పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : అత్రి ముని త్రిమూర్తుల స్తుతి (సత్సంతాన ప్రదం)

  1
"ప్రతి కల్పమందు సర్వప్రపంచోద్భవ-
స్థితి వినాశంబులఁ జేయునట్టి
హిత మాయాగుణయ దేహములఁ బొల్చు-
జ వాసుదేవ శివాభిధాన
ములు గల్గు మీ పాదజాతములకు నే-
తిభక్తి వందనం బాచరింతు;
ఖిల చేతన మానసాగమ్య మన నొప్పు-
మూర్తులు గల్గు మీ మువ్వురందుఁ

  2
రఁగ నాచేతఁ బిలువంగఁ డిన ధీరుఁ
డెవ్వఁడే నొక్కరునిఁ బిల్వ నిపుడు మీరు
మువ్వు రేతెంచుటకు నాదు బుద్ధి విస్మ
యంబు గదిరెడిఁ జెప్పరే నఘులార!

  3
అదియునుం గాక, సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తంబున ధరియించిన మహాత్ముం డొక్కరుండ” యనిన నమ్మువ్వురు విబుధశ్రేష్ఠులు నతనిం గనుంగొని సుధామధురంబు లయిన వాక్యంబుల నిట్లనిరి.

  4
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత చతుర్థ స్కంధ అంతర్గత అత్రి ముని త్రిమూర్తుల స్తుతి (సత్సంతాన ప్రదం)