పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ::నరసింహ స్తుతులు::
ప్రహ్లాద కృత నృసింహ స్తుతి (రక్షా కరం)

  1
"రుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి
త్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా
ము ముట్టన్ నుతిచేయ నోపరఁట; నే క్షస్తనూజుండ గ
ర్వదోద్రిక్తుఁడ బాలుఁడన్ జడమతిన్ ర్ణింప శక్తుండనే?

  2
మున్ వంశముఁ దేజమున్ శ్రుతము సౌంర్యంబు నుద్యోగమున్
నిపుణత్వంబుఁ బ్రతాపపౌరుషములున్ నిష్ఠాబలప్రజ్ఞలున్
హోమంబులుఁ జాల వీశ్వర! భవత్సంతుష్టికై దంతి యూ
థఁపు చందంబున భక్తి జేయవలయుం దాత్పర్య సంయుక్తుఁడై.

  3
లజ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సర
త్వములన్ యజ్ఞ తపోనసూయలఁ గడున్ ర్పించు ధాత్రీసురో
త్తముకంటెన్ శ్వపచుండు ముఖ్యుఁడు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్
తన్ నిన్ను నయించెనేని, నిజ వం శ్రీకరుం డౌఁ దుదిన్.

  4
జ్ఞుండు చేసిన యారాధనములఁ జే-
ట్టఁ డీశ్వరుఁడు కృపాళుఁ డగుటఁ;
జేపట్టు నొకచోట; సిద్ధ మీశ్వరునకు-
ర్థంబు లేకుండు తఁడు పూర్ణు
డైన నర్థము లీశ్వరార్పణంబులు గాఁగఁ-
జేయుట ధర్మంబు; చేసెనేని
ద్దంబుఁ జూచిన ళికలలామంబు-
ప్రతిబింబితం బగు గిది మరల

  5
ర్థములు దోఁచుఁ; గావున ధికబుద్ధి
క్తి జేయంగవలయును క్తిఁ గాని
మెచ్ఛఁ డర్థంబు లొసఁగెడు మేరలందుఁ
రమ కరుణుండు హరి భక్తబాంధవుండు.

  6
కావున నల్పుఁడ సంస్తుతి
గావించెద వెఱపు లేక లనేరుపునన్;
నీ ర్ణనమున ముక్తికిఁ
బోవు నవిద్యను జయించి పురుషుఁ డనంతా!

  7
త్త్వాకరుఁడ వైన ర్వేశ! నీ యాజ్ఞ-
శిరముల నిడుకొని చేయువారు
బ్రహ్మాదు లమరులు య మందుచున్నారు-
నీ భీషణాకృతి నేఁడు చూచి;
రోషంబు మాను నీ రుచిరవిగ్రహములు-
ల్యాణకరములు గాని భీతి
రములు గావు లోములకు వృశ్చిక-
న్నగంబుల భంగి యముఁ జేయు

  8
సుర మర్దించితివి; సాధుర్ష మయ్యె;
వతరించిన పనిదీఱె లుక యేల?
లుషహారివి సంతోషకారి వనుచు
నిన్నుఁ దలఁతురు లోకులు నిర్మలాత్మ!

  9
దంష్ట్రా భ్రుకుటీ సటా నఖయు నుగ్రధ్వానయున్ రక్త కే
యున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ
సింహాకృతిఁ జూచి నే వెఱవఁ బూర్ణ క్రూర దుర్వార దు
ర్భ సంసారదవాగ్నికిన్ వెఱతు నీ పాదాశ్రయుం జేయవే.

