పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మాది దేవతల నరనారాయణ స్తుతి (దయా ప్రదం)

బ్రహ్మాది దేవతల నరనారాయణ స్తుతి (దయా ప్రదం)

1

ఆ సమయంబున బ్రహ్మాది దేవత లమ్మహాత్ములకడకుఁ జనుదెంచి యిట్లని స్తుతించిరి.

2

"గనస్థలిం దోఁచు గంధర్వనగరాది;
రూప భేదము లట్లు రూఢి మెఱసి
యే యాత్మయందేని యేపార మాయచే;
నీ విశ్వ మిటు రచియింపఁబడియె
ట్టి యాత్మప్రకాశార్థమై మునిరూప;
ముల ధర్ముగృహమునఁ బుట్టినట్టి
రమపురుష! నీకుఁ బ్రణమిల్లెద; మదియుఁ;
గాక యీ సృష్టి దుష్కర్మవృత్తి


రగనీకుండు కొఱకునై త్త్వగుణము
చే సృజించిన మమ్మిట్లు శ్రీనివాస
మైన సరసీరుహప్రభ పహసించు
నీ కృపాలోకనంబుల నెమ్మిఁ జూడు."

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత చతుర్థ స్కంధములోని బ్రహ్మాది దేవతల నరనారాయణ స్తుతి అను స్తుతి