పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : చిత్రకేతు కృత సంకర్షణ/ఆదిశేషు స్తవము (జ్ఞాన ప్రదం)

  1
"అజితుఁడవై భక్తులచే
విజితుం డైనాఁడ విపుడు వేడుక వారున్
విజితులు నీచేఁ గోర్కులు
జియింపనివారు నిన్నుఁ డయుదురె? హరీ!

  2
నీ విభవంబు లీ జగము నిండుట యుండుట నాశ మొందుటల్
నీ విమలాంశజాతములు నెమ్మి జగంబు సృజించువార, లో
దే! భవద్గుణాంబుధుల తీరముఁ గానక యీశ! బుద్ధితో
వావిరిఁ జర్చ చేయుదురు వారికి వారలు దొడ్డవారలై.

  3
మాణువు మొదలుగఁ గొని
మము దుదిగాఁగ మధ్యరికీర్తనచే
స్థిరుఁడవు త్రయీవిదుఁడవై
రి సత్వాద్యంత మధ్య దృశగతుఁడవై.

  4
ర్వి మొదలైన యేడు నొండొకటికంటె
శగుణాధికమై యుండు; దాని నండ
కోశమందురు; నా యండకోటి యెవ్వఁ
డందు నణుమాత్రమగున నంతాఖ్యుఁ డతఁడు.
^ సప్తావరణలు.

  5
మఱియు, నొక్కచోట విషయతృష్ణాపరులైన నరపశువులు పరతత్త్వంబవైన నిన్ను మాని యైశ్వర్యకాములై తక్కిన దేవతల భజియింపుదురు; వారిచ్చు సంపదలు రాజకులంబునుంబోలె వారలంగూడి నాశంబునం బొందుచుండు; విషయకామములేని నిన్ను సేవించినవారు వేఁచిన విత్తనంబునుంబోలె దేహాంతరోత్పత్తి నొందకుండుదురు; నిర్గుణుండవై జ్ఞానవిజ్ఞాన రూపంబు నొందియున్న నిన్ను గుణసమేతునింగా జ్ఞానులు భావింపుదురు; నీ భజనం బే రూపున నయిన మోక్షంబు ప్రసాదించు; జితమతివైన నీవు భాగవత ధర్మం బే ప్రకారంబున నిర్ణయించితి; వా ప్రకారంబున సర్వోత్కృష్టుండ వైన నిన్ను సనత్కుమారాదులు మోక్షంబు కొఱకు సేవించుచున్నా; రీ భాగవత ధర్మంబునందు జ్ఞానహీనుం డొక్కండును లేఁ; డన్య కామ్యధర్మంబులందు విషమబుద్ధిచేత నేను నీవు నాకు నీకు నని వచియించుచున్నవాఁ డధర్మనిరతుండై క్షయించుచుండు; స్థావర జంగమ ప్రాణిసమూహంబునందు సమంబైన భాగవతధర్మంబుల వర్తించుచున్న మనుజునికి భవద్దర్శనంబువలనఁ బాపంబు క్షయించుట యేమి చిత్రం; బిపుడు భవత్పాదావలోకనంబున నిరస్తాశుండ నైతి; మూఢుండ నయిన నాకుఁ బూర్వ కాలంబున నారదుం డనుగ్రహించి, భగవద్ధర్మంబు దయచేసె; నది నేఁడు నాకు వరదుండ వయిన నీ కతంబున దృష్టంబయ్యె; ఖద్యోతంబులచేత సూర్యుండు గోచరుండు గానిమాడ్కి జగదాత్మకుండవయిన నీ మహత్త్వంబు మనుజులచేత నాచరింపబడి ప్రసిద్ధంబైనది గాదు; అం దుత్పత్తి స్థితి లయ కారణుండవై భగవంతుండ వైన నీకు నమస్కరించెద; నని మఱియును.

  6
రయ బ్రహ్మాదు లెవ్వని నునయించి
క్తియుక్తుల మనమునఁ బ్రస్తుతింతు?
వని యెవ్వని తలమీఁద నావగింజఁ
బోలు? నా వేయుశిరముల భోగిఁ గొల్తు."

  7
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత షష్ఠ స్కంధ అంతర్గత చిత్రకేతు కృత సంకర్షణ/ఆదిశేషు స్తవము (జ్ఞాన ప్రదం)