షత్రుడు

42వ తరం ప్రతీపుడు, -43వ తరం 3 బహ్లికుడు- 44వ తరం సోమదత్తుడు,- పుత్రులు 45వ తరం 1. భూరి,- 2. భూరిశ్రవసుడు, 3. శలుడు

27వ తరం 1. అజమీడుడు,- మఱియు పుత్రులు భార్య నళిని- 28వ తరం (3) నీలుడు, 29వ తరం శాంతి, 30వ తరం సుశాంతి, 31వ తరం పురుజుడు, 32వ తరం అర్కుడు, 33వ తరం భర్మ్యాశ్వుడు, పుత్రులు 34వ తరం 1) ముద్గలుడు, 2) అవీనరుడు, 3) బృహదిషుడు, 4) కాంపిల్యుడు, 5) సృంజయుడు.

34వ తరం 1) ముద్గలుడు,- నుండి ముద్గల గోత్ర బ్రాహ్మణులు, పుత్రుడు 35వ తరం దివోదాసుడు, పుత్రిక 35వ తరం అహల్య, భర్త గౌతముడు- 36వ తరం శతానందుడు, 37వ తరం సత్యధృతి, కవలలు అందు పుత్రుడు కృపాచార్యుడు, పుత్రిక కృపి, భర్త ద్రోణుడు / కృపాచార్యుడు కృపిలను శంతనుడు పెంచుకున్నాడు.

35వ తరం దివోదాసుడు,- 36వ తరం మిత్రాయువు, 37వ తరం చ్యవనుడు, 38వ తరం సుదాసుడు, 39వ తరం సహదేవుడు,, 40వ తరం సోమకుడు, 41వ తరం సోమకుడు, 42వ తరం సుజన్మకృత్తు, పు్తులు వందమంది / వారిలో జేష్ఠుడు 43వ తరం జంతువు, కనిష్ఠుడు 43వ తరం వృషతులుడు,

43వ తరం వృషతులుడు,- 44వ తరం ద్రుపదుడు, పుత్రులు 45వ తరం ధృష్టద్యుమ్నాదులు, పుత్రిక ద్రౌపది, పాండవుల భార్య,

45వ తరం దృష్టద్యుమ్నుడు- దృష్టకేతువు / వీరిని పాంచాలులు అంటారు.

27వ తరం ద్విమీఢుడు- 28వ తరం యమీనరుడు, 29వ తరం కృతిమంతుడు, 30వ తరం సత్యధృతి, 31వ తరం దృఢనేమి, 32వ తరం సుపార్శ్వకృత్తు, 33వ తరం సుపార్శుడు- 34వ తరం సుమతి, 35వ తరం సన్నతిమంతుడు, 36వ తరం కృతి- 37వ తరం ఉగ్రాయుధుడు, 38వ తరం క్షేముడు, సువీరుడు, 39వ తరం పురంజయుడు, 40వ తరం బహురథుడు,

18వ తరం 3 అప్రతిరథుడు, 19వ తరం కణ్యుడు, 20వ తరం మేధాతిథి, 21వ తరం ప్రస్కంధుడు మొదలగువారు.

(9-497-వ.) 5వతరం క్షత్రవృద్ధుడు / ఆయువు పుత్రుడు, 6వ తరం సుహోత్రుడు- పుత్రులు 7వ తరం (1) కాశ్యుడు, (2) కుశుడు, (3) కృత్స్నమదుడు

(9-497-వ.) 7వ తరం 1. కాశ్యుడు- 8వ తరం కాశి, 9వ తరం రాష్ట్రుడు, 10వ తరం ధీర్ఘతపుడు- పుత్రుడు- 11వ తరం ధన్వంతరి, (9-499-వ.) 11వ తరం ధన్వంతరి, 12వ తరం కేతుమంతుడు, 13వ తర భీమరథుడు, 14వ తరం దివోదాసుడు / ద్యుమంతుడు, 15వ తరం ప్రతర్ధనుడు / శత్రుజిత్తు/ ఋతధ్వజుడు, 16వ తరం కువలయాశ్వుడు, పుత్రుడు అలర్కుడు

(9-497-వ.) 7వ తరం 2. కుశుడు- 8వ తరం ప్రీతి, 9వ తరం సంజయుడు, 10వ తరం జయుడు.

