పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : నారాయణఋషికృత స్తుతి (జయ కరం)

నారాయణఋషికృత స్తుతి (జయ కరం)

1

వ వికచ సరసిరుహ యనయుగ! నిజచరణ;
నచరనది జనిత! నిమవినుత!
లధిసుత కుచకలశ లిత మృగమద రుచిర;
రిమళిత నిజహృదయ! రణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ! ;
టిఘటిత రుచిరతర నకవసన!
భుగరిపు వరగమన! తగిరిపతివినుత! ;
తతజపరత! నియమరణి చరిత!


తిమి కమఠ కిటి నృహరి ముదిత! బలి నిహి
పద! పరశుధర! దశవన విదళన!
మురదమన! కలికలుష సుముదపహరణ!
రివరద! ముని నర సుర రుడ వినుత!

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ఏకాదశ స్కంధములోని నారాయణఋషికృత స్తుతి అను స్తుతి