పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : శుకుని హరికథల స్తుతి (భక్తిఫలప్రదం)

శుకుని హరికథల స్తుతి (భక్తిఫలప్రదం)

1

అట్టి పరమభాగవతుండైన పాండవేయునకు వాసుదేవ పరాయణుండైన శుకుం డిట్లనియె.

2

వాసుదేవశ్లోకవార్త లాలించుచుఁ;
గాల మే పుణ్యుండు డుపుచుండు
తని యాయువుఁ దక్క న్యుల యాయువు;
నుదయాస్తమయముల నుగ్రకరుఁడు
వంచించి గొనిపోవు; వాఁడది యెఱుఁగక;
జీవింతుఁ బెక్కేండ్లు సిద్ధ మనుచు
నంగనా పుత్ర గేహారామ విత్తాది;
సంసారహేతుక సంగ సుఖముఁ


గిలి వర్తింపఁ గాలంబు ఱి యెఱింగి
దండధరకింకరులు వచ్చి తాడనములు
సేసి కొనిపోవఁ బుణ్యంబు సేయ నైతిఁ
బాపరతి నైతి నని బిట్టు లవరించు.

3

అదిగావున.

4

లరు జొంపములతో భ్రంకషంబులై;
బ్రదుకవే వనములఁ బాదపములు;
ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు;
జీవింపవే గ్రామసీమలందు;
నియతిమై నుచ్ఛ్వాస నిశ్శ్వాస పవనముల్;
ప్రాప్తింపవే చర్మస్త్రికలును;
గ్రామసూకరశునశ్రేణు లింటింటఁ;
దిరుగవే దుర్యోగదీనవృత్తి;


నుష్ట్రఖరములు మోయవే యురుభరములఁ
బుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు
డవులందు నివాసములందుఁ బ్రాణ
విషయభరయుక్తితో నుంట విఫల మధిప!

5

విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు;
కొండల బిలములు కువలయేశ!
క్రిపద్యంబులఁ దువని జిహ్వలు;
ప్పల జిహ్వలు కౌరవేంద్ర!
శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు;
కేకిపింఛాక్షులు కీర్తిదయిత!
మలాక్షు పూజకుఁ గాని హస్తంబులు;
వము హస్తంబులు త్యవచన!


రిపద తులసీ దళామోద రతి లేని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర!
రుడగమను భజనతి లేని పదములు
పాదపముల పాదటల మనఘ!

6

నారాయణుని దివ్యనామాక్షరములపైఁ;
రఁగని మనములు ఠినశిలలు
మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ;
మిళితమై యుండని మేను మొద్దు
క్రికి మ్రొక్కని డుని యౌదల నున్న;
నక కిరీటంబు ట్టెమోపు
మాధవార్పితముగా నని మానవు సిరి;
నదుర్గ చంద్రికా వైభవంబు


కైటభారిభజన లిగి యుండని వాఁడు
గాలిలోన నుండి దలు శవము
మలనాభుపదముఁ నని వాని బ్రతుకు
సిఁడికాయలోని ప్రాణి బ్రతుకు."

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత ద్వితీయ స్కంధములోని శుకుని హరికథల స్తుతి అను స్తుతి