పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : చాణూరకృత కృష్ణ నిందా స్తుతి (వేదనా హరం)

చాణూరకృత కృష్ణ నిందా స్తుతి (వేదనా హరం)

1

లమున నను డాసి లరాశిఁ జొరరాదు;
నిగిడి గోత్రముదండ నిలువరాదు;
కేడించి కుంభిని క్రిందికిఁ బోరాదు;
నుజసింహుఁడ నని లయరాదు;
చేరినఁ బడవైతుఁ జెయి చాపఁగారాదు;
బెరసి నా ముందటఁ బెరుఁగరాదు;
భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి;
శోధింతుఁ గానలఁ జొరఁగరాదు;


ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు;
రఁ బ్రబుద్ధుఁడ నని ఱుమరాదు;
లికితనము చూపి ర్వింపఁగారాదు;
రముగాదు; కృష్ణ! లఁగు తలఁగు.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - పూర్వ స్కంధములోని చాణూరకృత కృష్ణ నిందా స్తుతి అను స్తుతి