పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : వృత్రాసుర కృత స్తుతి (అనన్య భక్తి ప్రదము)

  1
"యఁగ భక్తపాలనము లైన భవద్గుణజాల మాత్మ సం
స్మణము చేయ వాక్కు నిను న్నుతి చేయ శరీరమెల్లఁ గిం
పరివృత్తి చేయ మదిఁ గాంక్ష యొనర్చెదఁ గాని యొల్ల నే
రిది ధ్రువోన్నతస్థలము బ్జజు పట్టణ మింద్ర భోగమున్.

  2
ఆఁలి గొన్న క్రేపులు రయంబున నీకలురాని పక్షులున్
దీకొని తల్లికిన్ మఱి విదేశగతుండగు భర్త కంగజ
వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో!
శ్రీర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నామది గోరెడుం గదే.

  3
నాకును సఖ్యము పుణ్య
శ్లోకులతోఁగాని తత్త్వశూన్యులు సంసా
రై విమోహులతోడం
గాకుండనొనర్పుమయ్య కంజదళాక్షా"

  4
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత షష్ఠ స్కంధ అంతర్గత వృత్రాసుర కృత స్తుతి (అనన్య భక్తి ప్రదము)