: నారద తత్వ సంకేత పదాలు
నారదుడు చెప్పిన తత్వశాస్త్ర సాంకేత పదాలు
| దేహము | - | రథం; |
| బుద్ధి | - | సారథి; |
| ఇంద్రియాలు | - | గుర్రములు; |
| మనస్సు | - | కళ్ళెం; |
| పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణ వాయువులు | - | రథం ఇరుసులు; |
| ధర్మం, అధర్మం | - | రథచక్రాలు; |
| చిత్తం | - | కఠినమైన బంధం; |
| పంచేంద్రియ విషయములు | - | సంచార భూములు; |
| అహంకార సమేతుడైన జీవుడు | - | రథికుడు; |
| ప్రణవం | - | ధనుస్సు; |
| శుద్ధ జీవుడు | - | బాణం; |
| బ్రహ్మము | - | పరమ లక్ష్యం; |
| రాగద్వేషాదులు | - | అడ్డుపడే బద్ధ శత్రువులు |
| భక్తి | - | కత్తికి సానపెట్టుట |
| జ్ఞానము | - | ఖడ్గము |
రథికుడు రథాన్ని వశం చేసుకుని, శత్రువులను జయించి, ధనుస్సు ఎక్కుపెట్టి, బాణంతో పరమ లక్ష్యాన్ని ఛేదించాలి; అదే పరమ ధర్మం
రథికుడు అప్రమత్తంగా ఉంటే, ఇంద్రియాలనే గుర్రాలు, పసిగట్టి, బుద్ధి అనే సారథితో సహా రథమును ప్రవృత్తి మార్గంలోకి లాగి, విషయ శత్రు వ్యూహం మధ్యలో పడవేస్తాయి.శత్రువులు విజృంభించి సంసార కూపంలో పడేస్తాయి