పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : కుంతి స్తుతి (ఆపద హరం)

కుంతి స్తుతి (ఆపద హరం)

1

"పురుషుం, డాఢ్యుఁడు, ప్రకృతికిఁ
రుఁ, డవ్యయుఁ, డఖిలభూత హిరంతర్భా
సురుఁడును, లోకనియంతయుఁ,
మేశ్వరుఁడైన నీకుఁ బ్రణతులగు హరీ!

2

మఱియు జవనిక మఱుపున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచేఁ బరమహంసలు నివృత్తరాగద్వేషులు నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండ వయి పరిచ్ఛిన్నుండవు గాని, నీవు మూఢదృక్కులుఁ గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశచరణ! హృషీకేశ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము.

3

నయులతోడ నే హ్యమానంబగు;
తుగృహంబందునుఁ జావకుండఁ
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల;
మారుతపుత్త్రుండు డియకుండ
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ;
ద్రౌపదిమానంబు లఁగకుండ
గాంగేయ కుంభజ ర్ణాది ఘనులచే;
నా బిడ్డ లనిలోన లఁగకుండ


విరటుపుత్త్రిక కడుపులో వెలయు చూలు
ద్రోణనందను శరవహ్నిఁ ద్రుంగకుండ
ఱియు రక్షించితివి పెక్కుమార్గములను
నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష!

4

ల్లిదుం డగు కంసుచేతను బాధ నొందుచు నున్న మీ
ల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రులచేత నేఁ
ల్లడంబునఁ జిక్కకుండఁగఁ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన, జగత్పతీ!

5

నము, నైశ్వర్యంబును,
మును, విద్యయునుఁ, గల మచ్ఛన్ను లకిం
గోచరుఁడగు నిన్నున్
వినుతింపఁగ లేరు, నిఖిలవిబుధస్తుత్యా!

6

మఱియు భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, నాత్మారాముండును, రాగాదిరహితుండునుఁ, గైవల్యదాన సమర్థుండునుఁ, గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహకరుండును నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము; మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు నీకుం బ్రియాప్రియులు లేరు జన్మకర్మశూన్యుండ వయిన నీవు తిర్యగాదిజీవుల యందు వరాహాది రూపంబులను మనుష్యు లందు రామాది రూపంబులను ఋషుల యందు వామనాది రూపంబులను జలచరంబుల యందు మత్స్యాది రూపంబులను నవతరించుట లోకవిడంబనార్థంబు గాని జన్మకర్మసహితుం డవగుటం గాదు.

7

కోముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రారిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం
బాపఁడవై నటించుట కృపాపర! నా మదిఁ జోద్య మయ్యెడిన్.

8

యమునఁ జందనము క్రియ
వెయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
యిపై నభవుఁడు హరి యదు
కుమున నుదయించె నండ్రు గొంద, ఱనంతా!

9

సుదేవదేవకులు తా
గతి గతభవమునందుఁ బ్రార్థించిన సం
మునఁ బుత్త్రత నొందితి
సురుల మృతి కంచుఁ గొంద ఱండ్రు, మహాత్మా!

10

రాశి నడుమ మునిగెఁడు
ము క్రియన్ భూరిభారర్శితయగు నీ
యిలఁ గావ నజుఁడు గోరినఁ
లిగితి వని కొంద ఱండ్రు, ణనాతీతా!

11

ఱచి యజ్ఞాన కామ కర్మములఁ దిరుగు
వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ
శ్రవణ చింతన వందనార్చనము లిచ్చు
కొఱకు నుదయించి తండ్రు నిన్ గొంద ఱభవ!

12

నినుఁ జింతించుచుఁ బాడుచుం బొగడుచున్ నీ దివ్యచారిత్రముల్
వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే
దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా
గ్వినుతంబైన భవత్ప దాబ్జయుగమున్ విశ్వేశ! విశ్వంభరా!

13

దేవా! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందంబు లాశ్రయించి నీ వారల మైన మమ్ము విడిచి విచ్చేయ నేల, నీ సకరుణావలోకనంబుల నిత్యంబునుఁ జూడవేని యాదవసహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల చందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు; కల్యాణ లక్షణ లక్షితంబులయిన నీ యడుగులచేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబుగాదు; నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు గుసుమ ఫలభరితంబులై యోషధి తరు లతా గుల్మ నద నదీ సమేతంబులై యుండు.

14

యావు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యారవృత్తితోఁ గదియుట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!

15

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ప్రథమ స్కంధములోని కుంతి స్తుతి అను స్తుతి