పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : శ్రుతదేవుని కృష్ణ స్తుతి (భక్తి ప్రదం)

శ్రుతదేవుని కృష్ణ స్తుతి (భక్తి ప్రదం)

1

రుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ త
చ్చణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్ రమా
రుఁ గని వల్కె భక్తజనత్సల! మామకభాగ్య మెట్టిదో
చతురాస్యులున్నెఱుఁగ ట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్.

2

ముని యోగిమానసస్ఫుట
జంబుల నెల్ల ప్రొద్దు ర్తించు భవ
ద్ఘదివ్యమూర్తి నా లో
గోచర మయ్యెఁ గాదె! ర్వాత్మ! హరీ!

3

దేవా! నీ సచ్చరితంబులు గర్ణరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజలొనర్చుచు నీచరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామ సంకీర్తనంబులు సేయుచుం దమ శరీ రంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులం గానంబడుచుందువు; కర్మవిక్షిప్తచిత్తులైన వారి హృదయంబుల నుండియు, దూరగుండ వగుదు;" వని మఱియు నిట్లనియె.

4

నీకు మ్రొక్కెదఁ గృష్ణ! నిగమాంత సంవేద్య! ;
లోకరక్షక! భక్తలోకవరద!
నీపాదసేవననిరతుని నన్ను నే;
నిఁ బంపె దానతి" మ్మనినఁ గృష్ణుఁ
డెలనవ్వు మోమునఁ జెలువొంద నా విప్రు;
ర మాత్మకరమునఁ దియఁ జేర్చి
పాటించి యతనితోఁ లికెఁ “దపశ్శక్తి;
ఱలిన యమ్మునిర్యు లెపుడుఁ


మ పదాంబుజరేణు వితానములను
విలి లోకంబులను బవిత్రంబు సేయు
వారు ననుఁ గూడి యెప్పుడు లయు నెడల
రుగుదెంతురు నీ భాగ్య రిమ నిటకు.

ఇది బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమత్తెలుగు భాగవతాంతర్గత దశమ - ఉత్తర స్కంధములోని శ్రుతదేవుని కృష్ణ స్తుతి అను స్తుతి