స్తుతులు స్తోత్రాలు : భాగీరథకృత గంగాస్తుతి (జయ ప్రదం)
భాగీరథకృత గంగాస్తుతి (జయ ప్రదం)
మా వారి భస్మరాసుల
నీ వారిం గలిపికొనుము; నెఱి మావారల్
నీ వారిఁ గలయ నాకము
మావారికిఁ గలుగు నిది ప్రమాణము తల్లీ!
చెల్లన్ మదిన్ నిన్ను భజింతు గంగన్
ఫుల్లాంతరంగన్ బహుపుణ్యసంగం
గల్లోలలక్ష్మీజితకాశమల్లిం
దల్లిన్ సుధీకల్పలతామతల్లిన్.
ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత నవమ స్కంధములోని భాగీరథకృత గంగాస్తుతి అను స్తుతి