పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : కౌశిక సంహితార్గతం

కౌశిక సంహితార్గత శ్రీమద్భాగవత మహాత్మ్యము లోనిది.

1.  శ్రీమద్భాగవత రూప కల్పవృక్షమునకు సద్రూపుడైన పరమాత్మయే బీజము. ఓంకారమే అంకురము. ఈ వృక్షమునకు పదిరెండు పెద్ద కొమ్మలు గలవు( ద్వాదశ స్కంధములు). మూడు వందల ముప్పది ఐదు చిన్న శాఖలు (అధ్యాయములు).ఈ చెట్టుకున్నవి. పదునెనిమిది వేల శ్లోకరూపమయిన రెమ్మలు కలవు. అయిదు లక్షల డెబ్బది ఆరువేల ఆకులు (అక్షరములు) చెట్టునందున్నవి.

2.  ఏతత్ సందర్భమున తెలుగుభాగవతార్గత వ్యాసభాగవతమునందునూ పన్నెండు (12) కొమ్మలు, మూడువందల ముప్పైయైదు (335) చిన్నకొమ్మలు కలవు. కాని, రెమ్మలు పద్నాలుగువేల నాలుగు వందల నలభైనాలుగు (14444) మాత్రమే కలవు. ఆకులు లెక్కించలేదు.