పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : సనకాదుల హరి స్తుతి (భగవదనుగ్రహ ప్రదం)

సనకాదుల హరి స్తుతి (భగవదనుగ్రహ ప్రదం)

1

మఱియుం; జక్షురింద్రియగ్రాహ్యం బగు దివ్యమంగళవిగ్రహంబు ధరియించి యున్న పురుషోత్తము నుదాత్తతేజోనిధిం జూచి సనకాదు లిట్లని స్తుతియించిరి.

2

"జదళాక్ష! భక్తజనత్సల! దేవ! భవత్సుతుండు మ
జ్జకుఁడు నైన పంకరుహజాతుడు మాకు రహస్య మొప్పఁ జె
ప్పి భవదీయ మంగళగభీరపరిగ్రహ విగ్రహంబు మే
యముఁ జూడఁ గంటిమి కృతార్థులమై తగ మంటి మీశ్వరా!

3

దే! దుర్జనులకు భావింప హృదయ సం;
తుఁడవై యుండియుఁ గానఁబడవు
డఁగి నీ దివ్యమంళవిగ్రహంబున;
జేసి సమంచితాశ్రితుల నెల్లఁ
జేఁకొని సంప్రీతచిత్తులఁగాఁజేయు;
తిశయ కారుణ్యతిఁ దనర్చి
మలాక్ష! సర్వలోప్రజాధిప! భవ;
త్సందర్శనాభిలాషానులాప


విదిత దృఢభక్తియోగ ప్రవీణు లగుచు
ర్థిమై వీతరాగు లైట్టి యోగి
నమనః పంకజాత నిణ్ణమూర్తి
ని యెఱుంగుదురయ్య! నిన్నాత్మ విదులు.

4

యుక్తిం దలఁప భవద్వ్యతి
రిక్తము లైనట్టి యితర దృఢకర్మంబుల్
ముక్తిదము లయిన నీ పద
క్తులు తత్కర్మములను బాటింప రిలన్.

5

కావున గీర్తనీయ గతల్మష మంగళ తీర్థ కీర్తి సు
శ్రీవిభవప్రశస్త సుచరిత్రుఁడ వైన భవత్పదాబ్జ సే
వా విమలాంతరంగ బుధర్గ మనర్గళభంగి నన్యమున్
భామునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా!

6

మతపో విధూత భవపాపులమై చరియించు మాకు నేఁ
య భవత్పదాశ్రితుల ల్గి శపించిన భూరి దుష్కృత
స్ఫుణ నసత్పథైక పరిభూతులమై నిజధర్మహానిగా
నియము నొందఁగావలసె నేరము వెట్టక మమ్ముఁ గావవే.

7

మనురక్తి షట్పదము మ్రసుగంధమరందవాంఛచేఁ
మిడి శాతకంటకవృస్ఫుటనవ్యతరప్రసూనమం
రులను డాయు పోల్కిని భృశంబగు విఘ్నములన్ జయించునీ
ణసరోజముల్గొలువ మ్మతి వచ్చితిమయ్య కేశవా!

8

రు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
తుసి పవిత్రమైనగతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
లితములైన వాక్కుల నల్మషయుక్తిని విన్నఁ గర్ణముల్
విసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా!

9

హిత యశోవిలాసగుణమండన! సర్వశరణ్య! యింద్రియ
స్పృహులకుఁ గానరాక యతసీ కుసుమద్యుతిఁ నొప్పుచున్న నీ
జ శరీర మిప్పుడు భృశంబుగఁ జూచి మదీయ దృక్కు లిం
హ కృతార్థతం బొరసె చ్యుత! మ్రొక్కెద మాదరింపవే."

10

ని సనకాదులు దత్పద
జములకు మ్రొక్కి భక్తిశమానసులై
వినిపించిన గోవిందుఁడు
మునివరులం జూచి పలికె ముదితాత్ముండై.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత తృతీయ స్కంధములోని సనకాదుల హరి స్తుతి అను స్తుతి