పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ధరాధిపుల కృష్ణ స్తుతి (కామ్యార్థ సిద్ధి)

ధరాధిపుల కృష్ణ స్తుతి (కామ్యార్థ సిద్ధి)

1

"వారిజనాభ! భక్త జనత్సల! దుష్టమదాసురేంద్ర సం
హా! సరోరుహాసన పురారి ముఖామరవంద్య పాదపం
కేరుహ! సర్వలోకపరికీర్తిత దివ్యమహాప్రభావ! సం
సావిదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా!

2

ర్త జనుల మమ్ము రసి రక్షింపు మ
హాత్మ! భక్తజనభయాపహరణ!
నిన్ను మది నుతించి నీకు మ్రొక్కెదము నీ
రణయుగము మాకు రణ మనఘ!

3

లియుర దండింపఁగ దు
ర్బలులను రక్షింప జగతిపై నిజలీలా
లితుఁడవై యుగయుగమున
వడ నుదయింతు కాదె? భవ! యనంతా!

4

నీదిఁ దోఁపని యర్థం
బీ మేదిని యందుఁ గలదె యీశ్వర! భక్త
స్తోసురభూజ! త్రిజగ
త్క్షేమంకర! దీనరక్ష సేయు మురారీ!

5

నీ పంపు సేయకుండఁగ
నా ద్మభవాదిసురులకైనను వశమే?
శ్రీతి! శరణాగతులం
జేట్టి నిరోధ ముడుగఁ జేయుము కృష్ణా!

6

వుఁ డవయ్యును జగతిం
బ్రవించుట లీల గాక వమందుటయే
ప్రభువులకుం బ్రభుఁడవు మము
యాత్ముల నరసి కావఁ ను నార్తిహరా!

7

నమున నీ భుజావలి
కెదిరింపఁగ లేక పాఱఁడే విక్రమ సం
సెడఁగ జరాసంధుఁడు
దునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్.

8

ఇట్లు తనపడిన బన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందంబున మమ్ముం జెఱపట్టి బాధించుచున్న యప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు మా నిర్బంధంబులు వాపి, సుత దార మిత్ర వర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ము రక్షింపు"మని విన్నవించి రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - ఉత్తర స్కంధములోని ధరాధిపుల కృష్ణ స్తుతి అను స్తుతి