పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : వసుదేవుడు భగవంతుని పొగడుట (సంతాన లాభము)

  1
చాఁగి మ్రొక్కి లేచి రగున నొసలిపైఁ
గేలుఁదమ్మిదోయిఁ గీలుకొలిపి
పాపఁ డనక వెఱక పాపని మొదలింటి
పోకలెల్లఁ దలఁచి పొగడఁ దొడఁగె.

  2
"ఏ నిన్ను నఖిలదర్శను
జ్ఞానానందస్వరూపు సంతతు నపరా
ధీనుని మాయాదూరుని
సూనునిఁగాఁ గంటి; నిట్టి చోద్యము గలదే?

  3
చ్చుగ నీ మాయను మును
జెచ్చెరఁ ద్రిగుణాత్మకముగఁ జేసిన జగముల్
జొచ్చిన క్రియఁ జొరకుందువు
చొచ్చుటయును లేదు; లేదు చొరకుండుటయున్.

  4
దియు నెట్లన మహదాదులఁ బోలెడి-
దై వేఱువేఱయై న్నివిధము
గు సూక్ష్మభూతంబు మర షోడశ వికా-
ములతోఁ గూడి విరాట్టనంగఁ
రమాత్మునకు నీకు ఱపైన మేను సం-
పాదించి యందు లోఁడియుఁ బడక
యుండు సృష్టికి మున్న యున్న కారణమున-
వానికి లోనిభవంబు గలుగ;

  5
ట్లు బుద్ధి నెఱుఁగ నువైన లాగునఁ
లుగు నింద్రియముల డలనుండి
వాని పట్టులేక రుస జగంబులఁ
లసియుండి యైనఁ లయ వెపుడు.
షోడశవికారములు

  6
ర్వము నీలోనిదిగా
ర్వాత్ముఁడ; వాత్మవస్తు సంపన్నుఁడవై
ర్వమయుఁడ వగు నీకును
ర్వేశ్వర! లేవు లోను సందులు వెలియున్.

  7
త్మ వలనఁ గలిగి మరు దేహాదుల
నాత్మకంటె వేఱు వి యటంచు
లఁచువాఁడు మూఢముఁడు గావునఁ నీశ!
విశ్వ మెల్ల నీవ వేఱు లేదు.

  8
గుణము వికారంబుఁ గోరికయును లేని-
నీ వలన జగంబు నెఱి జనించుఁ;
బ్రబ్బు; లేదగు; నంచుఁ లుకుట తప్పుగా-
దీశుండవై బ్రహ్మ మీవ యైన
నినుఁ గొల్చు గుణములు నీ యానతులు చేయ,-
టులశౌర్యంబులు తికి వచ్చు
గిది నీ గుణముల బాగులు నీ వని-
తోఁచును నీ మాయతోడఁ గూడి

  9
నీవు రక్త ధవళ నీల వర్ణంబుల
గము చేయఁ గావ మయఁ జూడఁ
నరు; దట్లు నేఁడు దైత్యుల దండింపఁ
బృథివి గావ నవతరించి తీశ!

  10
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత వసుదేవుడు భగవంతుని పొగడుట (సంతాన లాభము)