పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : అక్రూరుని రామకృష్ణుల స్తుతి (పవిత్ర కరం)

అక్రూరుని రామకృష్ణుల స్తుతి (పవిత్ర కరం)

1

లుడుం గృష్ణుఁడు మర్త్యులే? వసుమతీ భారంబు వారింప వా
రూపంబులఁ బుట్టినాఁడు హరి నిర్వాణప్రదుం; డిప్పు డు
జ్జ్వలుఁడై ప్రాణవియోగకాలమునఁ దత్సర్వేశుఁ జింతించువాఁ
ఘుశ్రేయముఁ బొందు బ్రహ్మమయుఁడై ర్కాభుఁడై నిత్యుఁడై

2

ట్టి నారాయణుం ఖిలాత్మభూతుండు;
కారణమానవాకారుఁడైనఁ
జిత్తంబు లతనిపైఁ జేర్చి సేవించితి;
తికృతార్థులరైతి; నవరతము
శోభిల్లు నింధనజ్యోతి చందంబున;
ఖిల భూతములందు తఁ; డతనికి
ననీ జనక దార ఖి పుత్ర బాంధవ;
త్రు ప్రియాప్రియ నులు లేరు


న్మకర్మములును న్మంబులును లేవు
శిష్టరక్షణంబు సేయుకొఱకు
గుణవిరహితుఁ డయ్యు గుణి యగు సర్వ ర
క్షణ వినాశకేళి లుపుచుండు.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - పూర్వ స్కంధములోని అక్రూరుని రామకృష్ణుల స్తుతి అను స్తుతి