పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పరిశోధనలు : మనవి

: :చదువుకుందాం భాగవతం : బాగుపడదాం మనం అందరం: :

భాగవత రత్న పురస్కార గ్రహీతలు

  • గోదావరి వెంకట మురళీ మోహను ↔,శార్వారి (2020)
  • తాడేపల్లి. వీరలక్ష్మి ↔,వికారి (2019)
  • కాకునూరి భూలక్ష్మి ↔, విళంబి (2018)
  • వీపూరి వేంకటేశ్వర్లు ↔, హేవిళంబి (2017)
  • సహజకవి బమ్మెఱ పోతనామాత్యులు / వారి భాగవతాది రచనలు / తెలుగు భాషలో వచ్చిన భాగవతాల గురించి ఏదైనా విశ్వవిద్యాలయము లేదా గుర్తింపు పొందిన సంస్థ ద్వారా పట్టా పొందిన సిద్ధాంత గ్రంథాలు / పరిశోధనా పత్రాలు మఱియు వాటి జాబితా ఈ ఉప విభాగంలో అందిస్తున్నాము. జాబితాలో (అ) పరిశోధన అంశం, (ఆ) పరిశోధకుని పేరు, (అం) పర్యవేక్షకులు, (ఇ) విశ్వవిద్యాలయం, (ఈ) పట్టా అందించిన సంవత్సరం, (ఉ) పుస్తక ప్రచురణ, (ఊ) అంతర్జాల ప్రచురణ. (ఎ) పరిశోధనా పత్రాల లింకు – ఉంటాయి. మరొక్క విషయం తెలుగు ప్రచార సమితి “భాగవత రత్న పురస్కారం” 2017 నుండి ప్రదానం చేస్తున్నది.

     మాన్యులకు మనవి: (అ) జాబితా నవీకరించడానికి (అప్ డేట్) సమచారాలు, / (ఆ) తగిన పరిశోధన పత్రాలు, / (ఇ) “భాగవత రత్న పురస్కారానికి ప్రతిపాదనలు దయచేసి అందించ మనవి.

    గమనికలు:-
    ★ “భాగవత రత్న పురస్కారానికి పరిశోధకులు (క) పోతన వారి భాగనతాది రచనలు గురించి కానీ, తెలుగులో వచ్చిన భాగవతాల గురించి కాని విద్యాలయ స్థాయిలో పట్టాపొంది ఉండాలి మఱియు (ఖ) తెలుగు భాగవతం ఆరంభమైన 2007 సంవత్సరం తరువాత పట్టాపొంది ఉండాలి,
    ★ ఇక్కడ ఎట్టి కాపీరైటు ఉల్లంఘనులు అనుమతించబడవు. అనుకోకుండా ఏవైనా కాపీరైటు ఉల్లంఘనలు చొరబడినట్లు గమనించినచో తెలియజేయండి, తగిన చర్య తీసుకుంటాం.