పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : కశ్యపుని రుద్ర స్తోత్తం (దుఃఖ హరం)

కశ్యపుని రుద్ర స్తోత్తం (దుఃఖ హరం)

1

విందానన! వీఁడె నీ మఱఁది లీలాటోపరుద్రక్షమా
ఝంఝానిలధూతపాంసుపటలచ్ఛన్నుండు ధూమ్రైకదు
ర్భవిద్యోతితకీర్ణభీషణజటాద్ధుండు భస్మావలి
ప్తరుచిస్ఫారసువర్ణవర్ణుఁ డగుచున్ భాసిల్లు నత్యుగ్రుఁ డై.

2

ల సుధాకర రవి లో
ముల వికసింపఁ జేసి మధికరోషం
బునఁజూచుచున్నవాఁ డదె
నితా! బంధుత్వ మరయ లవదు సుమ్మీ.

3

నికిఁ దలపోయ హితా
హితులును సమ్మాన్యులును విహీనులు నతిగ
ర్హితులును లే రీశుఁడు సమ
తియును నిఖిలైకభూతయుఁ డై యుండన్.

4

కావున, మద్భ్రాత భవ
ద్దేరుఁ డని తరుణి! నీ మదింజూడకుమా
దేవాదిదేవుఁ ద్రిజగ
త్పాను నిఖిలైకనేత గవంతు హరున్.

5

ఏమును సత్పురుషులైన విజ్ఞానవంతులును భుక్తభోగంబై దురతోన్యస్తం బైన పుష్పమాలికయునుం బోలె నమ్మహాత్ముని చరణారవింద వందనాభిలాషిణి యైన యవిద్యాదేవి ననుసరించి వర్తింతు; మదియునుంగాక.

6

వ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాల;
రు లాత్మపద వైభములఁ దనరి
రెవ్వని యాజ్ఞ వహించి వర్తించును;
విశ్వనేత్రి యగు నవిద్య యెపుఁడు
నెవ్వని మహిమంబు లిట్టివట్టివి యని;
ర్కింప లేవు వేదంబు లయిన
నెవ్వని సేవింతు రెల్ల వారును సమా;
నాధికరహితుఁ డై లరు నెవ్వఁ


ట్టి దేవునిఁద్రిపురసంహారకరుని
స్థిమాలాధరుండు బిక్షాశనుండు
భూతిలిప్తాంగుఁ డుగ్రపరేభూమి
వాసుఁ డని హాస్య మొనరించు వారు మఱియు.

7

శునకభోగ్యమును నిహ
దూరము నైన తనువు పాథేయముగా
నెఱినమ్మి వస్త్ర మాల్యా
ణంబు లలంకరించు పామర జనులన్

8

నిర్భాగ్యులుగా మదిఁ
ను"మని యీరీతిఁ బ్రియకుఁ శ్యపుఁ డెఱిగిం
చిదితి గ్రమ్మఱఁ బలికెను
సిజసాయకవిభిన్నమానస యగుచున్.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత తృతీయ స్కంధములోని కశ్యపుని రుద్ర స్తోత్తం అను స్తుతి