పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మదేవుని విష్ణు స్తుతి (క్లేశ హరం)

బ్రహ్మదేవుని విష్ణు స్తుతి (క్లేశ హరం)

1

నఘ! సర్వేశ్వరు నాద్యంతశూన్యుని;
న్యుని జగదేకమాన్యచరితుఁ
న్నాభిసరసిజోద్భవసరోజంబును;
ప్పుల ననిలుని నంబరమును
మానిత భువననిర్మాణదృష్టినిఁ బొడ;
నెఁ గాని యితరముఁ గానలేక
యాత్మీయకర్మబీజాంకురంబును రజో;
గుణయుక్తుఁ డగుచు నకుంఠితప్ర


జాభిసర్గాభిముఖత నవ్యక్తమార్గుఁ
డైన హరి యందుఁ దన హృదయంబుఁ జేర్చి
మ్మహాత్మునిఁ బరము ననంతు నభవు
జు నమేయుని నిట్లని భినుతించె.

2

"లినాక్ష మాయాగువ్యతికరమునఁ;
జేసి కార్యంబైన సృష్టిరూప
మునఁ బ్రకాశించు నీ రూపవిభవంబు;
రూపింప దేహధారులకు దుర్వి
భావ్యంబుఁదలపోయ గవంతుఁడవునైన;
ద్మాక్ష నీ స్వరూపంబుకంటె
న్యమొక్కటి సత్యమై బోధకంబైన;
ది లేదుగాన నీ తులదివ్య


మైన రూపంబు నాకుఁ బ్రత్యక్ష మయ్యె
దియుఁగాక వివేకోదమునఁ జేసి
ద! నీ రూప మజ్ఞాన గురుతమో ని
వారకం బయ్యె నాకు శశ్వత్ప్రదీప!

3

సత్పురుషానుగ్రహ
ముకై యమితావతార మూలం బగుచుం
రెడి నీ రూపము శో
మగు భవదీయ నాభిద్మమువలనన్.

4

నం బందిన నాచే
యము మొదలనె గృహీతయ్యె జగత్పా
నీదు సుస్వరూపము
రుచిరంబై స్వయంప్రకాశక మగుటన్.

