పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : దేవకి చేసిన భగవంతుని స్తుతి (కడుపు చలువ)

దేవకి చేసిన భగవంతుని స్తుతి (కడుపు చలువ)

1

"ట్టిట్టి దనరానిదై మొదలై నిండు;
కొన్నదై వెలుఁగుచు గుణములేని
దై యొక్క చందంబుదై కలదై నిర్వి;
శేషమై క్రియలేక చెప్పరాని
దేరూపమని శ్రుతు లెప్పుడు నొడివెడి;
యా రూప మగుచు నధ్యాత్మదీప
మై బ్రహ్మ రెండవ ర్థంబు తుది జగం;
బులు నశింపఁగఁ బెద్దభూతగణము


సూక్ష్మభూతమందుఁ జొరగఁ నా భూతంబు
ప్రకృతిలోనఁ జొరఁగఁ బ్రకృతి పోయి
వ్యక్తమందుఁ జొరఁగ వ్యక్త మడంగను
శేషసంజ్ఞ నీవు చెలువ మగుదు.

2

విశ్వము లీల ద్రిప్పుచు నవిద్యకు జుట్టమ వైన నీకు దా
శాశ్వతమైన కాలమిది ర్వము వేడబమందు; రట్టి వి
శ్వేశ్వర! మేలుకుప్ప! నిను నెవ్వఁడుఁ గోరి భజించు వాడె పో
శాశ్వతలక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుం డభయుండు మాధవా!

3

ఒంటి నిల్చి పురాణయోగులు యోగమార్గనిరూఢులై
"కంటి"మందురు గాని, నిక్కము గాన; రీ భవదాకృతిం
గంటి భద్రముఁ గంటి; మాంసపుఁ న్నులం గనబోల; దీ
తొంటిరూపుఁ దొలంగఁ బెట్టుము తోయజేక్షణ! మ్రొక్కెదన్.

4

విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద
డుపులోన దాఁచు డిమి మేటి
టుఁడ వీవు; నేఁడు నా గర్భజుఁడ వౌట
రమపురుష! వేడబంబు గాదె?

5

ళినలోచన! నీవు నిక్కము నాకుఁ బుట్టెద వంచు నీ
లుఁడు కంసుఁడు పెద్దకాలము కారయింట నడంచె; దు
ర్మలినచిత్తుని నాజ్ఞజేయుము; మ్ముఁ గావుము భీతులన్;
నులుసు లేక ఫలించె నోచిన నోము లెల్లను నీవయై."

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - పూర్వ స్కంధములోని దేవకి చేసిన భగవంతుని స్తుతి అను స్తుతి