  10
దేవా! సకల యోను లందును సుఖవియోగ దుఃఖసంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖనివారకంబు గాని దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న యేను నాకుం బ్రియుండవు సఖుండవుఁ బరదేవతవు నైన నీవగు బ్రహ్మగీతంబు లయిన లీలావతార కథావిశేషంబులఁ బఠియించుచు రాగాదినిర్ముక్తుండనై దుఃఖపుంజంబులఁ దరియించి భవదీయ చరణకమల స్మరణ సేవానిపుణులైన భక్తులం జేరి యుండెద; బాలునిఁ దల్లిదండ్రులును, రోగిని వైద్యదత్తంబయిన యౌషధంబును, సముద్రంబున మునింగెడు వాని నావయును, దక్కొరులు రక్షింపనేరని తెఱంగున సంసారతాప సంతప్యమానుండై నీచేత నుపేక్షితుం డయిన వాని నుద్ధరింప నీవు దక్క నన్యుండు సమర్థుండు గాఁడు; జగంబుల నెవ్వం డేమి కృత్యంబు నెవ్వనిచేతం బ్రేరితుండై యే యింద్రియంబులం జేసి యేమిటి కొఱకు నెవ్వనికి సంబంధి యై యే స్థలంబున నే సమయంబునం దేమి రూపంబున నే గుణంబున నపరంబయిన జనకాది భావంబున నుత్పాదించి పరంబయిన బ్రహ్మాదిభావంబున రూపాంతరంబు నొందించు నట్టి వివిధప్రకారంబు లన్నియు నిత్యముక్తుండవు రక్షకుండవు నైన నీవ; నీ యంశంబైన పురుషునికి నీ యనుగ్రహంబునఁ గాలంబుచేతం బ్రేరితయై కర్మమయంబును బలయుతంబును బ్రధానలింగంబును నైన మనంబును నీ మాయ సృజియించు; నవిద్యార్పితవికారంబును వేదోక్తకర్మప్రధానంబును సంసారచక్రాత్మకంబైన యీ మనమున నిన్ను సేవింపక నియమించి తరియింప నొక్కరుండును సమర్థుండు లేడు; విజ్ఞాననిర్జిత బుద్ధిగుణుండవు; నీ వలన వశీకృత కార్యసాధన శక్తి యైన కాలంబు మాయతోడం గూడ షోడశవికారయుక్తం బయిన సంసారచక్రంబుఁ జేయుచుండు; సంసారదావదహన తంతప్యమానుండ నగు నన్ను రక్షింపుము.
^[షోడశ వికారములు]

  11
నులు దిక్పాలుర సంపదాయుర్విభ-
ములు గోరుదురు భవ్యంబు లనుచు;
వి యంతయును రోషహాసజృంభితమైన-
మాతండ్రి బొమముడి హిమఁ జేసి
విహతంబులగు; నట్టి వీరుండు నీ చేత-
నిమిషమాత్రంబున నేఁడు మడిసె;
కావున ధ్రువములు గావు బ్రహ్మాదుల-
శ్రీవిభవంబులు జీవితములుఁ;

  12
గాలరూపకుఁ డగు నురుక్రమునిచేత
విదళితములగు; నిలువవు; వేయు నేల?
యితర మే నొల్ల నీ మీఁది యెఱుక గొంత
లిగియున్నది గొలుతుఁ గింరుఁడ నగుచు.

  13
ఎంమావులవంటి భద్రము లెల్ల సార్థము లంచు మ
ర్త్యుండు రోగనిధాన దేహముతో విరక్తుఁ డుగాక యు
ద్దం మన్మథవహ్ని నెప్పుడుఁ ప్తుఁడై యొకనాఁడుఁ జే
రండు పారము దుష్టసౌఖ్య పరంపరాక్రమణంబునన్.

  14
శ్రీహిళా, మహేశ, సరసీరుహగర్భుల కైన నీ మహో
ద్దాకరంబుచే నభయదానము జేయవు; నేను బాలుఁడం
దాస వంశ సంభవుఁడ దైత్యుఁడ నుగ్ర రజోగుణుండ ని
స్సీ దయం గరాంబుజము శీర్షముఁజేర్చుట చోద్య మీశ్వరా!

