వంశవృక్షాలు : బ్రహ్మ దేవుని పుత్రులు
చతుర్ముఖ బ్రహ్మ వంశ విస్తారము పాఠ్య రూపం వీక్షించడానికి ఇక్కడ తట్టండి.
చతుర్ముఖ బ్రహ్మ వంశ పటం
ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 27:-
అంగిరసుడు; అత్రి; ఆకూతి; ఉత్తానపాదుడు; కర్దముడు; క్రతువు; దక్షుడు; దేవహూతి; నారదుడు; నిరృతి; నీలలోహితుడు అను రుద్రుడు; పులస్త్యుడు; పులహుడు; ప్రసూతి; ప్రియవ్రతుడు; భృగువు; మన్మధుడు; మరీచి; వసిష్ఠుడు; శతరూప; సనందనుడు; సనకుడు; సనత్కుమారుడు; సనత్సుజాతుడు; సరస్వతి; స్వాయంభువుడు
చతుర్ముఖ బ్రహ్మ వంశ విస్తారము
విష్ణుమూర్తి - ఆవిర్భావము బొడ్డు తామర - చతుర్ముఖ బ్రహ్మదేవుడు - మానస పుత్రులు:
1. దేహం ద్వివిధం ఐ ఒక దేహంనుండి - స్వాయంభువుడు, భార్య మరొక దేహంనుండి - శతరూప
స్వాయంభువుడు, భార్య శతరూప - పుత్రులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, - పుత్రికలు రుచిప్రజాపతి భార్య (1) ఆకూతి, కర్దమ ప్రజాపతి భార్య (2) దేవహూతి, దక్షప్రజాపతి భార్య (3) ప్రసూతి.
2. నీడనుండి - కర్దముడు, భార్య స్వాయంభువ మనువు రెండవ పుత్రిక దేవహూతి- పుత్రికలు తొమ్మిది మంది, (1) కళ, (2) అనసూయ, (3) శ్రద్ధ, (4) హవిర్భుక్కు, (5) గతి, (6) క్రియ, (7) ఖ్యాతి, (8) ఊర్జ / అరుంధతి, (9) జిత్తి ; పుత్రుడు (10) కపిలుడు.
(1) కళ, మరీచి భార్య- పుత్రుడు 1- కశ్యపుడు, పుత్రిక 2. పూర్ణిమ
2. పూర్ణిమ- పుత్రిక దేవకుల్య / పూర్వ జన్మలో గంగ, - పుత్రుడు విరజుడు.
(2) అనసూయ, అత్రి భార్య- పుత్రులు 1. చంద్రుడు, 2. దత్తుడు, 3. దూర్వాసుడు
(3) శ్రద్ద, అంగీరసుడు భార్య- పు్తికలు 1. సినీవాలి, 2. కూహూ, 3. రాకా, 4. అనుమతి. - పుత్రులు 5. ఉతథ్యుడు, 6. బృహస్పతి
(4) హవిర్భుక్, పులస్త్యుడు భార్య- పుత్రులు 1. అగస్త్యుడు, 2. విశ్రవసు
2. విశ్రవసు, 1వ భార్య ఇలబిల- పుత్రుడు కుబేరుడు.
2వ భార్య కైకసి పుత్రులు- 1 రావణుడు, 2. కుంభకర్ణుడు, 3, విభీషనుడు.
(5) గతి, పులహుడు భార్య- పుత్రులు 1. కర్మశ్రేష్ఠుడు, 2. వరియాంసుడు, 3. సహిష్ణుడు.
(6) క్రియ, క్రతువు- 60,000 వాలఖిల్యులు.
(7) ఖ్యాతి భృగువు 1వ భార్య- పుత్రుడు 1- ధాత, మేరువు పుత్రికలు 1. ఆయతి, 2. నియతి
1. ఆయతి, ధాత భార్య - పుత్రులు 1. మృకండుడు, 2. మార్కండేయుడు.
2. నియతి ధాత భార్య- పుత్రుడు ప్రాణుడు- పుత్రుడు వేదశిరుడు
2వ పుత్రుడు విధాత., 3వ పుత్రుడు శ్రీ.
