పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ప్రచేతసుల విష్ణు స్తుతి (వాంచితార్థ ప్రదం)

ప్రచేతసుల విష్ణు స్తుతి (వాంచితార్థ ప్రదం)

1

సరసీరుహంబు లెసకం బెసఁగన్ ముకుళించి గద్గద
స్వములఁజేసి యిట్లనిరి ర్వశరణ్యు నగణ్యు నిందిరా
రు నజితున్ గుణాఢ్యు ననద్యచరిత్రుఁ బవిత్రు నచ్యుతుం
రుఁ బరమేశు నీశు భవబంధవిమోచనుఁ బద్మలోచనున్.

2

"కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు;
గురుసన్మనో వాగగోచరుఁడవు
నిద్ధమనోరథ హేతుభూతోదార;
గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవస్థితి విలయార్థధృతనిత్య;
విపులమాయాగుణ విగ్రహుఁడవు
హితాఖిలేంద్రియ మార్గ నిరధిగత;
మార్గుఁడ వతిశాంత మానసుఁడవు


విలి సంసార హారి మేస్కుఁ డవును
దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
ర్వభూత నివాసివి ర్వసాక్షి
వైన నీకు నమస్కారయ్య! కృష్ణ!

3

మఱియును.

4

తోరుహోదరాయ భవదుఃఖహరాయ నమో నమః పరే
శా సరోజకేసర పిఙ్గ వినిర్మల దివ్య భర్మ వ
స్త్రా పయోజ సన్నిభ పదాయ సరోరుహ మాలికాయ కృ
ష్ణా పరాపరాయ సుగుణాయ సురారిహరాయ వేధసే.

5

అని వినుతించి.

6

"లదళాక్ష! దుఃఖలయ కారణమై తగు తావకీన రూ
ము ననివార్య దుర్భర విద్దశ దుఃఖము నొందు మాకు నీ
సుహిత సత్కృపా గరిమఁ జూపుట కంటె ననుగ్రహంబు లో
మునఁ దలంప నొండొకటి ల్గునె? భక్తఫలప్రదాయకా!

7

భూరిశివేతరాపహవిభూతి సమేత! మహాత్మ! దీనర
క్షాతి నొప్పు నీవు చిరకాలమునన్ సుఖవృత్తి వీరు మా
వా లటంచు బుద్ధి ననద్య! తలంచిన యంతమాత్ర స
త్కామె చాలు నట్లగుట గా కిటు సన్నిధి వైతి వీశ్వరా!

8

యఁగ క్షుద్రభూత హృదయంబుల యందుల నంతరాత్మవై
తిముగ నుండు నీవు భవదీయ పదాంబురుహద్వయార్చనా
మతు లైన మాకును శుప్రద భూరి మనోరథంబు లీ
రుదుగ నీవె! భక్తహృదప్రమదప్రద! ముక్తినాయకా!

9

యినను విను సరోజాయత లోచన;
ర మోక్ష మార్గ ప్రర్తకుఁడవుఁ;
బురుషార్థ భూత విస్తరుఁడవు నగు నీవు;
గిలి ప్రసన్నుఁ డగుట మాకు
ర్థి మనోభీష్ట మైన వరం బయ్యె;
నైనను నాథ! పరాపరుండ
వైన నిన్నొక వరం ర్థింతు మనినను;
భువిఁ దావకీన విభూతు లెన్న


నంత మెఱుఁగంగ రామి ననంతుఁ డనుచుఁ
లుకుదురు; నిన్ను నది గానఁ రమపురుష!
యే వరం బని కోరుదు మేము? దప్పి
గొన్న బాలకుఁ డబ్ధి నీ ళ్ళెన్ని గ్రోలు?

10

ఇదియునుం గాక.

