పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ప్రజాపతుల శివ స్తుతి (భయ హరం)

ప్రజాపతుల శివ స్తుతి (భయ హరం)

1

భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! ;
దేవ! మహాదేవ! దేవవంద్య!
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ;
బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ;
యార్త శరణ్యుండ గు గురుండవు నిన్నుఁ;
గోరి భజింతురు కుశలమతులు;
కల సృష్టిస్థితిసంహారకర్తవై;
బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ రఁగు దీవ;


రమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త
మంబు నీవ శక్తియుఁడ వీవ;
బ్దయోని వీవ; గదంతరాత్మవు
నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు.

2

నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీ యంద లయముఁ బొందును
నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!

3

గ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ;
కాలంబు గతి; రత్నర్భ పదము;
శ్వసనంబు నీ యూర్పు; సన జలేశుండు;
దిశలుఁ గర్ణంబులు; దివము నాభి;
సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు;
ఠరంబు జలధులు; దలు శిరము;
ర్వౌషధులు రోమయములు; శల్యంబు;
ద్రులు; మానస మృతకరుఁడు;


ఛందములు ధాతువులు; ధర్మమితి హృదయ;
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు;
యిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు.

4

కొంఱు గలఁ డందురు నినుఁ;
గొంఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొంఱు; గలఁ డని లేఁ డని
కొంల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

5

లఁపఁ బ్రాణేంద్రియ ద్రవ్యగుణస్వభా;
వుఁడవు; కాలక్రతువులును నీవ;
త్యంబు ధర్మ మక్షరము ఋతంబును;
నీవ ముఖ్యుండవు నిఖిలమునకు;
ఛందోమయుండవు త్త్వరజస్తమ;
శ్చక్షుండవై యుందు; ర్వరూప
కామ పురాధ్వర కాలగరాది భూ;
ద్రోహభయము చోద్యంబు గాదు;


లీలలోచనవహ్ని స్ఫులింగ శిఖల
నంతకాదులఁ గాల్చిన ట్టి నీకు
రాజఖండావతంస! పురాణ పురుష!
దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ!

6

మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు
మూఁడు కాలములకు మూల మగుచు
భేద మగుచుఁ దుది నభేదమై యొప్పారు
బ్రహ్మ మనఁగ నీవ ఫాలనయన!

7

సత్తత్త్వ చరాచర
నం బగు నిన్నుఁ బొగడ లజభవాదుల్
పెవులుఁ గదలుప వెఱతురు
లక నినుఁ బొగడ నెంతవారము రుద్రా!

8

బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోమున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

9

లంటము నివారింపను
సందఁ గృపజేయ జయము సంపాదింపం
జంపెడివారి వధింపను
సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా!

10

నీకంటె నొండెఱుంగము;
నీకంటెం బరులు గావ నేరరు జగముల్;
నీకంటె నొడయఁ డెవ్వఁడు
లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత అష్టమ స్కంధములోని ప్రజాపతుల శివ స్తుతి అను స్తుతి