(9-497-వ.) 7వ తరం 3. కృత్స్నమదుడు- 8వ తరం శునకుడు, 9వ తరం శౌనకుడు, 10వ తరం బృహ్వచప్రవరుడు.

(9-500-ఆ., 9-501-వ.) 17వ తరం అలర్కుడు, 18వ తరం సన్నతి, 19వ తరం సునీతుడు, 20వ తరం సుకేతనుడు, 21వ తరం ధర్మకేతువు, 22వ తరం సత్యకేతువు, 23వ తరం ధృష్టకేతువు, 24వ తరం సుకుమారుడు, 25వ తరం వీతిహోత్రుడు, 26వ తరం భర్గుడు, 27వ తరం భార్గభూమి. (కాశులు)

9(503-వ.) 7వ తరం (2) కుశుడు- పుత్రుడు 8వ తరం ప్రీతి, 9వ తరం సంజయుడు, 10వ తరం జయుడు, 11వ తరం కృతుడు, 12వ తరం హర్యధ్వనుడు, 13వ తరం సహదేవుడు, 14వ తరం భీముడు, 15వ తరం జయత్సేనుడు, 16వ తరం సంకృతి, 17వ తరం జయుడు, 18వ తరం క్షత్రధర్ముడు.

(9-497-వ.) 7వ తరం (3) కృత్స్నమదుడు- పుత్రుడు 8వ తరం శునకుడు, 9వ తరం శౌనకుడు, 10వ తరం బృహ్వృచప్రవరుడు.

(9-504-వ.) 5వ తరం 3 రజి- పుత్రులు 500 మంది. / దేవేంద్రుని వజ్రాయుధానికి బలయ్యారు.

9(-503-వ) 5వతరం 4 రంభుడు/ ఆయువు పుత్రుడు- పుత్రుడు 6వ తరం రభసుడు- 7వ తరం గంభీరుడు, 8వ తరం కృతుడు, 9వ తరం బ్రహ్మకులము.

5వ తరం 5 అనేనసుడు- పుత్రుడు 6వ తరం, శుద్ధుడు, 7వ తరం శుచి, 8వ తరం త్రికకృత్తు / బ్రహ్మదేవునికి సారథి, 9వ తరం శాంతరజుడు,

(9-422-సీ.) 4వ తరం. 2. శ్రుతాయువు- పుత్రుడు వసుమంతుడు

(8-422-వ.) 4వ తరం.3. సత్యాయువు- పుత్రుడు శ్రుతంజయుడు

(9-422-వ.) 4వ తరం.4. రయుడు- పుత్రులు శ్రుతుడు, ఏకుడు.

(9-422-వ.) 4వ తరం.5. జయుడు- పుత్రుడు అమితుడు.

(9-422-.) 4వ తరం. 6. విజయుడు- పుత్రుడు 5వ తరం భీముడు- పుత్రుడు 6వ తరం కాంచనుడు- పుత్రుుడు 7వ తరం హోత్రకుడు- పుత్రుడు 8వ తరం జహ్నువు (గంగను పుక్కిట పట్టెను),- పుత్రుడు 9వ తరం పూరుడు- పుత్రుడు 10వ తరం బాలకుడు- పుత్రుడు 11వ తరం అజకుడు- పుత్రుడు 12వ తరం కుశుడు- పుత్రులు 1) కుశాంబువు, 2) దూర్తయుడు, 3) వసువు, 4) కుశనాభుడు.

(9-422-వ.) 13వ తరం 1) కుశాంబువు- 14వ తరం గాధిరాజు- పుత్రిక 1. సత్యవతి, పుత్రుడు 2. విశ్వామిత్రుడు- పుత్రులు వందమందికి పైగా

(9-423-సీ.) 15వ తరం సత్యవతి, భర్త ఋచికుడు- , పుత్రుడు 16వ తరం జమదగ్ని భార్య రేణువు కుమార్తైన రేణుకాదేవి- పుత్రులు వసుమనడు మున్నగువారు కనిష్ఠుడు పరశురాముడు.

(9-492-వ.) 15 వ తరం 2. విశ్వామిత్రుడు- పుత్రులు

16 వ తరం. అష్టక, హారిత, జయంత, సుమద మధుచ్ఛదుడు మున్నగు వందమందికి పైగా + పెంపుడు కొడుకు శునశ్శేపుడు / దేవరాతుడుే / అజీగర్తుని మధ్యమ పుత్రుడు.

~X~