5

మఱియు, జ్ఞానానంద పరిపూర్ణమాత్రంబును, ననావృత ప్రకాశంబును, భేదరహితంబునుఁ, బ్రపంచజనకంబును, ప్రపంచవిలక్షణంబును, భూతేంద్రియాత్మకంబును, నేకంబును నైన రూపంబు నొందియు నెందునుఁ బొడగాన నట్టి నిన్ను నాశ్రయించెద; అదియునుంగాక జగన్మంగళ స్వరూపధరుండవై నీ యుపాసకుల మైన మా మంగళంబుకొఱకు నిరంతర ధ్యానంబుచేత నీ దివ్యరూపంబునం గానంబడితివి; ఇట్టి నీవు నిరయభాక్కు లై నిరీశ్వరవాదంబునంజేసి కుతర్కంబులు ప్రసంగించు భాగ్యరహితులచేత నాదృతుండవు గావు; మఱియుం గొందఱు కృతార్థు లైన మహాత్ములచేత భవదీయ శ్రీచరణారవిందకోశగంధంబు వేదమారుతానీతం బగుటంజేసి తమతమ కర్ణకుహరంబులచేత నాఘ్రాణించుచుందురు వారల హృదయకమలంబుల యందు భక్తిపారతంత్ర్యంబున గృహీత పాదారవిందంబులు గలిగి ప్రకాశింతువు; అదియునుం గాక ప్రాణులకు ద్రవ్యాగార సుహృన్నిమిత్తం బయిన భయంబునుఁ దన్నాశనిమిత్తం బయిన శోకంబును ద్రవ్యాది స్పృహయునుం దన్నిమిత్తం బయిన పరిభవంబును, మఱియు నందుఁ దృష్ణయు, నది ప్రయాసంబున లబ్ధం బైన నార్తిమూలం బగు తదీయం బైన వృథాగ్రహంబును, నీ శ్రీపాదారవిందంబు లందు వైముఖ్యం బెంత కాలంబు గలుగు నంతకాలంబు ప్రాప్తంబు లగుం గాని, మానవాత్మనాయకుండ వగు నిన్ను నాశ్ర యించిన భయనివృత్తిహేతు వైన మోక్షంబు గలుగు; మఱియునుం గొందఱు సకలపాపనివర్తకం బయిన త్వదీయ నామస్మరణ కీర్తనంబు లందు విముఖులై కామ్యకర్మ ప్రావీణ్యంబునంజేసి నష్టమతు లై యింద్రియపరతంత్రు లై యమంగళంబు లైన కార్యంబులు సేయుచుందురు; దానంజేసి వాతాది త్రిధాతుమూలం బైన క్షుత్తృడాది దుఃఖంబులచేతను శీతోష్ణ వర్ష వాతాది దుఃఖంబులచేతను నతి దీర్ఘం బైన కామాగ్నిచేతను నవిచ్ఛన్నం బగు క్రోధంబుచేతనుం దప్యమానులగుదురు వారలఁ గనిన నా చిత్తంబు గలంకం బొందు; జీవుండు భవదీయ మాయాపరిభ్రామ్యమాణుం డై యాత్మ వేఱని యెప్పడు దెలియు నంతకాలంబు నిరర్థకంబై దుస్తరంబైన సంసారసాగరంబుఁ దరియింపఁ జాలకుండు; సన్మునీంద్రు లైనను భవదీయ నామస్మరణంబు మఱచి యితర విషయాసక్తు లైరేని, వారలు దివంబు లందు వృథాప్రయత్ను లై సంచరించుచు రాత్రుల యందు నిద్రాసక్తు లై, స్వప్న గోచరంబు లయిన బహువిధ సంపదలకు నానందించుచు శరీరపరిణామాది పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబు లైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు; నిష్కాము లై నిన్ను భజియించు సత్పురుషుల కర్ణమార్గంబులం బ్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోధితం బైన హృత్సరోజకర్ణికాపీఠంబున వసియింతువు; అదియునుంగాక.

6

యోగీంద్రులు యోగమార్గముల భావంబందు నే నీ మనో
రూపంబుఁ దలంచి యే గుణగణధ్యానంబు గావింతు ర
ప్పురుషశ్రేష్ఠ పరిగ్రహంబునకునై పొల్పారఁ దద్ధ్యాన గో
మూర్తిన్ ధరియింతుఁ గాదె పరమోత్సాహుండవై మాధవా!

7

రయ నిష్కామధర్ము లైట్టి భక్తు
లందు నీవు ప్రసన్నుండ వైనరీతి
హృదయముల బద్ధకాములై యెనయు దేవ
ణము లందుఁ బ్రసన్నతఁ లుగ వీవు.

8

య సమస్త జీవహృదయంబుల యందు వసించి యేకమై
రఁగి సుహృత్క్రియానుగుణభాసిత ధర్ముఁడవుం బరాపరే
శ్వరుఁడవునై తనర్చుచు నజ్జన దుర్లభమైన యట్టి సు
స్థి మగు సర్వభూతదయచేఁ బొడగానఁగవత్తు వచ్యుతా!

9

క్రతు దానోగ్రత పస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల
వ్రచర్యాదుల నాదరింప వఖిలవ్యాపారపారాయణ
స్థితి నొప్పారెడి పాదపద్మయుగళీసేవాభి పూజా సమ
ర్పి ధర్ముండగు వాని భంగి నసురారీ! దేవచూడామణీ!

10

విలి శశ్వత్స్వరూప చైన్య భూరి
హిమచేత నపాస్త సస్త భేద
మోహుఁడ వఖిల విజ్ఞానమునకు నాశ్ర
యుండ వగు నీకు మ్రొక్కెదనో రమేశ!

