స్తుతులు స్తోత్రాలు : నల్లనివాడు రామ, కృష్ణుల పరంగా (వర ప్రదం)
రామపరంగా -
1.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.
కృష్ణపరంగా -
2.
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే
31
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత అంతర్గత దశమ స్కంధ పూర్వభాగము నందలి నల్లనివాడు..(వర ప్రసాదములు) అను నుతి