పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ద్వారకావాసుల స్తుతి (ఆత్మార్పణం)

ద్వారకావాసుల స్తుతి (ఆత్మార్పణం)

1

"నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం
తాధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా, ప్రసన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ ర్ణింప బ్రహ్మాదులున్.

2

న్నారము సౌఖ్యంబున
విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్
న్నారము ధనికులమై
న్నారము తావకాంఘ్రిమలములు హరీ!

3

రాటము మది నెఱుఁగము
పోరాటము లిండ్లకడలఁ బుట్టవు పురిలోఁ
జోరాటన మెగయదు నీ
దూరాటన మోర్వలేము తోయజనేత్రా!

4

తండ్రుల కెల్లఁ దండ్రియగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా
తండ్రివిఁ దల్లివిం బతివి దైవమవున్ సఖివిన్ గురుండ; వే
తండ్రులు నీ క్రియం బ్రజల న్యులఁ జేసిరి, వేల్పు లైన నో
తండ్రి భవన్ముఖాంబుజము న్యతఁ గానరు మా విధంబునన్.

5

చెచ్చెరఁ గరినగరికి నీ
విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ
వెచ్చోటికి విచ్చేయక
చ్చికతో నుండుమయ్య మా నగరమునన్.

6

అంధకారవైరి పరాద్రి కవ్వలఁ
నిన నంధమయిన గముభంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల గుదు మయ్య."

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ప్రథమ స్కంధములోని ద్వారకావాసుల స్తుతి అను స్తుతి