పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ** బ్రహ్మ స్తవంబు (ఆపద నివారణం)

  1
"అంచిత దివ్యమూర్తి! పరమాత్మక! యీ కలుషాత్ముఁ డైన న
క్తంరుఁ డస్మదీయ వరర్వమునన్ భువనంబు లెల్లఁ గా
రించు మదించి యిట్టి విపరీతచరిత్రునిఁ ద్రుంప కిట్లుపే
క్షించుటగాదు వీని బలిసేయు వసుంధరకున్ శుభంబగున్.

  2
బాలుఁడు గరమున నుగ్ర
వ్యాము ధరియించి యాడు డుపున రక్షః
పాలునిఁ ద్రుంపక యూరక
పాలార్చుట నీతియే శుప్రద! యింకన్.

  3
అదియునుం గాక.

  4
ఘా! యీ యభిజిన్ముహూర్తమున దేవారాతి మర్దింపవే
యంబున్ మఱి దైత్యవేళ యగు సంధ్యాకాల మేతెంచినన్
మాయాబలశాలి యైన దనుజున్ ఖండింపఁగా రాదు గా
వు నీవేళన త్రుంపు సజ్జనహితప్రోద్యోగరక్తుండవై."

  5
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత తృతీయ స్కంధ అంతర్గత బ్రహ్మ స్తవంబు (ఆపద నివారణం)