స్తుతులు స్తోత్రాలు : పితృజన స్తుతి (క్షేమ కరం)
పితృజన స్తుతి (క్షేమ కరం)
అరయ నాచార్యుండు పరతత్త్వరూపంబు;
దండ్రి దలంపఁగ ధాతరూపు;
రూపింప భ్రాత మరుత్పతి రూపంబు;
దెలియంగఁ దల్లి భూదేవిరూపు;
భగిని కరుణరూపు; భావంబు ధర్మ స్వ;
రూపంబు దా నర్థిరూపు మొదల
నభ్యాగతుఁడు మున్న యగ్ని దేవునిరూపు;
సర్వభూతములుఁ గేశవుని రూపు;
గాన తండ్రి వేగ కడు నార్తులగు పితృ
జనులమైన మమ్ముఁ జల్లఁ జూచి
పరభయంబు వాపి నిరుపమం బగు తపో
మహిమచేత మెఱసి మనుపవయ్య!
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత షష్ఠ స్కంధములోని పితృజన స్తుతి అను స్తుతి