పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : దితి రుద్ర స్తుతి (సంతాన ప్రదం)

దితి రుద్ర స్తుతి (సంతాన ప్రదం)

1

కశ్యపు గనుంగొని యిట్లనియె "సమస్తభూతపతి యైన పరమేశ్వరుండు నా చేసిన యపరాధంబు సహించి మద్గర్భ పరిపాలనంబు సేయుంగాక; రుద్రుండును, మహాత్ముండును, స్వయంప్రకాశుండును, నలఘ్యుండును, సకామజన ఫలప్రాపకుండును, దుష్టశిక్షకుండును, బరమాత్ముండును, జగదంతర్యామియు, నిర్గుణుడును, నిష్కాముండును, భక్తసులభుండును, భగవంతుండును నగు నప్పరమేశ్వరునకు నమస్కరించెద; మఱియు, షడ్గుణైశ్వర్య సంపన్నుండును, జగద్భర్తయు, మహానుగ్రహశీలుండును, నిర్దయాపరిపాల్యవధూ రక్షకుండును, సతీదేవిపతియు నైన యా పరమేశ్వరుండు నన్ను రక్షించుగాత" మని సన్నుతించి.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత తృతీయ స్కంధములోని దితి రుద్ర స్తుతి అను స్తుతి