పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : మునివరుల కృష్ణ స్తుతి (సర్వాభీష్టప్రదం)

1

"జములు నిను సేవింపని
దిములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
నువులు నిలుకడ గావఁట
ములలో నున్ననైన నరుహనాభా!

2

ణంబులు భవజలధికి
ణంబులు దురితలతల కాగమముల కా
ణంబు లార్తజనులకు
ణంబులు, నీదు దివ్యరణంబు లిలన్‌.

3

క్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై
పెక్కురూపులు దాల్తు నీ దగు పెంపు మాకు నుతింపఁగా
క్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!

4

శ్రీనాయక! నీ నామము
నానాభవరోగకర్మనాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
కారు దుష్టాత్ము లకట! కంజదళాక్షా! "

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ఏకాదశ స్కంధములోని మునివరుల కృష్ణ స్తుతి అను స్తుతి