పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మకృత గర్భస్థ వామన స్తోత్రం (ఆపద విమోచనము)

బ్రహ్మకృత గర్భస్థ వామన స్తోత్రం (ఆపద విమోచనము)

1

త్రిభువన జయరూఢ! దేవ! త్రివిక్రమ! ;
పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ!;
ప్రీత! త్రినాభ! త్రిపృష్ఠ! జగంబుల;
కాద్యంత మధ్యంబు రయ నీవ;
జంగమ స్థావర ననాది హేతువు;
నీవ; కాలంబవై నిఖిల మాత్మ
లోపల ధరియింతు లోని జంతుల నెల్ల;
స్రోతంబులోఁ గొను చొప్పు దోఁప;


బ్రహ్మలకు నెల్ల సంభవ వన మీవ;
దివమునకుఁ బాసి దుర్దశ దిక్కులేక
శోకవార్ధి మునింగిన సురలకెల్లఁ
దేల నాధార మగుచున్న తెప్ప నీవ.

2

విచ్చేయు మదితి గర్భము
చెచ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్
విచ్చలవిడి లే కమరులు
ముచ్చటపడి యున్నవారు ముద మందింపన్. "

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత అష్టమ స్కంధములోని బ్రహ్మకృత గర్భస్థ వామన స్తోత్రం అను స్తుతి