11

పూని భవత్పదాంబురుహ మూల నివాసులమైన మేము మే
ధానిధి! నీ విలోకనముఁ క్కఁగ నన్యముఁ గోర నేర్తుమే?
మానిత పారిజాత కుసుస్ఫుట నవ్యమరందలుబ్ధ శో
భాయశాలి యైన మధుపంబు భజించునె యన్యపుష్పముల్?

12

రి భవదీయ మాయ ననయంబును జెందిన నేము నిచ్చలుం
మనురక్తి నేది తుదగా భవకర్ములమై ధరిత్రి పైఁ
దిరుగుదు, మంతదాఁక భవదీయజనంబులతోడి సంగతిన్
గురుమతి జన్మజన్మములకున్ సమకూరఁగ జేయు మాధవా!

13

లాధీశ్వర! తావకీన వరభక్తవ్రాత సంసర్గ లే
ముతోడన్ సరిగాఁ దలంప; మెలమిన్ స్వర్గాపవర్గాది సౌ
ఖ్యములన్నన్ వినుమానుషంబు లగు నీ కామంబులం జెప్ప నే
; మునీంద్రస్తుత పాదపద్మ! సుజనాలాపాను మోదాత్మకా!

14

మఱియు భగవద్భక్త సంగంబుల యందుఁ దృష్ణాప్రశమనంబులైన మృష్ట కథలు చెప్పఁబడుటచే భూతంబుల యందు వైరంబును నుద్వేగంబును లేకుండు నని.

15

ముల ముక్తసంగు లగువారు నుతింపఁ దనర్తు వీవు; గా
వు నిలఁ బుణ్యతీర్థములఁ బోలఁ బవిత్రము చేయఁ బూని య
ర్థినిఁ బదచారులై ధరఁ జరించు భవత్పద భక్త సంగమం
నుపమ భూరి సంసృతి భస్థుని బుద్ధి రుచింపకుండునే?

16

కావున.

17

రుహపత్రలోచన! భత్సఖుఁడైన సుధాంశుమౌళితో
డి నిమిషమాత్ర సంగతిఁ గడింది వ్రణంబును దుశ్చికిత్సము
న్ననఁ దగు జన్మరోగమున ర్మిలి వైద్యుఁడ వైన నిన్ను నే
యముఁ జూడఁ గంటిమి; కృతార్థులమై తగ మంటి మీశ్వరా!

18

దేవా! మదీయ స్వాధ్యాయాధ్యయనంబులును, గురు ప్రసాదంబును, విప్రవృద్ధానువర్తనంబును, నార్యజననమస్కరణంబును, సర్వభూతా నసూయయు, నన్న విరహితంబుగా ననేక కాలం బుదకంబుల యందు సుతప్తంబయిన తపంబు చేయుటయు, నివి యన్నియును బురాణ పురుషుండ వైన భవదీయ పరితోషంబు కొఱకు నగుంగాక యని విన్నవించెదము;" అని వెండియు నిట్లనిరి.

19

ను పద్మాసన ధూర్జటిప్రముఖ ధీమంతుల్ తపోజ్ఞాన స
త్త్వనిరూఢిం దగువారు నీ మహిమమున్ ర్ణింపఁ బారం బెఱుం
నివా రయ్యును నోపినంత వినుతుల్ గావింతు; రట్లౌట నే
మును నిన్నర్థి నుతింతు మీశ! వరదా! బుద్ధ్యాదిమూలంబుగన్."

20

అని మఱియు "సముండవు నాదిపురుషుండవుఁ బరుండవు శుద్ధుండవు వాసుదేవుండవు సత్త్వమూర్తివియు భగవంతుండవు నైన నీకు నమస్కరించెదము;" అని యిట్లు ప్రచేతసులచేత నుతింపంబడి శరణ్యవత్సలుండగు హరి సంతుష్టాంతరంగుండై వారల కోరిన యట్ల వరంబు లిచ్చిన.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత చతుర్థ స్కంధములోని ప్రచేతసుల విష్ణు స్తుతి అను స్తుతి