  15
మహాత్మా! సుజనులయిన బ్రహ్మాదు లందును దుర్జనులైన మా యందును సేవానురూపంబుగం బక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు జేయుదువు; కందర్ప సమేతం బగు సంసారకూపంబునం గూలుచున్న మూఢజనులం గూడి కూలెడు నేను భవదీయభృత్యుం డగు నారదుని యనుగ్రహంబునం జేసి నీ కృపకుం బాత్రుండ నైతి; నన్ను రక్షించి మజ్జనకుని వధియించుట నా యందులఁ బక్షపాతంబు గాదు; దుష్టదనుజ సంహారంబును శిష్ట భృత్య మునిజన రక్షాప్రకారంబును నీకు నైజగుణంబులు; విశ్వంబు నీవ; గుణాత్మకం బయిన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతుభూతగుణయుక్తుండవై రక్షకసంహారకారాది నానారూపంబుల నుండుదువు; సదసత్కారణకార్యాత్మకం బయిన విశ్వంబునకు పరమకారణంబు నీవ; నీ మాయచేత వీఁడు దా ననియెడి బుద్ధి వికల్పంబు దోఁచుగాని నీకంటె నొండెద్దియు లేదు; బీజంబు నందు వస్తుమాత్రభూత సౌక్ష్మ్యంబును వృక్షంబు నందు నీలత్వాది వర్ణంబునుం గలుగు తెఱంగున; విశ్వంబునకు నీ యంద జన్మ స్థితి ప్రకాశ నాశంబులుం గలుగు; నీ చేత నయిన విశ్వంబు నీ యంద నిలుపు కొని తొల్లి ప్రళయకాలపారావారంబునఁ బన్నగేంద్రపర్యంకంబునఁ గ్రియారహితుండవై నిజసుఖానుభవంబు జేయుచు నిద్రితుని భంగి యోగనిమీలితలోచనుండవై మెలంగుచుఁ గొంత కాలంబునకు నిజ కాలశక్తిచేతం బ్రేరితంబులై ప్రకృతిధర్మంబు లయిన సత్త్వాదిగుణంబుల నంగీకరించి సమాధిచాలించి విలసించుచున్న నీనాభి యందు వటబీజంబువలన నుద్భవించు వటంబు తెఱంగున నొక్క కమలంబు సంభవించె; నట్టి కమలంబువలన నాల్గుమోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నొండయిన రూపంబు లేకుండుటఁ జింతించి జలాంతరాళంబుఁ బ్రవేశించి జలంబు లందు నూఱు దివ్యవత్సరంబులు వెదకి తన జన్మంబునకు నుపాదానకారణం బైన నిన్ను దర్శింప సమర్థుండు గాక, మగిడి కమలంబుకడకుం జని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భరతపంబు జేసి పృథివి యందు గంధంబు గను చందంబునఁ దన యందు నానాసహస్రవదన శిరో నయన నాసా కర్ణ వక్త్ర భుజ కర చరణుండును బహువిధాభరణుండును మాయాకలితుండును మహాలక్షణలక్షితుండును నిజప్రకాశదూరీకృత తముండును బురుషోత్తముండును నయిన నిన్ను దర్శించె; న య్యవసరంబున.

  16
ఘోకవదనుఁడ వై మధు
కైభులం ద్రుంచి నిగమణముల నెల్లం
బాటించి యజున కిచ్చిన
కూస్థుఁడ వీశ్వరుఁడవు కోవిదవంద్యా!

  17
ఇవ్విధంబున గృత త్రేతా ద్వాపరంబులను మూఁడు యుగంబు లందును దిర్యఙ్మానవ ముని జలచరాకారంబుల నవతరించి లోకంబుల నుద్ధరించుచు, ధరించుచు, హరించుచు యుగానుకూల ధర్మంబులం బ్రతిష్ఠించుచు నుండుదువు; దేవా! యవధరింపుము.

  18
కామహర్షాది సంటితమై చిత్తంబు-
వదీయ చింతనదవి చొరదు;
ధురాదిరసముల రగి చొక్కుచు జిహ్వ-
నీ వర్ణనమునకు నిగుడనీదు;
సుందరీముఖములఁ జూడఁగోరెడి జూడ్కి-
తావకాకృతులపైఁ గులుపడదు;
వివిధ దుర్భాషలు వినఁ గోరు వీనులు-
వినవు యుష్మత్కథావిరచనములు;

  19
ఘ్రాణ మురవడిఁ దిరుగు దుర్గంధములకు
వులు గొలుపదు వైష్ణవర్మములకు;
డఁగి యుండవు కర్మేంద్రిములు పురుషుఁ
లఁచు, సవతులు గృహమేధిఁ లఁచు నట్లు.