11

నస్థితివిలయంబుల
యంబును హేతుభూతగు మాయాలీ
ను జెంది నటన సలిపెడు
ఘాత్మక! నీకొనర్తు భివందనముల్

12

నఘాత్మ! మఱి భవవతార గుణకర్మ;
న విడంబన హేతుకంబు లయిన
మణీయ మగు దాశథి వసుదేవకు;
మారాది దివ్యనామంబు లోలి
వెలయంగ మనుజులు వివశాత్ములై యవ;
సానకాలంబున సంస్మరించి
న్మజన్మాంతర సంచిత దురితంబుఁ;
బాసి కైవల్యసంప్రాప్తు లగుదు


ట్టి దివ్యావతారంబు వతరించు
జుఁడ వగు నీకు మ్రొక్కెద నఘచరిత!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
క్తమందార! దుర్భవయవిదూర!

13

నవృద్ధివినాశ హేతుక సంగతిం గల యేను నీ
వును హరుండు ద్రిశాఖలై మనువుల్ మరీచిముఖామరుల్
ర నందుపశాఖలై చెలువొంద నింతకు మూలమై
యమున్ భువనద్రుమాకృతివైన నీకిదె మ్రొక్కెదన్.

14

పురుషాధీశ! భవత్పదాబ్జయుగళీపూజాది కర్మక్రియా
తం జెందని మూఢచిత్తునిఁ బశుప్రాయున్ మనుష్యాధమున్
యున్ నాశము నొందఁ జేయు నతి దక్షంబైన కాలంబు త
ద్గురు కాలాత్ముఁడ వైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్.

15

ర్వేశ! కల్పాంతసంస్థిత మగు జల;
జాత మం దేను సంనన మంది
వదీయ సుస్వరూముఁ జూడ నర్థించి;
హువత్సరములు దపంబుఁ జేసి
క్రతుకర్మములు పెక్కు గావించియును నినుఁ;
బొడగానఁగాలేక బుద్ధి భీతిఁ
బొందిన నాకు నిప్పుడును నిర్హేతుక;
రుణచే నఖిలలోకైకవంద్య


మాన సతత ప్రసన్న కోల ముఖాబ్జ
లిత భవదీయ దివ్యమంళవిలాస
మూర్తి దర్శింపఁ గలిగె భక్తార్తిహరణ
రణ! తుభ్యంనమో విశ్వరణ! దేవ!

16

మర తిర్యఙ్మనుష్యాది చేతన యోను;
లందు నాత్మేచ్ఛచేఁ జెందినట్టి
మనీయ శుభమూర్తి లవాడ వై ధర్మ;
సేతు వనంగఁ బ్రఖ్యాతి నొంది
విషయసుఖంబుల విడిచి సంతత నిజా;
నందానుభవ సమున్నతిఁ దనర్తు
దిగాన పురుషోత్తమాఖ్యఁ జెన్నొందుదు;
ట్టి నిన్నెప్పుడు భినుతింతు


ర్థి భవదీయపాదంబులాశ్రయింతు
హితభక్తిని నీకు నస్కరింతు
క్తజనపోష! పరితోష! రమపురుష!
ప్రవిమలాకార! సంసారయవిదూర!

17

లకొని పంచభూప్రవర్తకమైన;
భూరిమాయాగుణస్ఫురణఁ జిక్కు
డక లోకంబులు వదీయ జఠరంబు;
లో నిల్పి ఘనసమాలోల చటుల
ర్వంకషోర్మి భీణ వార్థి నడుమను;
ణిరాజభోగతల్పంబు నందు
యోగనిద్రారతి నుండగ నొకకొంత;
కాలంబు సనఁగ మేల్కనిన వేళ


లఘు భవదీయనాభితోజమువలనఁ
లిగి ముల్లోకములు సోపరణములుగఁ
బుట్టఁ జేసితి వతుల విభూతి మెఱసి
పుండరీకాక్ష! సంతతభువనరక్ష!

