పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : పృథ్వి చేసిన కృష్ణ స్తుతి (అభయ ప్రదం)

పృథ్వి చేసిన కృష్ణ స్తుతి (అభయ ప్రదం)

1

"అంభోజనాభున కంభోజనేత్రున;
కంభోజమాలాసన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసు;
దేవునకును దేవదేవునకును
క్తులు గోరినభంగి నే రూపైనఁ;
బొందువానికి నాదిపురుషునకును
ఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ;
యినవానికిఁ, బరమాత్మునకును,


ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి,
నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప
రాపరాత్మ మహిత! మితచరిత!

2

దేవా! నీవు లోకంబుల సృజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్త్వగుణంబును, సంహరించుటకుఁ దమోగుణంబును ధరియింతువు; కాలమూర్తివి, ప్రధానపూరుషుండవు, పరుండవు, నీవ; నేనును, వారియు, ననిలుండు, వహ్నియు, నాకాశంబుఁ, భూతతన్మాత్రలును, నింద్రియంబులును, దేవతలును, మనంబును, గర్తయును, మహత్తత్త్వంబును, జరాచరంబైన విశ్వంబును, నద్వితీయుండవైన నీ యంద సంభవింతుము.

3

నిటు సూడుమా! నరకదైత్యుని బిడ్డఁడు వీఁడు; నీ దెసన్
ముననున్నవాఁడు; గడుబాలుఁ; డనన్యశరణ్యుఁ; డార్తుఁ; డా
శ్రరహితుండు; దండ్రి క్రియ శౌర్యము నేరఁడు; నీ పదాంబుజ
ద్వయిఁ బొడఁగాంచె భక్తపరతంత్ర! సువీక్షణ! దీనరక్షణా! "

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - ఉత్తర స్కంధములోని పృథ్వి చేసిన కృష్ణ స్తుతి అను స్తుతి