  20
ఇ వ్విధంబున నింద్రియంబులచేతఁ జిక్కుపడి స్వకీయ పరకీయ శరీరంబు లందు మిత్రామిత్ర భావంబులు జేయుచు జన్మమరణంబుల నొందుచు సంసారవైతరణీ నిమగ్నంబైన లోకంబు నుద్ధరింటుట లోక సంభవ స్థితి లయ కారణుండ వైన నీకుం గర్తవ్యంబు; భవదీయ సేవకులమైన మా యందుఁ బ్రియభక్తు లయిన వారల నుద్ధరింపుము.

  21
వద్దివ్య గుణానువర్తన సుధాప్రాప్తైక చిత్తుండ నై
బెడన్ సంసరణోగ్రవై తరణికిన్; భిన్నాత్ములై తావకీ
గుణస్తోత్ర పరాఙ్ముఖత్వమున మాయాసౌఖ్యభావంబులన్
సుతిం గానని మూఢులం గని మదిన్ శోకింతు సర్వేశ్వరా!

  22
దేవా! మునీంద్రులు నిజవిముక్త కాములయి విజనస్థలంబులం దపంబు లాచరింతురు; కాముకత్వంబు నొల్లక యుండువారికి నీ కంటె నొండు శరణంబు లేదు గావున నిన్ను సేవించెదరు; కొందఱు కాముకులు కరద్వయ కండూతిచేతం దనియని చందంబునఁ దుచ్ఛంబయి పశు పక్షి క్రిమి కీట సామాన్యం బయిన మైథునాది గృహ మేది సుఖంబులం దనియక కడపట నతి దుఃఖవంతు లగుదురు; నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముం డయియుండు. మౌనవ్రత జప తప శ్శ్రుతాధ్యయనంబులును నిజధర్మవ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులును మోక్షహేతువులగు; నయిన నివి పదియు నింద్రియజయంబు లేనివారికి భోగార్థంబులయి విక్రయించువారికి జీవనోపాయంబులయి యుండు; డాంభికులకు వార్తాకరంబులై యుండు, సఫలంబులుగావు; భక్తి లేక భవదీయజ్ఞానంబు లేదు; రూపరహితుండ వైన నీకు బీజాంకురంబులకైవడిఁ గారణకార్యంబు లయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశమానంబు లగు; నా రెంటి యందును భక్తియోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున నిన్ను బొడఁగందురు; పంచభూత తన్మాత్రంబులును ప్రాణేంద్రియంబులును మనోబుద్ధ్యహంకార చిత్తంబులును నీవ; సగుణంబును నిర్గుణంబును నీవ; గుణాభిమాను లయిన జననమరణంబుల నొందు విబుధు లాద్యంతంబులు గానక నిరుపాధికుండవైన నిన్నెఱుంగరు; తత్త్వజ్ఞులయిన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంతప్రతిపాద్యుండ వగు నిన్ను సమాధివిశేషంబుల నెఱింగి సేవింతు; రదిగావున.

  23
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ-
మోదించి నిత్యంబు మ్రొక్కఁడేని
నీ మంగళస్తవ నికర వర్ణంబులు-
లుమాఱు నాలుకఁ లుకఁడేని
నీ యధీనములుగా నిఖిలకృత్యంబులు-
ప్రియభావమున సమర్పింపఁడేని
నీ పదాంబుజముల నిర్మల హృదయుఁడై-
చింతించి మక్కువఁ జిక్కఁడేని

  24
నిన్నుఁ జెవులార వినఁడేని నీకు సేవ
చేయరాఁడేని బ్రహ్మంబు జెందఁ గలఁడె?
యోగి యైనఁ దపోవ్రతయోగి యైన
వేది యైన మహాతత్త్వవేది యైన.

  25
కావున భవదీయ దాస్యయోగంబుఁ గృపజేయు"మని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణం డయిన హరి రోషంబు విడిచి; యిట్లనియె.
రాగద్వేషాదులు

  26
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత సప్తమ స్కంధ అంతర్గత ప్రహ్లాద కృత నృసింహ స్తుతి (రక్షా కరం)