18

నిమస్తుత! లక్ష్మీపతి!
దంతర్యామి వగుచు ర్గము నెల్లం
గు భవదైశ్వర్యంబున
ణిత సౌఖ్యానుభవము నందింతు గదే.

19

లజాక్ష! యెట్టి విజ్ఞానబలంబునఁ;
ల్పింతు వఖిలలోకంబు లోలి
తజనప్రియుఁడవు నా కట్టి సుజ్ఞాన;
ర్థిమైఁ గృపసేయు య్య వరద!
సృష్టినిర్మాణేచ్ఛఁ జెంది నా చిత్తంబుఁ;
త్కర్మకౌశలిఁ గిలి యుండి
యునుఁ గర్మవైషమ్యమునుఁ బొందు కతమున;
దురితంబుఁ బొరయక తొలగు నట్టి


వెఱవు నా కెట్లు కలుగు నవ్విధముఁ దలచి
ర్మవర్తను నను భవత్కరుణ మెఱసి
గఁ గృతార్థునిఁ జేయవే నిమవినుత!
త్కృపామూర్తి! యో దేవక్రవర్తి!

20

దుదరప్రభూత మగు ద్మము నందు వసించి యున్న నే
విరళ తావకీన కలితాంశమునం దనరారు విశ్వముం
విలి రచించుచున్ బహువిధంబులఁ బల్కెడి వేదజాలముల్
శితరమై ఫలింపఁ గృపసేయుము భక్తఫలప్రదాయకా!"

21

ని యనుకంపదోఁప వినయంబునఁ జాఁగిలి మ్రొక్కి చారులో
సరసీరుహుం డగుచు ర్వజగత్పరికల్పనా రతిం
రిన నన్నుఁ బ్రోచుటకుఁ దా నిటు సన్నిధి యైన యీశ్వరుం
యము నాదు దుఃఖము దయామతిఁ బాపెడు నంచు నమ్రుడై

22

రుహసంజాతుఁడు నె
మ్మమున హర్షించె ననుచు" మైత్రేయమహా
ముని ఘనుఁడగు విదురునకున్
వియంబున నెఱుఁగజెప్పి వెండియుఁ బలికెన్.

23

"జాతప్రభవుండు కేవలతపోవ్యాసంగుఁ డై పద్మలో
ను గోవిందు ననంతు నాఢ్యుఁ దన వాక్ఛక్తిన్ నుతింపన్ సుధా
వంద్యుండు ప్రసన్నుఁ డై నిఖిల విశ్వస్థాపనాలోకనం
బునఁ జూచెన్ విలయప్రభూత బహువాఃపూరంబులన్ వ్రేల్మిడిన్.

24

ట్లు వొడగని యార్తుఁ డైట్టి పద్మ
వుని వాంఛిత మాత్మఁ దీర్పగఁ దలంచి
తని మోహనివారక మైన యట్టి
మృతరసతుల్య మధురవాక్యముల ననియె.

25

"కొని నీ యొనర్చు పనిప్పి మదిం దలపోయు దుఃఖముం
లఁగుము నాదు లీలకుఁ బ్రధానగుణం బగు సృష్టికల్పనం
వడఁ జేయు బుద్ధి హృదయంబునఁ జొన్పి తపస్సమాధి ని
ష్ఠ నతిభక్తులన్ ననుఁ బ్రన్నునిఁ జేయుము చెందు కోరికల్.

26

నీ వొనరించు తపోవి
ద్యావిభవ విలోకనీయ గు నీ సృష్టిం
గావింపుము లోకంబుల
లో వెఁలిగెడి నన్నుఁ గందు లోకస్తుత్యా!

