పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మాది కృత శ్రీహరి స్తుతి (శ్రేయస్కరం)

  1
హా కిరీట కేయూ కుండల పాద-
టక కాంచీలతా కంకణాది
కౌస్తుభోపేతంబుఁ గౌమోదకీ శంఖ-
క్ర శరాసన సంయుతంబు
రకతశ్యామంబు రసిజ నేత్రంబుఁ-
ర్ణాభరణ కాంతి గండ యుగముఁ
లిత కాంచనవర్ణ కౌశేయవస్త్రంబు-
శ్రీ వనమాలికా సేవితంబు

  2
నై మనోహరంబునై దివ్యసౌభాగ్య
మైన యతని రూపు ర్ష మెసఁగ
జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును
బొంగి నమ్రుఁ డగుచుఁ బొగడఁ దొడఁగె.

  3
"జనస్థితిలయ దూరుని
మునినుతు నిర్వాణసుఖసముద్రుని సుగుణుం
నుతనునిఁ బృథుల పృథులుని
ఘాత్ము మహానుభావు భినందింతున్.

  4
పురుషోత్తమ! నీ రూపము
మశ్రేయంబు భువన పంక్తుల కెల్లన్
స్థివైదిక యోగంబున
రుసను మీ యంద కానచ్చెను మాకున్.

  5
మొలును నీలోఁ దోఁచెను;
దుదియును నటఁ దోఁచె; నడుమ దోఁచెను; నీవే
మొలు నడుమ దుది సృష్టికిఁ
దియఁగ ఘటమునకు మన్ను తి యగు మాడ్కిన్.

  6
నీ మాయ చేత విశ్వము
వేమాఱు సృజింతు వనుచు విష్ణుఁడ వనుచున్
ధీమంతులు గుణపద విని
నేమంబున సగుణుఁడైన నినుఁ గాంతు రొగిన్.

  7
న్న మవని యందు మృతంబు గోవుల
యందు వహ్ని సమిధలందు నమర
యోగవశతఁ బొందు నోజను బుద్ధిచే
గుణు నిన్నుఁ గాంతు రాత్మవిదులు.

  8
ట్టులేక బహుప్రకార విన్న చిత్తులమైతి; మే
మెట్టకేలకు నిన్నుఁ గంటి మభీప్సితార్థము వచ్చుఁ; బె
న్వెట్టయైన దవానలంబున వేఁగు నేనుఁగు మొత్తముల్
నిట్టవేర్చిన గంగలోపల నీరు గాంచిన చాడ్పునన్.

  9
నీకు నే మని విన్నవింతుము నీవు సర్వమయుండవై
లోమెల్లను నిండి యుండగ లోకలోచన! నీ పదా
లోనంబు శుభంబు మాకును లోకపాలకు లేను నీ
నావాసులు నీవ వహ్నిఁ దర్చు కేతుతతిక్రియన్."

  10
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత అష్టమ స్కంధ అంతర్గత బ్రహ్మాది కృత శ్రీహరి స్తుతి (శ్రేయస్కరం)