ఉశన ధాత 2వ భార్య- పుత్రుడు కవి
(8) ఊర్జ / అరుంధతి వసిష్ఠుడు 1వ భార్య, 2వ భార్య మరొకరు,
అరుంధతి- పుత్రులు 1. చిత్రకేతుడు, 2. సురోచి, 3. విరజుడు, 4. మిత్రుడు, 5. ఉల్బణుడు, 6. వసుభృద్యుడు, 7. ద్యుమంతుడు అను సప్తఋషులు
(9) జిత్తి / శాంతి అధర్వుడు భార్య- పుత్రులు 1. ధృతవ్రతుడు, 2. దధ్యంచుడు / అశ్వశిరస్కుడు.
(9), -పుత్రుడు కపిలుడు.
3. అపానమునుండి - నిరృతి4. ముఖమునుండి - వాణి
5. చెవులనుండి - పులస్త్యుడు
6. కన్నులనుండి - అత్రి
7. మనస్సునుండి - మరీచి
8. ప్రాణమునుండి - వసిష్ఠుడు
9. ముఖమునుండి - అంగిరుడు
10. చేతినుండి -క్రతువు
11. చర్మంనుండి -భృగువు
12. నాభినుండి - పులహుడు
13. తొడనుండి - నారదుడు
14. బొటనవ్రేలునుండి - దక్షుడు
దక్ష ప్రజాపతి- భార్య స్వాయంభువవుని కుమార్తె ప్రసూతి.- పుత్రికలు 16 మంది, శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి, స్వాహాదేవి, స్వధ, సతి(ఉమ).
(అ) ధర్ముని భార్యలు పదమూడుమంది
1) శ్రద్ధ, - పుత్రుడు శ్రుతము
2) మైత్రి, - పుత్రుడు ప్రసాదము
3) దయ, - పుత్రుడు అభయము
4) శాంతి, - పుత్రుడు సుఖము
5) తుష్టి, - పుత్రుడు ముదము
6) పుష్టి, - పుత్రుడు స్మయము (గర్వము, ఆశ్చర్యము)
7) ప్రియ, - పుత్రుడు యోగము
8) ఉన్నతి, - పుత్రుడు దర్పము
9) బుద్ధి, - పుత్రుడు అర్థము
10) మేధ, - పుత్రుడు స్మృతి
11) తితిక్ష (ఓర్పు), - పుత్రుడు క్షేమము
12) హ్రీ (సిగ్గు లజ్జ), - పుత్రుడు ప్రశ్రయము (అభిమానము, ఆప్యాయము, ప్రీతి,)
13) మూర్తి – పుత్రుడు నరనారాయణులు.
(ఆ) అగ్నిదేవుడు భార్య-
14) స్వాహాదేవి- పుత్రులు పావకుడు, పవమానుడు, శుచి- పుత్రులు ఒక్కొత్తరికి 15 మంది చొప్పున, 15x3, 45 మంది అగ్నులు. తాతలు, తండ్రులు కలిపి 49 మంది అగ్నులు, వారు 1. అగ్నిష్వాత్తులు, 2. బర్హిషదులు, 3. సౌమ్యులు, 4. పితలు, 5. ఆజ్యపులు, 6. సాగ్నులు, 7. నిరగ్నులు అని ఏడు విధములు.
(ఇ) పిత్రుదేవతలు భార్య
15) స్వధ- పుత్రులు వయన, ధారణి
(ఈ) శివుని భార్య
16) సతి (ఉమ)- తరువతి జన్మలో హిమవంతుని పుత్రికగా పార్వతి పేరుతో శివుని భార్య.
15. భృకుటినుండి - నీలలోహితుడు / రుద్రుడు - పుత్రులు రుద్రగణాలు
17. దివ్యదృష్టితో - సనందనుడు
18. దివ్యదృష్టితో - సనత్కుమారుడు
19. దివ్యదృష్టితో - సనత్సుజాతుడు.