27

నాలోని జీవకోటులు
వాలాయము నీకుఁ గానచ్చు నిపుడు నీ
వాలోకింపుము దారువి
లో హుతాశనునికరణి లోకస్తుత్యా!

28

లువొంద నఖిలజీవు యందుఁ గల నన్నుఁ;
దెలిసి సేవింపుము లినగర్భ!
వదీయ దోషముల్ వాయును భూతేంద్రి;
యాశ్రయ విరహిత మై విశుద్ధ
మైన జీవుని విమలాంతరాత్ముఁడ నైన;
ను నేకముగఁ జూచు రుఁడు మోక్ష
దమార్గవర్తి యై భాసిల్లు బ్రహ్మాండ;
మందును వివిధకర్మానురూప


ద్ధతులఁ జేసి పెక్కురూముల నొందు
జీవతతి రచియించు నీ చిత్త మెపుడు
త్పదాంబుజయుగళంబు రగి యున్న
తన రాజసగుణమునఁ లుగ దనఘ!

29

విను మదియుఁ గాక ప్రాణుల
యము నెఱుఁగంగరాని నఘుఁడఁ దేజో
నుఁడఁ బరేశుఁడ నీచే
ను గానంబడితి నిదె పితామహ! కంటే.

30

మఱియు, భూతేంద్రియగుణాత్ముం డనియు జగన్మయుం డనియు నన్ను నీ చిత్తంబు నందుఁ దలంపుము; తామరసనాళవివర పథంబు వెంటం జని జలంబులలోనం జూడం గోరి నట్టి మదీయ స్వరూపంబు.

31

నీ కిప్పుఁడు గానంబడె
నాకులకును నురగపతి పినాకులకైనన్
వాకొనఁగం దలపోయను
రాకుండు మదీయ రూపమ్యత్వంబుల్.

32

కావున మచ్చారిత్ర క
థా విలసిత మైన సుమహిస్తవము జగ
త్పానము విగతసంశయ
భావుఁడ వై బుద్ధినిలుపు పంకజజన్మా!

33

గుణుఁడ నై లీలార్థము
ములఁ గల్పింపఁ దలచు తురుని నన్నున్
గుణునిఁగా నుతియించితి
సంతస మయ్యె నాకుఁ దామరసభవా!

34

మంజుస్తవరాజము
నీ నమునఁ జింతఁ దక్కి నిలుపుము భక్తిన్
ధీహిత! నీ మనంబునఁ
గామించిన కోర్కు లెల్లఁ లుగుం జుమ్మీ.

35

నుదినమునుఁ ద్రిజగత్పా
మగు నీ మంగళస్తవంబుఁ బఠింపన్
వినినను జనులకు నేఁ బొడ
నఁబడుదు నవాప్తసకలకాముఁడ నగుచున్.

36

న తటా కోపనయన వివాహ దేవ
న నిర్మాణ భూమ్యాదివివిధదాన
ప తపోవ్రత యోగ యజ్ఞముల ఫలము
మామక స్తవఫలంబు సమంబు గాదు.

37

జీవావలిఁ గల్పించుచుఁ
జీవావలిలోనఁ దగ వసించుచుఁ బ్రియవ
స్త్వాలిలోపలఁ బ్రియవ
స్త్వాలి యై యుండు నన్ను నిశముఁ బ్రీతిన్.

38

లఁపుము మత్ప్రీతికి నై
లిగించితి నిన్ను భువనకారణ! నాలో
నడగి యేకమై ని
శ్చగతి వసియించి యున్న గముల నెల్లన్.

39

గ నహంకారమూలతత్త్వంబు నొంది
నీవు పుట్టింపు" మనుచు రాజీవభవుఁడు
వినఁగ నానతి యిచ్చి యవ్వజనాభుఁ
డంత నంతర్హితుం డయ్యె నఘచరిత!"

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత తృతీయ స్కంధములోని బ్రహ్మదేవుని విష్ణు స్తుతి అను స్తుతి